neerab kumar prasad
-
ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్
-
గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ నీరభ్‌కుమార్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లిన సీఎస్ నీరభ్.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్‌గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది. సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజులతో కూడిన పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సీసీఎల్ఏ, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యిందని, మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది గుర్తించాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల వద్ద ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని కోరారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకూ 23,180 ఎకరాల భూమిని గుర్తించామని, ఇంకా అవసరమైన భూమిని త్వరగా గుర్తించాలన్నారు. -
ఆ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కే
* 5గురు ఐఏఎస్‌లు, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేసిన టీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లు, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల్లో నీరబ్‌కుమార్ ప్రసాద్, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేశ్, గిరిజా శంకర్, హరి జవహర్లాల్, లక్ష్మీకాంతం ఉన్నారు. ఐపీఎస్ అధికారుల్లో కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి, డాక్టర్ ఎం.కాంతారావు, నాగేంద్రకుమార్, కాంతిరాణా టాటా, శ్యాంసుందర్, సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఆర్.రాజ్యలక్ష్మి, డాక్టర్ గజరావు భూపాల్, కె.కోటేశ్వరరావు, ఎల్‌కేవీ రంగారావు, జి.పాలరాజు, కె.ఫకీరప్ప ఉన్నారు. బుధవారం మిగిలిన అధికారులందర్నీ ప్రభుత్వం రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లపై సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మతో సమాలోచనలు చేశారు. తెలంగాణకు కేటాయించిన అధికారులను ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటి తర్వాత రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, కోలిండియా సీఎండీగా ఎంపికైన సుతీర్థ భట్టాచార్యను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు విభజిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.