నవవధువు ఆత్మహత్య   | New Bride Committed Suicide | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్య  

Published Sat, Jul 7 2018 8:55 AM | Last Updated on Sat, Jul 7 2018 8:55 AM

New Bride Committed Suicide - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తాండూరు: కడుపు నొప్పి భరించలేక ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రతాపలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం బిజ్వార్‌ గ్రామానికి చెందిన జెల్ల మాణెమ్మ కూతూరు రాజేశ్వరి(19) ఇంటర్మీడియేట్‌ పూర్తిచేసింది.

ఈమెకు నాలుగు నెలల క్రితం దౌల్తాబాద్‌ మండలం గుమ్మడిపల్లికి చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. గత బుధవారం రాజేశ్వరి తన పుట్టింటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కడుపు నొప్పి వస్తోందని చెప్పి.. తల్లిని వెంటబెట్టుకుని వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది.

అయితే ఇంటికి చేరిన తర్వాత రాత్రి వేళలో భరించలేని నొప్పి రావడంతో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement