New bride suicide
-
పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య
తమిళనాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కాని నూరేళ్ల బంధం పది రోజులకే ముగిసింది. నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పళ్లిపట్టు యూనియన్ రామసముద్రం పంచాయతీ వీజీఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన రవి కుమారుడు ముత్తు(25) జేసీబీ డ్రైవర్. ఇతనికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేంద్రన్ కుమార్తె అను(22)తో జూన్ 29న గ్రామంలోని వరుడు ఇంట్లో వివాహం జరిగింది. పది రోజుల వ్యవధిలో ఏం జరిగిందో కానీ మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న గదిలో అను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేకువజామున లేచిన ముత్తు భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. పొదటూరుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహమైన పది రోజులకే నవవధువు ఆత్మహత్యకు సంబందించి తిరుత్తణి ఆర్డీఓ విచారణ చేపట్టారు. -
నవ వధువు ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె, పల్లావరంలోని పమ్మల్ వఉసి నగర్‌కు చెందిన పసిలెత్తాతూన్ గ్రాడ్యుయేట్(30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన జమీల్ అహ్మద్ (36)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. శుక్రవారం రాత్రి పసిలెత్తాతూన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కూతురు మృతిపై పసిలెత్తాతూన్ తల్లి హసీనా అనుమానం వ్యక్తం చేసింది. శంకర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో పసిలెత్తాతూన్కు ఐదు నెలల క్రితం 2వ కాన్పులో కూడా కుమార్తె పుట్టడంతో ఆమె భర్త జమీల్ అహ్మద్, అత్త షకీలా ఆమెను రోజూ తీవ్రంగా కొట్టి హింసించారని ఆరోపించారు. అలాగే జమీల్ అహ్మద్ తీసుకున్న రూ.20 లక్షల అప్పును తీర్చేందుకు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించారని వాపోయారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహమైన మూడు నెలలకే దారుణం.. మాజీ ప్రియుడు అరెస్ట్
తిరువొత్తియూరు: పుదుక్కోట్టై æజిల్లాలో వివాహమైన 3 నెలలకే నవ వధువు ఆత్మాహుతి చేసుకుంది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీపం కొప్పరపు పట్టి, ఆరియన్‌కాడు గ్రామానికి చెందిన పుష్పరాజ్, అతని భార్య దీప (25). వీరికి మూడు నెలలకు క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గురువారం దీపా ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన వేలుసామి (35) అనే వ్యక్తితో వివాహానికి ముందే పరిచయం ఏర్పడి సంబంధం ఉందని, ఈ క్రమంలో పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని దీప తెలిపినట్లు తెలిసింది. దీంతో బంధువులు దీపను ఒప్పించి బంధువుకు వివాహం చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న దీప బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన మాజీ ప్రియుడు వేలుసామిని అరెస్టు చేశారు. -
కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు బలవన్మరణం
సాక్షి, నల్గొండ: కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబావితండాలో శుక్రవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిబావితండాకు చెందిన సభావత్ పుల్యా కూతురు అనూష (21)కు నాంపల్లి మండలం పెద్దపురంతండాకు చెందిన మధుతో ఈ నెల 26న వివాహం జరిగింది. 27న వరుడు ఇంటి వద్ద రిసెప్షన్ నిర్వహించారు. అదే రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో వధూవరులు మర్రిబావితండాకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం అనూష తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి నిద్ర సరిపోక పడుకుని ఉంటుందని కుంటుంబ సభ్యులు భావించారు. సాయంత్రం గదిలోకి వెళ్లి చూడగా అనూష తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించి చూడగా అప్పటికే మృతిచెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్ఐ సుధాకర్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. నవ వధువు ఆత్మహత్యతో తండాలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు -
పెళ్లైన 6 నెలలకే నవ వధువు ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : వనస్థలీపురంలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సుష్మసాయి నగర్లో ఆదివారం జరిగింది. మృతురాలిని నివేదితగా గుర్తించారు. భర్తతో రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితకే నివేదితకు వివాహం అయింది. -
పెళ్లైన రెండు నెలలకే నవ వధువు..
చిత్తూరు, కుప్పం: మూడుముళ్ల బంధం తాలూకు కాళ్ల పారాణి ఆరనే లేదు..పెళ్లైన రెండు నెలలకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో బలవన్మరణం చెందింది. శనివారం ఇది పట్టణంలో ఇది చర్చనీయాంశమైంది. వివరాలు..గుడుపల్లె జెడ్పీ హైస్కూలులో టీచర్‌గా పనిచేస్తున్న చంద్రజ్యోతి (29)కి వి.కోట డీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీకాళహస్తి వాసి శరత్‌కు రెండు నెలల క్రితం వివా హమైంది. వీరిద్దరూ స్థానిక హెచ్‌పీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రజ్యోతి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెం దడం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివాహమైన కొన్ని రోజులకే దంపతుల నడుమ తరచూ గొడవలు చోటుచేసుకున్నాయని, అల్లుడే తమ కుమార్తెను వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె ఇక తనకు అవసరం లేదని, వచ్చి తీసుకెళ్లాలని శుక్రవారం రాత్రి శరత్ ఫోన్ చేశాడని, అతడే చంద్రజ్యోతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పోలీ సులకు ఫిర్యాదు చేశారు. శరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
భూమి మీద నా ఆయుష్షు అయిపోయింది..
వెల్దుర్తి(తూప్రాన్): ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా భర్త చాలా మంచోడు.. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది’ అంటూ సూసైడ్ నోట్ రాసి నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మండల పరిధి ఉప్పులింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర బాబుకు ఏ ఈడాది మే నెల 11న మెదక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన కళమ్మ, రాములు దంపతుల కూతురు నాగరాణి(21)తో వివాహం జరిగింది. బాబు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడు కృష్ణ నగరంలో పని చేసుకుంటున్నాడు. రోజు మాదిరిగా బాబు ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. అనుమానంతో ఎంత పిలిచినా లోపలి నుండి ఎలాంటి శబ్ధం వినిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై గంగరాజు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక గడియ లోపలి తాళాలు పగులకొట్టారు. లోపలికి వెళ్లి చూడగా నాగరాణి శవమై కనిపించింది. శవం పక్కనే మంచంపై ఉన్న సూసైడ్ నోట్‌ను వారి కుటుంబీకులు గమనించి పోలీసులకు అప్పగించారు. అందులో ‘‘నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది.. 2,3 రోజుల నుండి చనిపోవాలన్న ప్రేరణ కలుగుతోంది. నేను ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. అందుకోసం నా తనువు చాలిస్తున్నానంటూ’ రాసి ఉంది. ‘‘దయచేసి ఎవరూ బాధపడొద్దు, నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా చనిపోతున్నా. వీలైతే మాల్తుమ్మెద గ్రామానికి చెందిన చిన్నమ్మ కూతురును బాబుకు ఇచ్చి పెండ్లి చేయండి. అతను చాలా మంచోడు’’ అని రాసింది. నా వస్తువులన్నీ చెల్లెలుకే ఇవ్వండి. దయచేసి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ భూమి మీద నా ఆయుష్షు అయిపోయినట్లుంది అందుకే వెళ్లిపోతున్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు నేనే’’ అని రాసింది. ఇది చదివిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పెళ్లయిన మూడు నెలలకే నూరేండ్లు నిండాయా బిడ్డా అంటూ విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టంకోసం మెదక్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నవవధువు ఆత్మహత్య
తాండూరు: కడుపు నొప్పి భరించలేక ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రతాపలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన జెల్ల మాణెమ్మ కూతూరు రాజేశ్వరి(19) ఇంటర్మీడియేట్ పూర్తిచేసింది. ఈమెకు నాలుగు నెలల క్రితం దౌల్తాబాద్ మండలం గుమ్మడిపల్లికి చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. గత బుధవారం రాజేశ్వరి తన పుట్టింటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కడుపు నొప్పి వస్తోందని చెప్పి.. తల్లిని వెంటబెట్టుకుని వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. అయితే ఇంటికి చేరిన తర్వాత రాత్రి వేళలో భరించలేని నొప్పి రావడంతో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు. -
వరకట్నం వేధింపులకు నవ వధువు బలి
కాగజ్‌నగర్‌రూరల్ ఆదిలాబాద్ : పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు జీవించాల్సిన నవ వధువుకు కాళ్ల పారాణి ఆరకముందే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వివాహామైన 12 రోజులకే వరకట్నం కోసం భర్త వేధించడంతో ఉరేసుకుని తనవు చాలించిన ఘటన కాగజ్‌నగర్ మండలం జంబుగా గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈస్గాం ఎస్సై గట్టు సుధాకర్ సోమవారం తెలిపిన వివరాలివీ.. 12 రోజుల క్రితం జంబుగాకు చెందిన బూస రాజేశ్(21)తో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన మెరుగు మానస(అరుణ)(19)తో 12 రోజుల కిందట వివాహామైంది. వరకట్నం కింద రూ.5లక్షలు మాట్లాడుకోగా రూ.3 లక్షలు పెళ్లి రోజు చెల్లిం చారు. మిగతా రూ.2 లక్షలు త్వరలో ఇస్తామని ఒప్పుకున్నారు. ఈ అదనపు కట్నం కోసం గత శుక్రవారం నూతన వధూవరులు మామ దగ్గరకు వెళ్లి ప్రస్తావించగా త్వరలో ఇస్తామని నచ్చజెప్పారు. శనివారం తిరిగి భార్యాభర్తలు జంబుగా గ్రామానికి రాగా ఇంటిలో అత్త దుర్గమ్మ, ఆడపడుచు అన్నమ్మ, బావ మల్లేశ్, భర్త రాజేశ్ అదనపు కట్నం కోసం వేధించారు. దీంతో నవవధువు ఆది వారం రాత్రి ఉరేసుకుని తనువు చాలించింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
నవ వధువు బలవన్మరణం
ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగుపెట్టింది.. నాటి నుంచి అదనపుకట్నం అత్త మామలు వేధించసాగారు. జీవితాంతం బాసటగా నిలుస్తానన్న భర్త కూడా తల్లిదండ్రులకు వంతపాడాడు. వారి వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన నగరంలోని జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు(క్రైమ్): నగరంలో జాకీర్‌హుస్సేన్ నగర్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలో నివశిస్తున్న షేక్ సాబ్జాన్, మస్తాన్‌బీ దంపతుల కుమార్తె సిరాజున్నీసా(25). బీటెక్ పూర్తిచేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఆమెకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్, హసీనా దంపతుల కుమారుడు నవాజ్ అలీతో వివాహమైంది. వివాహ సమయంలో సిరాజున్నీసా కుటుంబసభ్యులు కట్నం కింద రూ.6లక్షల నగదు, 40సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. మెట్టినింటిలో సిరాజున్నీసా సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. రూ.10లక్షలు ఇస్తే కాపురం చేయమని లేదంటే మరొకరికి ఇచ్చి కుమారుడికి వివాహం చేస్తామని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. భర్త కూడా తన తల్లిదండ్రులకు ఒత్తాసు పలికాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. వారు సర్దుకుపోమని చెప్పారు. దీంతో ఆమె ఎప్పటికైనా అత్తింటివారు మారకపోతారా అని వారి వేధింపులను భరిస్తూ వచ్చింది. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అత్తమామలు, భర్త ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఈ నేపథ్యంలో 15రోజుల కిందట సిరాజున్నీసా పిన్ని బద్వేలుకు వెళ్లి ఆమెను తన వెంట నెల్లూరుకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి బాధితురాలు తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం నవాజ్‌అలీ వారికి ఫోన్ చేశాడు. తాము అడిగినంత తీసుకొని కాపురానికి రావాలనీ లేదంటే నీ వస్తువులు తీసుకొని వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో బాధితురాలు తన తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన సోమవారం తానే స్వయంగా వచ్చి మాట్లాడుతానని నవాజ్ అలీ కుటుంబభ్యులకు చెప్పాడు. శనివారం రాత్రి మళ్లీ సిరాజున్నీసాకు ఫోన్‌చేసి రూ.20వేలు కావాలని నవాజ్ అలీ అడిగాడు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు కాని ఆదివారం తెల్లవారుజామున ఆమె తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఆమె కుటుంబసభ్యులు పడకగదిలోకి వెళ్లిచూడగా సిరాజున్నీసా వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకుదించారు. అప్పటికే మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. సిరాజున్నీసా మృతి విషయాన్ని అత్తింటివారికి తెలియజేశారు. సాయంత్రం రెండోనగర పోలీసులకు సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, రెండోనగర ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎస్ఐ వి.శ్రీహరిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్యకు గల కారణాలను బాధిత కుటంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. రెవెన్యూ అధికారుల శవ పంచనామా నిర్వహించారు. ఈ క్రమంలో మృతురాలి భర్త అక్కడికి రావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని స్టేసన్‌కు తరలించారు. డీఎస్పీ కేసు విచారిస్తున్నారు. వేధింపులతోనే ఆత్మహత్య అత్తింటి వేధింపులతోనే సిరాజున్నీసా బలవన్మరణానికి పాల్పడిందని బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహ సమయంలో నవాజ్‌అలీ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పారనీ, పెళ్లికార్డులు తయారుచేయించే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదన్న విషయం తమకు తెలిసిందన్నారు. ఈ విషయం వారిని ప్రశ్నించగా ఆ కంపెనీలో చేయడం ఇష్టంలేక ఇంటికి వచ్చి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడి చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయినప్పటికి కుమార్తె బాగుంటుందని వివాహం చేశామని, నాటినుంచే అదనపుకట్నం కోసం వేధించి బలితీసుకొన్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
కట్నం వేధింపులకు నవవధువు బలి
మలేసియాటౌన్‌షిప్: కట్నం వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్ఐ జానయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా కొత్తపాలానికి చెందిన శ్రీనివాసరావు, శకుంతల దంపతుల కుమార్తె సుకన్య (28)కు అదే జిల్లాకు చెందిన మహేష్ (32)తో 14 నెలల క్రితం పెళ్లైంది. గుంటూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ.5 లక్షలు కట్నం ఇచ్చారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మూడు నెలల క్రితం సుకన్య ప్రస్తుతం నిజాంపేట రోడ్డులో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. కాగా, మంగళవారం మధ్యాహ్నం తన బెడ్రూంలోకి వెళ్లిన సుకన్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుండటంతోనే సుకన్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.