Nepal new government
-
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి నాలుగోసారి నియమి తులయ్యారు. ఆదివారం అధ్యక్షుడు రాం చంద్ర పౌడెల్ ఆయన్ను ప్రధానిగా నియమించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్– యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)–నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)లతో కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి చైనా అనుకూలవాదిగా పేరున్న ఓలి నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్లో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఓలితోపాటు ఆయన మంత్రివర్గం సోమవారం ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు. -
దేవ్బాను ప్రధానిగా నియమించండి
ఖాట్మాండూ: నేపాల్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాను ప్రధానిగా నియమించా లంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సూచించింది. చీఫ్ జస్టిస్ చోళేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును సోమవారం వెలువరిం చింది. మంగళవారంలోగా దేవ్బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు సభ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (5) ప్రకారం ప్రధానిని ఎన్నుకొనే ఓటింగ్లో పార్టీ విప్ ఏ మాత్రం పని చేయబోదని సీజే జస్టిస్రాణా తెలిపారు. రాజ్యాంగ విరుద్ధం నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంట్దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ఓలీ నిర్ణయం దీంతో బెడిసికొట్టింది. నవంబర్ 12, 19లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దేవ్బాకు మద్దతు దిగువ సభను రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 146 మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి వేసిన పిటిషన్ కూడా ఉంది. మెజారిటీకి అవసరమైన మద్దతు తమ సంకీర్ణ కూటమిలో ఉన్నందున అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కూటమిలో సభ్యుడైన నేపాల్ కమ్యూనిస్ట్పార్టీ–యూఎంఎల్ నేత మాధవ్ కుమార్ మాట్లాడుతూ.. చేయాల్సి ందంతా సుప్రీంకోర్టు చేయడంతో ఇక తామేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేవ్బా గతంలో నాలుగు సార్లు ప్రధానిగా పని చేశారు. 1995–97, 2001–02, 2004–05, 2017–18 మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో అయిదోసారి ప్రధాని కానున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదా రులు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిని మేము పాటించాల్సిన అవసరం లేదు అని నినాదాలున్న కార్డులను పట్టుకొని వీధుల్లో నిరసనలు తెలిపారు. ఓలీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోవడంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. -
నేపాల్ సంక్షోభం.. భారత్ కు మంచిదే!
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలీ ఆదివారం రాజీనామా చేశారు. విశ్వాసపరీక్షకు ఒక రోజు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు నేపాలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచండ కఠ్మాండు పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాలను చైనాకు అనుకూలంగా తీసుకుంటుండగా, ఓలీ పదవికి రాజీనామా చేయడం భారతదేశానికి ఒకరకంగా శుభవార్తే. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 305ను అనుసరించి అధ్యక్షురాలు భండారీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్ కాంగ్రెస్ లీడర్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కేవలం పార్లమెంటుకు మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని అన్నారు. 287 రోజుల పాటు నేపాల్ ప్రధాన మంత్రిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ చర్యలు దేశానికి హాని చేసేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది ఎంతలా మారిందంటే కనీసం కేర్ టేకర్ గా ఉంటానని అధ్యక్షురాలిని ఓలీ కోరినా ససేమీరా అనేంతలా. దీంతో గత్యంతరం లేని ఓలీ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఓలీపై వ్యతిరేకతకు కారణాలు ఇవీ... 1. నేపాల్ లో అత్యధిక సంఖ్యలో ఉన్న మాధేశీలపై వివక్షను చూపడం. దీంతో మాధేశీలు కొన్ని నెలలపాటు ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. భారత్-నేపాల్ బోర్డర్లో పెద్ద స్థాయిలో ఉద్యమాలు సాగాయి. 2. 2015లో నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం తర్వాత నిర్వాసితులకు రక్షణ కల్పించడంలో ఓలీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. 3. భారత్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని తప్పించి చైనాతో స్నేహం చేస్తూ యాంటీ-ఇండియన్ స్టేట్ డెవలప్ చేయడానికి ఓలీ ప్రయత్నం చేశారు. 4. నేపాల్ రాజ్యాంగంలోని లోపాలను సవరించకుండా ఉంచడంతో, తెరాయ్ రీజయన్ల నుంచి ప్రమాదం ఉంటుందన్న భావనతో 2015లో నేపాల్-భారత్ బోర్డర్లో ఇండియా కఠినంగా వ్యవహరించింది. భారత ప్రధాని 'సమావేశీ సంవిధాన్' ద్వారా నేపాలీ నాయకత్వాన్ని సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాకుండా నేపాల్ తో భారత్ సంబంధాలను పలువిధాలుగా మార్చి చూపారు. నేపాల్ లో ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు చైనా మావోయిస్టు పార్టీలను సంప్రదించింది. లెఫ్ట్ పార్టీలను అన్నింటినీ ఒక్కటి చేయాలని చూసిన చైనా పన్నాగం పారలేదు. ప్రచండను ఒప్పించగలిగిన చైనా, నేపాల్ ప్రజల నుంచి ప్రచండకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను మాత్రం ఏమీ చేయలేకపోయింది. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ వేరేలా ఉంటుండటంతో చైనాకు దన్నుగా నిలవలేమని ప్రచండ చెప్పేశారు. దాంతో ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. యాంటీ ఇండియా సెంటిమెంటును భారత్ చుట్టుపక్కల ఉన్నదేశాలకు ఎక్కించేందుకు చైనా చేసిన ప్రయత్నానికి తెరపడింది. చైనా చేయాలనుకున్న పనే దానికి రివర్స్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి భారత్ తన పూర్తి మద్దతును అందించనుంది.