nethravati
-
విషాదం; కుటుంబం బలవన్మరణం
సాక్షి, బెంగళూరు : ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో విషాదం తాండవించింది. ఆయన లేని జీవితం తమకు వద్దని భార్యాపిల్లలు ఘోర నిర్ణయం తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, కొడుకు, కూతురు నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ వద్ద జరిగింది. మృతులను మైసూరు పీఎస్ నగరకు చెందిన కవితా మందణ్ణ(57), కౌశిక్(29), కల్పిత (27)గా గుర్తించారు. వివరాలు... కవితా మందణ్ణ స్వస్థలం కొడగు జిల్లా విరాజపేట. ఆమె భర్త కిషన్(65)తో కలిసి మైసూరులో స్థిరపడ్డారు. కిషన్ వ్యవసాయం, వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన కిషన్.. శనివారం మధ్యాహ్నం మరణించారన్న సమాచారం అందింది. భర్త మరణవార్తను తట్టుకోలేని కవితతో పాటు ఆ దంపతుల కొడుకు, కూతురు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు అంతా కలసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కవిత, ఆమె పిల్లలు లేఖ రాసి బంధువుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. తరువాత కారులో బంట్వాళకు చేరుకుని.. పెనెమంగళూరు వద్ద నేత్రావతి నది వంతెన వద్ద కారును నిలిపారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తమ పెంపుడు కుక్కను నీటిలోకి తోసివేశారు. అనంతరం ముగ్గురూ ఒకేసారి నదిలోకి దూకేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కవితను నీటిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. కౌశిక్, కల్పితల ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. కాగా వాట్సాప్‌లో కిషన్ కుటుంబం లేఖను చూసిన వారి బంధువులు.. మైసూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి చూడగా సూసైడ్ నోట్ లభించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి మొబైల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా.. వారు బంట్వాళలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే వారు నదిలోకి దూకేశారు. -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
ఎంత పని చేశావు తల్లీ..?
- పరస్త్రీ వ్యామోహంలో భర్త - తనను, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మనస్తాపం - జీవితంపై విరక్తితో బిడ్డలకు ఉరేసి, తానూ బలవన్మరణానికి పాల్పడిన అభాగ్యురాలు - ఇదే విషయమై నాలుగేళ్ల కిందటా ఆత్మహత్యాయత్నం బిడ్డల మీద ప్రేమకంటే భర్తపై కోపమే ఆమెకు ఎక్కువైంది.. పిల్లల మీద ఆశైనా ఆమె ఆవేశాన్ని అణచలేకపోయింది. ముద్దులొలికే బిడ్డలను చంపడానికి ముందు మొద్దుబారిన ఆ మనసు ఎంత ఏడ్చిందో.. సర్వస్వమనుకున్న భర్తే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.. భర్తను ప్రశ్నించింది.. నిలదీసింది.. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. ఇక తను బతికి ప్రయోజనం లేదనుకుందో, ఏమో ఆ పిచ్చితల్లి.. తాను చస్తే బిడ్డల ఆలనాపాలనా ఎవరు చూస్తారనుకుందో ఏమో... తొలుత బంగారం లాంటి పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. వారి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక.. తానూ ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన గుత్తిలో మంగళవారం చోటుచేసుకుంది. గుత్తి(అనంతపురం) : గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. ఈ విషయాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. నేత్రావతి ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చీరలను వేలాడదీసి వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతుండేదని, అందుకు తాను అంగీకరించకపోవడం తో ఇలా చేసుకుం దని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.