never
-
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పెళ్లి మాటే ఎత్తని ఈ భామల్ని చూశారా?
-
ఆ ప్రశ్నతో నాకు విసుగు రాలేదు...
న్యూఢిల్లీ: టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం సాధించిన రికార్డులుఅన్నీ ఇన్నీ కావు. అదే సందర్భంలో ఈ రికార్డులుకంటే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ ప్రశ్నలపై చిత్ర దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. పదే పదే అందరూ అడుగుతున్న ఆ ప్రశ్నపై అస్సలు విసుగు రాలేదు సరికదా ..చాలా ఆనందంగా అనిపించిందని మీడియాతో చెప్పారు. లెక్కలేనన్ని సార్లు, తాను, తన టీం ఈ ప్రశ్నను ఎదుర్కొన్నామని.. అయినా తమకేమీ విసుగు అనిపించలేదని రాజమౌళి తెలిపాడు. ఒక విధంగా బాహుబలి చిత్రం భాషలకతీతంగా సాధించిన విజయానికి ఇది నిదర్శనమని రాజమౌళి పేర్కొన్నారు. బాహుబలి రెండవ భాగంపై ప్రజల్లో నెలకొన్న ఉత్సుకతకు ఇది తార్కాణమన్నారు. తనుగానీ, తన టీంగానీ ఎలాంటి ఒత్తిడిని ఫేస్ చేయలేదనీ, చాలా ఎగ్టైటింగా, ఆ అనుభూతి చాలా అద్భుతంగా అనిపించిందని పిటిఐతో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆకర్షించడం, టెక్నికల్ అంశాలపై ప్రశంసలు రావడం భారతదేశం అరుదైన చిత్రాలలో ఒకటిగా నిలివడం గర్వంగా ఉందన్నారు. కథా బలం ఉంటే ప్రేక్షకుల ఆదరణ పొందడం కష్టం కాదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలచేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. దీంతోపాటుగా ఇండియా తరువాత చైనా లోపెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రాజ ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న బాహుబలి రెండవ భాగాన్ని భారతదేశం కంటే భారీగా 6500 స్క్రీన్లపై సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. అయితే సెకండ్ పార్ట్ విడుదలలో ఆలస్యం కావాలసి చేసింది కాదని వివరణ ఇచ్చారు. దిలార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది, హాబిట్, బ్యాట్ మెన్ సినిమాల సీక్వెల్స్ సంవత్సరం తరువాత వచ్చాయంటూ గుర్తు చేశారు. అలాగే బాహుబలి విడుదల కూడా ఆలస్యమైందన్నారు. మొదటి భాగం భారీ విజయం పరిగణనలోకి తీసుకుంటే బాహుబలి సీక్వెల్ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. బాహుబలి - ది కన్‌క్లూజన్ భారీ విజయం సాధిస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీనిగురించి నాపై పెద్ద ఒత్తిడి లేదు.. నిజానికి ప్రేక్షకుల అంచనాలే ఒత్తిడిని తగ్గించిందనీ, ఒత్తిడి నివారణగా పనిచేసిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. -
అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!
న్యూఢిల్లీః కంప్యూటర్ల కాలంలో పాస్ వర్డ్స్ కు ప్రాధాన్యత భారీ పెరిగిపోయింది. ఎటువంటి వ్యక్తిగత వివరాలను భద్రపరుచుకోవాలన్నా అందుకు పాస్ వర్డ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే పెట్టుకున్న పాస్ వర్డ్ ఎవ్వరికీ తెలియకుండా కూడ చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు పాస్ వర్డ్ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దంటూ ఒక్కోసారి హెచ్చరికలు కూడ జారీ చేస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న పాస్ వర్డ్స్ కు కూడ ఒక 'డే' ఉందని మీకు తెలుసా? 'పాస్ వర్డ్స్ డే' సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, డిజిటల్ జీవితంలోనూ కూడ ముఖ్యమైన విషయాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా, గోప్యతా వంటి విషయాలు పాటించడాన్ని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి ఎన్నో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాస్ వర్డ్స్ విషయంలో అటువంటి భద్రత, గోప్యత ఎంతో అవసరం. కానీ ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. సులభంగా గుర్తుండేదో, వరుస నెంబర్లో, స్వంత పేర్లనో వాడేస్తుంటారు. కానీ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేవారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ కొత్తగా పెట్టుకునేవారు పదాలు, అక్షరాల్లో తప్పనిసరిగా కొన్ని సంఖ్యలను కలసి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత పేర్లు, పుట్టిన తేదీలు, ఇంతకు ముందు వాడిన పేర్లు, కారు నెంబర్లు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్స్ గా వాడొద్దని సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇతరులు ఊహించగలిగే పదాలు, సంఖ్యలను కూడ వాడకూడదు. 123456 వంటి పాస్ వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు ఈజీగా ఊహించగల్గుతారని, సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. పాస్ వర్డ్స్ లో కొన్నిసార్లు వారిచ్చే ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంతో కూడ వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని భద్రతా సంస్థలు చెప్తున్నాయి. అంతేకాక వెబ్ ప్రపంచంలో ఏదో ఒక ఆధారంతో ఆయా వివరాలను తెలుసుకోగల్గుతారని, తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటుండటం వల్ల హ్యాక్ చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం మానుకోవాలని చెప్తున్నారు. హ్యాకర్స్ , సైబర్ క్రమినల్స్ ఆట కట్టించాలంటే ఎవరికి వారు పాస్ వర్డ్స్ విషయంలో శ్రద్ధతోపాటు, జాగ్రత్తలు వహించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించినవారవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వాడేందుకు పనికిరాని, వాడ కూడని 25 చెత్త పాస్ వర్డ్స్ జాబితాను కూడ.. పాస్ వర్డ్స్ డే సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. అవేమిటో చూద్దాం... -
వందేళ్ళయినా వీడని బంధం!
