New MLA Quarters
-
కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : హైదర్‌గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగినా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం రెండో శాసనసభ కొలువుదీరిన తర్వాత ఈ భవనాలు సిద్ధమయ్యాయి. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. 36 స్టాఫ్ క్వార్టర్లు: ఆరు అంతస్తుల్లో స్టాఫ్ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్‌ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు. ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4 వేల చ.అ.విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిల్లోనే కొనసాగే అవకాశముంది. 12 అంతస్తుల్లో... వాహనాలు నిలిపేందుకు సెల్లార్లో మూడంతస్తులు నిర్మించారు. ఇందులో 276 కార్లను నిలిపే స్థలం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 23 విజిటర్స్ రూమ్‌లు నిర్మించారు. తమను కలిసేందుకు వచ్చే వారితో ఎమ్మెల్యేలు ఈ గదుల్లో భేటీ అవుతారు. ఓ క్లబ్ హౌస్, ఒక వ్యాయామశాల కూడా సిద్ధం చేశారు. ఈ భవనాలు 12 అంతస్తుల్లో నిర్మించారు. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడు పడక గదులు, హాలు, వంటగది, డ్రాయింగ్‌రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు. -
అన్ని హంగులతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్
సాక్షి, హైదరాబాద్: హైదర్‌గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించనున్నారు. నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగినా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం రెండో శాసనసభ కొలువుదీరిన తర్వాత ఈ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. 36 స్టాఫ్ క్వార్టర్లు: ఆరు అంతస్తుల్లో స్టాఫ్ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్‌ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు. ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4 వేల చ.అ.విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిల్లోనే కొనసాగే అవకాశముంది. 12 అంతస్తుల్లో... వాహనాలు నిలిపేందుకు సెల్లార్లో మూడంతస్తులు నిర్మించారు. ఇందులో 276 కార్లను నిలిపే స్థలం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 23 విజిటర్స్ రూమ్‌లు నిర్మించారు. తమను కలిసేందుకు వచ్చే వారితో ఎమ్మెల్యేలు ఈ గదుల్లో భేటీ అవుతారు. ఓ క్లబ్ హౌస్, ఒక వ్యాయామశాల కూడా సిద్ధం చేశారు. ఈ భవనాలు 12 అంతస్తుల్లో నిర్మించారు. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడు పడక గదులు, హాలు, వంటగది, డ్రాయింగ్‌రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం
♦ టీఆర్ఎస్ ముమ్మర కసరత్తు ♦ త్వరలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర పార్టీ కార్యాలయం సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నగర టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. శుక్రవారం ఇదే అంశంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఇతర ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. గ్రేటర్ పరిధిలో పార్టీ బలాబలాలు, అన్ని డివిజన్లలో పార్టీ తాజా పరిస్థితి, సాధారణ,క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియ తీరుతెన్నులపై ఆరా తీశారు. భవిష్యత్‌లో పార్టీని అన్ని వర్గాలకు ఎలా చేరువ చేయాలన్న అంశంపై సమాలోచనలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారం చేపట్టిన తరవాత జరగనున్న కీలకమైన బల్దియా ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని పక్షంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంశంపైనా చర్చించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, త్వరలో నగర పార్టీ కార్యాలయాన్ని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 140 క్వార్టర్లోకి తరలించాలని నిర్ణయించారు. ఈ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. -
ఇదికూడా రాజకీయమేనా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన క్వార్టర్ నంబర్ 157ను పరిశుభ్రంగా ఉంచుకుందామని మరమ్మతులు చేయించుకున్నా రాజకీయం చేస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటాయించిన క్వార్టర్లకు పునరుద్ధరణ పనులు చేయించుకోవడమనేది అందరూ చేసేదేనని తాను మాత్రమే ఆ పనులు చేయడంలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్వార్టర్లు తనకు కేటాయించిన వరుసలోనే ఉన్నాయని వారంతా వాటిని తమ అభీష్టం మేరకు పునరుద్ధరణ పనులు చేసుకున్నారని, ఢిల్లీలో కూడా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి సుజనాచౌదరికి కేటాయించిన క్వార్టర్లను స్టార్ హోటళ్ల మాదిరిగా పునర్నిర్మించుకున్నారని ఈ సందర్భంగా చెవిరెడ్డి ఉదహరించారు. అయితే, తన విషయంలోనే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తన క్వార్టర్ మరమ్మతులపై వ్యతిరేక కథనం రాసిన ఆంగ్ల పత్రిక ఎడిటర్, రిపోర్టర్‌పై తాను న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. నంబర్ 157 క్వార్టర్లో అడుగు పెట్టేనాటికి పైకప్పు పెంకులు ఊడిపోయి, వర్షపు నీళ్లు కారుతూ అధ్వానంగా ఉండడంతో.. పనులు చేసుకుంటానని ప్రభుత్వానికి లేఖ రాస్తే అనుమతించారన్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కాపీని చెవిరెడ్డి చూపించారు. సీఎం చంద్రబాబు రూ.50 కోట్ల ప్రజాధనం వెచ్చించి తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంటే తప్పులేదు కానీ తన విషయంలోనే ఎందుకు ఇలా రాశారని ఆయన ప్రశ్నించారు.