Net work
-
తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో జియో ట్రూ5జీ సేవలు షురూ
విజయవాడ: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ కోసం జియో ఇప్పటికే రూ. 26,000 కోట్లతోపాటు అదనంగా 5జీనెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జీయో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉందని ఏపీ జియో సీఈఓ మందపల్లి మహేష్ కుమార్ తెలిపారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందనీ, జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ-5జీ ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ ఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ను విస్తరిస్తాం : గౌతమ్ రెడ్డి
-
గిరిజన విద్యార్థుల గోస: పాఠం వినబడదు.. దృశ్యం కనబడదు
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): కరోనాతో రెండేళ్లుగా విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉంటున్నారు. పరీక్షలు రాయకుండానే పైతరగతులకు ప్రమోట్ అవుతున్నారు. ఈ (2021–22) విద్యా సంవత్సరం కూడా ఆన్లైన్ తరగతులతోనే ప్రారంభమైంది. ఈనెల 1నుంచి బోధన షురూ అయింది. అయితే గిరిజన విద్యార్థులకు “తెర’ పాఠాలు చేరడం లేదు. గిరిజన సంక్షేమ శాఖలో విద్యనభ్యసిస్తున్న సుమారు 10 వేల మంది డిజిటల్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేక, ఫోన్ ఉన్నా రీచార్జి చేయించే స్థోమత లేక విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి. ప్రత్యామ్నాయంగా గిరిజన సంక్షేమ శాఖ వర్క్ షీట్ల విధానానికి శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు టెండర్లు ప్రక్రియే దాటలేదు. గిరిజన శాఖ పరిధిలో 126 పాఠశాలలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 126 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 906 గిరిజన ప్రాథమిక, 10 వసతి గృహాలున్నాయి. వీటిలో 35,669 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఉచిత వసతి, నాణ్యమైన విద్య అందిస్తోంది. కరోనా కారణంగా 2020, మార్చి 23 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. అప్పటి నుంచి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని విద్యార్థులు ఆశపడ్డారు. అయితే కరోనా సెకండ్‌వేవ్ ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ పాఠాలకు దూరం.. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మందికి టీవీ సౌకర్యం లేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగం గురించి చాలా మందికి తెలియదు. ఉన్నవారికి సెల్ సిగ్నల్స్ అందవు. మరికొందరికి నెలనెలా ఫోన్ రీచార్జి చేయించే స్థోమత లేదు. ఇంటర్నెట్ సౌకర్యం చాలా గిరిజన గ్రామాలకు అందుబాటులో లేదు. అడపాదడపా వచ్చే సిగ్నల్స్‌తో పాఠం వినబడితే దృశ్యం కనబడదు.. దృశ్యం కనిపిస్తే పాఠం వినపడని పరిస్థితి. ఫలితంగా ఏజెన్సీ పరిధిలోని 9,460 మంది విద్యార్థులు ఆన్లైన్ చదువులకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వర్క్షీట్లు, లర్నింగ్ కిట్లు అత్యవసరం. వీటిని త్వరగా అందించి తమ పిల్లలు చదువుకు దూరం కాకుండా, పాఠాలు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నెట్వర్క్ సమస్య ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్స్ అందేలా చూడాలని విన్నవిస్తున్నారు. టెండర్ల దశ దాటని వర్క్షీట్లు.. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ తరగతులతో ప్రారంభించడంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ పరిధిలోని విద్యార్థులకు వర్క్షీట్లు, లర్నింగ్ కిట్లు పోస్టల్ ద్వారా అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థుల పోస్టల్ అడ్రస్‌లు సేకరించారు. అయితే వర్క్షీట్ల తయారీ, లర్నింగ్ కిట్ల కోసం టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈనెల 7న టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ ముగిసి విద్యార్థులకు వర్క్షీట్లు అందాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుందో స్పష్టత లేదు. అప్పటి వరకు చిన్నారుల చదువులకు ఆటంకం తప్పేలా లేదు. -
సమాజానికి ఓ స్వరం
ఒక్కరే పోరాడితే పని జరగడం లేదనుకొన్నప్పుడు సమూహంగా, సామాజిక సంబం ధాల నెట్‌వర్క్‌ను ఆసరాగా చేసుకొని పోరాడడం ఫలితాలిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని ఒక కుగ్రామం పెద మిడిసెలేరుకు చెందిన వ్యక్తి సాగర్. ఎక్కడో అడవుల మధ్యనున్న వాళ్ల పల్లెలోకి బస్ సౌకర్యం లేదు. ‘అంత మారుమూల పల్లెలోకి బస్సులను పంపలేం’ అనేది ఆర్టీసీ అధికారుల అభిప్రాయం. మరి ఆ మారుమూల పల్లెలోకి బస్సే రాలేనప్పుడు, అక్కడి జనాలు ఎలా బయటకు వస్తారు? భద్రాచలం టౌన్లో చదువుకొంటున్న సాగర్ తమ ఊరికి బస్సులేని విషయాన్ని ‘సిటిజన్ జర్నలిస్ట్ నెట్ స్వర’ (సిజీనెట్ స్వర)లో పోస్టు చేశాడు. అంతే! కొన్ని రోజులకే పెద్దమిడిసెలేరుకు బస్సు వచ్చింది! అది సీజీనెట్ స్వర పుణ్యమే! సీజీనెట్ స్వర ఏం చేసిందంటే... ఇదొక సోషల్నెట్ వర్కింగ్సైట్. దీనిలో సభ్యులు అంతా సామాజిక బాధ్యత ఉన్న యువతీ యువకులు. ఇక్కడ ఏదైనా ఒక సామాజిక సమస్య గురించి పోస్టు చేస్తే... దాని పరిష్కారం గురించి ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. సాగర్ వాళ్ల ఊరికి సంబంధించిన సమస్య గురించి అక్కడ పోస్టు చేయగానే అనేక మంది ఆర్టీసీ అధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకొని సమస్య గురించి వివరించారు. ఆ పల్లెటూరి గురించి వివరించారు. ఒకటి కాదు అలా వందల కొద్దీ ఫోన్‌కాల్స్ వచ్చేసరికి అధికారుల్లో కదలిక. ఆ పల్లె ఎక్కడుంది... దానికి బస్సు సౌకర్యం లేదెందుకని అధికారులు విచారించి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇలా సీజీనెట్ స్వర ఒక సమూహంగా సాధించిన విజయాల్లో సాగర్ వాళ్ల ఊరికి బస్సు సౌకర్యం చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రధానంగా గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సోషల్నెట్వర్కింగ్ సైట్ విజయాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడే పరిష్కారం ప్రభుత్వంతో పని చేయించుకోవడం గురించి పక్కా వ్యూహాన్ని రచించడమే ఈ వేదిక లక్ష్యం. మనం ఒక సమస్య గురించి పోస్టు చేస్తే.. దానికి అనేక పరిష్కార మార్గాలను వారు సూచిస్తారు. అవసరమైన సందర్భంలో తమ వంతు సహాయం చేస్తారు. ఒక్కరే పోరాడితే పని జరగడం లేదనుకొన్నప్పుడు సమూహంగా, సామాజిక సంబంధాల నెట్వర్క్ మాధ్యమంగా పోరాడు తున్నారు. రోడ్లపైకి రానవసరం లేదు, ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారానే అధికారులపై ఒత్తిడి మొదలవుతోంది. విధి లేక అధికారులు స్పందించాల్సి వస్తోంది. దీంతో ‘సీజీనెట్ స్వర’ సామాన్యుల స్వరాన్ని చాలా గట్టిగా వినిపించే మార్గం అవుతోంది. వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న యువతీ యువకులు ఈ సోషల్ నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల గురించి వచ్చే సమస్యల జాబితా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. వాటి గురించి మీకున్న అవగాహనతో ఎవరైనా తమకు తోచిన రీతిలో మాట సాయాన్ని చేయవచ్చు. అవసరమైన సందర్భంలో ఫోన్, మెయిల్స్ ద్వారా పోరాటంలోకి దిగవచ్చు. సంప్రదించడం, సభ్యులవడం ఇలా... దీని వెబ్ అడ్రస్ జ్ట్టిఞ://ఛిజ్ఛ్టటఠ్చీట్చ.ౌటజ/. ఫోన్ నంబరు +91 80500 68000. ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తూ రికార్డు చేయవచ్చు. రికార్డ్ అయిన సమస్యల విషయంలో మీ పరిష్కారాన్ని కూడా సూచించవచ్చు. - జీవన్‌రెడ్డి. బి ఆవిష్కర్తకు అంతర్జాతీయ గుర్తింపు ‘సీజీనెట్ స్వర’ను రూపొందించిన సుభ్రాంశు చౌధరికి ఇటీవలే ‘డిజిటల్ యాక్టివిజం’లో అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇంటర్నెట్ ద్వారా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇస్తున్న చౌధరికి బ్రిటన్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ అవార్డునిచ్చి సత్కరించింది. సుభ్రాంశు ఇంతకు ముందు బీబీసీ, గార్డియన్ వంటి ప్రసిద్ధ వార్తా సంస్థల్లో పనిచేసిన జర్నలిస్టు. -
నకిలీ దందా
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి సులభంగా రవాణా చేస్తున్న ముఠాలు తమ నెట్‌వర్క్‌ను జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట నకలీ కరెన్సీ బయటపడడం కలకలం సృష్టిస్తోంది. పెద్దనోటు చూశామంటే అది నకిలీదా? అసలుదా? అని అనుమానపడే పరిస్థితి దాపురించింది. ఎన్నికల సీజన్ వస్తుండడంతో భారీగా నకిలీ కరెన్సీ జిల్లాకు వస్తోంది. జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి జోరుగా సాగుతోం ది. పదేళ్లుగా జిల్లాలో అడపాదడపా నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకొచ్చినా రెండేళ్ల క్రితం చొప్పదండి మండలకేంద్రంగా నకిలీ కరెన్సీ వ్యవహారంలో ఓ హత్య జరగడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అప్పటికే పలుమార్లు నోట్లు మార్పిడీ చేశామని నిందితులు వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి తరచూ నకిలీ కరెన్సీ ముఠాలు ప ట్టుబడుతూనే ఉన్నాయి. ఈ ముఠాలు ఎక్కువగా గల్ఫ్ కు వెళ్లే సిరిసిల్ల, జగిత్యాల డివిజన్లపై దృష్టి సారిస్తున్నా యి. రైలు మార్గం ఉన్న మహారాష్ట్ర నుంచి, పశ్చిమబెం గాల్ కోల్‌కతా నుంచి ముఠాలు నకిలీ కరెన్సీని తీసుకువచ్చి ఇక్కడ సులభంగా మార్పిడి చేస్తున్నాయి. బ్యాం కులు, ఏటీఎంలలోనూ నకిలీ కరెన్సీ దర్శనమిస్తోందం టే ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్లిందో తెలుసుకోవచ్చు. రూ.30 వేల అసలు నోట్లు ఇస్తే రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇస్తున్నారని సమాచారం. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశతో కొందరు ఈ ముఠా వలలో చిక్కుతున్నారు. ముఠా సభ్యుల నుంచి నకిలీ కరెన్సీ పొందినవారు ఒకేసారి మొత్తంగా కాకుండా ఒక్కొక్కటిగా మార్పిడి చేస్తుండడంతో పెద్దగా బయటకు రావడం లేదు. వ్యాపార కేంద్రాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తోందని సమాచారం. భారీ మొత్తంలో నగదు కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతుండడం నకిలీ కరెన్సీ ముఠాకు కలిసొస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని నకిలీ కరెన్సీ ముఠాలు పోలీసులకు పట్టుబడడం... ఈ ప్రాంతంలోనే ఈ నోట్ల చెలామణి ఎక్కువగా జరుగుతోందని చెప్పడానికి నిదర్శనం. వీరిలో అనేకమంది పోలీసులు చిక్కి కూడా మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గోదావరిఖనిలో గురువారం పట్టుబడ్డ ముఠాసభ్యుడు సదానందం ఇప్పటికే మూడుసార్లు జిల్లా పోలీసులకు పట్టుబడడం గమనార్హం. ఎన్ని‘కలలు’ త్వరలో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముఠాలు ముందస్తుగానే భారీగా నకిలీ కరెన్సీని జిల్లాకు తరలించి మారుమూల ప్రాంతాల్లో నిల్వ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో పంపకాలు ఉండడం... ఓటర్లకు నేరుగా డబ్బులు ముట్టజెప్పే విధానానికి పాల్పడుతుండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిచిపోయే అవకాశముందని ముఠాసభ్యులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కరువైన నిఘా జిల్లాలో నకిలీ కరెన్సీ బయల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా పోలీసుల నిఘా తక్కువగానే ఉండడంతో నోట్లు మార్పిడి చేసే ముఠాలు తమ పని సులభంగా చేసుకుపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం డమ్మీ నోట్ల మార్పిడి ముఠా సమాచారం చిక్కినా కూడా వారిని ఁమామూలు*గా వదిలేశారనే ఆరోపణలొచ్చాయి. గతంలో నక్సల్స్ ఏరివేతలో పేరుగాంచిన ఓ కానిస్టేబుల్ నకిలీ కరెన్సీ తయారీ ముఠాకు సహకరించి పోలీసులకు చిక్కిన సంఘటనలు జిల్లాలో జరిగాయి. ఇలాంటి ముఠాలను అరెస్టు చేసిన అనంతరం వాటి కదలికలపై నిఘా పెట్టకపోవడంతో వారే మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇలాంటి ముఠాలు సుమారు 8 వరకు ఉన్నాయని సమాచారం. ఒక్కో ముఠాలో ఇద్దరి నుంచి 8 మంది సభ్యులు ఉంటారని అంచనా. వీరు నిత్యం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ కరెన్సీ మార్పిడి చేస్తుంటారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.