చిన్న చిన్న సమస్యలకే కుంటుంబ సంభంధాలు సమసిపోతున్న ఈ రోజుల్లో... ఆ కవలలిద్దరూ ఏకంగా వందేళ్ళయినా కలిసే జీవిస్తున్నారు. కష్టమైనా సుఖమైనా కలిసే పంచుకున్నారు. ప్రేమానుబంధాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. నిండు నూరేళ్ళ జీవితాన్ని హాయిగా, ఆనందంగా జీవించి ఇటీవలే వందేళ్ళ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. కెంటకీ లోని సిమ్సోనియాకు చెందిన మేరీ బెల్లీ రోచ్, మయెబెల్లె పోవెల్ లు ఇటీవలే తమ వందేళ్ళ పుట్టిన రోజు జరుపుకున్నారు. కవలలుగా పుట్టి, చిన్ననాటినుంచీ కలిసే పెరిగారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో టీనేజర్స్ గా ఉన్న వారిద్దరూ అప్పట్లో తమ ముద్దుపేరైన ది వాలెస్ ట్విన్స్ గానే నేటికీ పిలువబడుతున్నారు. అప్పట్లో ఎన్నో ఆర్థిక కష్టాలున్నా... ముర్రే స్టేట్ కాలేజీలో 5 డాలర్ల సెమిస్టర్ ఫీజు కట్టి ఇద్దరూ చదువుకున్నారు. ఒకేలా కనిపించడం కాలేజీ రోజుల్లో వారిద్దరికీ అనేకసార్లు కలసి వచ్చేది. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, క్లాస్ రూంలో ఒకరు నోట్స్ రాస్తుంటే, మరొకరు జిమ్ క్లాస్ కు వెళ్ళేందుకు ఉపయోగపడేది. చదువులోనూ, పనిలోనూ ఒకరికొకరు సహాయపడుతుండేవారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నఆ కవల సోదరీమణులు.. రోజుకు ఒక్క డాలర్ చొప్పున చెల్లించే సిమ్సోనియాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవారు. పెళ్ళీడువచ్చిన తర్వాత ఇద్దరు ప్రాణస్నేహితులను పెళ్ళాడారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఇద్దరు దంపతులూ మోటార్ వాహనంలో యూరప్ లోని 50 రాష్ట్రాలను, 8 దేశాలను చుట్టేశారు. ఇద్దరి భర్తలనూ పోగొట్టుకున్న అనంతరం.. వారిద్దరూ కొంతకాలం డెట్రాయిట్ కు వలస వెళ్ళి అక్కడి వార్ టైం ఫ్యాక్టరీల్లో పనిచేశారు. నాటినుంచీ నేటి వరకూ ఏ సందర్భంలోనూ విడిపోని ఆ కవలలలిద్దరూ ప్రస్తుతం తిరిగి చిన్ననాటి తమ ఇంట్లోనే నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్ళుగానే కాదు... మంచి స్నేహితులుగానూ ఉండే ఇద్దరూ చూసేందుకు పోలికల్లోనే కాదు.. వస్త్రధారణ విషయంలోనూ ఎక్కడా తేడా కనిపించదు. ఏ సమయంలోనైనా మేం కలిసే ఉన్నామని, ఇకముందూ ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్తున్నారు. వందేళ్ళ పుట్టినరోజును జరుపుకున్న ఆ కవలు... ఎందరో అక్కాచెల్లెళ్ళకే కాక, ప్రేమానుబంధాలకూ మారుపేరుగా నిలుస్తున్నారు.