పెళ్లైన రెండు నెలలకే నవ వధువు.. | Newly Married Women Commits Suicide in Chittoor | Sakshi
Sakshi News home page

నవ వధువు అనుమానాస్పద మృతి

Published Sun, Feb 17 2019 11:32 AM | Last Updated on Sun, Feb 17 2019 11:35 AM

Newly Married Women Commits Suicide in Chittoor - Sakshi

చంద్రజ్యోతి (ఫైల్‌)

చిత్తూరు, కుప్పం: మూడుముళ్ల బంధం తాలూకు కాళ్ల పారాణి ఆరనే లేదు..పెళ్లైన రెండు నెలలకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో బలవన్మరణం చెందింది. శనివారం ఇది పట్టణంలో ఇది చర్చనీయాంశమైంది. వివరాలు..గుడుపల్లె జెడ్పీ హైస్కూలులో టీచర్‌గా పనిచేస్తున్న  చంద్రజ్యోతి (29)కి  వి.కోట డీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీకాళహస్తి వాసి శరత్‌కు రెండు నెలల క్రితం వివా హమైంది. వీరిద్దరూ స్థానిక హెచ్‌పీ రోడ్డులో  నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో,  చంద్రజ్యోతి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెం దడం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివాహమైన కొన్ని రోజులకే దంపతుల నడుమ తరచూ గొడవలు చోటుచేసుకున్నాయని, అల్లుడే తమ కుమార్తెను వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె ఇక తనకు అవసరం లేదని, వచ్చి తీసుకెళ్లాలని శుక్రవారం రాత్రి శరత్‌ ఫోన్‌ చేశాడని, అతడే చంద్రజ్యోతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు.  తమ కుమార్తె మృతిపై పోలీ సులకు ఫిర్యాదు చేశారు. శరత్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement