వరకట్నం వేధింపులకు నవ వధువు బలి | Young Women Committed Suicide | Sakshi
Sakshi News home page

వరకట్నం వేధింపులకు నవ వధువు బలి

Published Tue, May 22 2018 11:43 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Young  Women Committed Suicide  - Sakshi

తనువు చాలించిన మానస 

కాగజ్‌నగర్‌రూరల్‌ ఆదిలాబాద్‌ : పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు జీవించాల్సిన నవ వధువుకు కాళ్ల పారాణి ఆరకముందే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వివాహామైన 12 రోజులకే వరకట్నం కోసం భర్త వేధించడంతో ఉరేసుకుని తనవు చాలించిన ఘటన కాగజ్‌నగర్‌ మండలం జంబుగా గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

ఈస్‌గాం ఎస్సై గట్టు సుధాకర్‌ సోమవారం తెలిపిన వివరాలివీ.. 12 రోజుల క్రితం జంబుగాకు చెందిన బూస రాజేశ్‌(21)తో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన మెరుగు మానస(అరుణ)(19)తో 12 రోజుల కిందట వివాహామైంది.

వరకట్నం కింద రూ.5లక్షలు మాట్లాడుకోగా రూ.3 లక్షలు పెళ్లి రోజు చెల్లిం చారు. మిగతా రూ.2 లక్షలు త్వరలో ఇస్తామని ఒప్పుకున్నారు. ఈ అదనపు కట్నం కోసం గత శుక్రవారం నూతన వధూవరులు మామ దగ్గరకు వెళ్లి ప్రస్తావించగా త్వరలో ఇస్తామని నచ్చజెప్పారు.

శనివారం తిరిగి భార్యాభర్తలు జంబుగా గ్రామానికి రాగా ఇంటిలో అత్త దుర్గమ్మ, ఆడపడుచు అన్నమ్మ, బావ మల్లేశ్, భర్త రాజేశ్‌ అదనపు కట్నం కోసం వేధించారు. దీంతో నవవధువు ఆది వారం రాత్రి ఉరేసుకుని తనువు చాలించింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement