రూ.10 లక్షల విరాళం
గుంతకల్లు రూరల్ : నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానానికి బెంగుళూరు కుచెందిన తిలక్ కుమార్ అనే వ్యాపారి రూ.10 లక్షల విరాళం అందజేశారు. కుటుంబ సమేతంగా ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధ్వర్యంలో దాదాపు రూ.2.5 కోట్లతో వెండి రథం నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తిలక్ కుమార్ తన వంతు విరాళంగా రూ.10 లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.