new offers
-
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్స్
-
దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్’ పేరిట ఫర్నిచర్ కార్నివాల్‌ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్ సేల్‌ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్లైన్ (బాంటియా.ఇన్)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్, బుక్‌షెల్ఫ్, బెడ్రూమ్ సెట్స్, ఆఫీస్ కురీ్చలు, టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది. ఎక్స్ఛేంజ్పై 20–30 శాతం రాయితీ.. బాంటియాలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్ టేబుల్స్ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్‌డోర్ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి. విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగాం బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. పండుగ షాపింగ్‌లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – సురేందర్ బాంటియా, ఎండీ, బాంటియా బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ నాణ్యమైన ఫర్నిచర్‌కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ను బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లను కూడా అందిస్తాం. – అమిత్ బాంటియా, డైరెక్టర్, బాంటియా -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో ఎస్టీవీ-99, ఎస్టీవీ-319, ప్లాన్-999, ప్లాన్-949, డేటా ఎస్టీవీ-7 ప్లాన్లు ఉన్నాయి. ఎస్టీవీ-319, 99 ప్లాన్లు ఇవాళ్టి (మంగళవారం) నుంచి అందుబాటుకి వస్తాయి. ప్లాన్ 999, 949లు ఈ నెల 15 నుంచి, డేటా ఎస్టీవీ-7 ప్లాన్ ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు ఎస్టీవీ-26, ట్రిపుల్ ఏస్-333, బీఎస్ఎన్ఎల్ చౌక-444, ఇంటర్నేషనల్ వైఫై ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ నెల 10 నుంచి యూఏఈ, యూఎస్ఏలకు ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు పేర్కొంది. ఈ నెల 19 (సోమవారం) నుంచి 28 వరకు సంస్థ స్టోర్లలో మెగా సిమ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉచితంగా 3జీ సిమ్‌లను అందజేయడంతో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్ టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. -
BSNL కొత్త ఆఫర్లు
-
బీమాపై వేటు... వడ్డీకి రిబేటు
పంట రుణమాఫీ తప్పుకునేందుకు కొత్త ఆఫర్లు అప్పు చెల్లిస్తే వడ్డీ రిబేటు ఇస్తామంటూ బేరం పంట బీమా వర్తించదంటూ నోటీసులు లబోదిబోమంటున్న రైతులు ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టి, ఇంకోమారు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో తీవ్ర నష్టాలపాలవుతున్న రైతుల పాలిట బ్యాంకర్ల నోటీసులు గోరుచుట్టుపై రోకటిపోటులా వెంటాడుతున్నాయి. అసలే రుణమాఫీ విషయంలో తీవ్ర అయోమయానికి నిత్య గందరగోళానికి గురౌతున్న రైతన్నను ప్రభుత్వం, బ్యాంకర్లు ప్రకటిస్తున్న కొత్త ఆఫర్లు మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గుడ్లవల్లేరు :కొత్త ప్రభుత్వం హాయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీతో సహా సరికొత్త పథకాలు వర్తింపజేస్తారనుకుంటే రైతుల్ని ముంచేసే అర్ధంకాని ఆఫర్లు ఇస్తూ రుణమాఫీనుంచి తప్పించుకునేందుకు చూడడం చంద్రబాబు నైజాన్ని మరోమారు చాటిందని రైతులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీ లోగా పంట రుణాల్ని చెల్లించేసిన రైతులకు వడ్డీ రిబేటు ఇస్తామన్న కొత్త ఆఫర్‌తోపాటు 2013 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు పంట బీమా వర్తించదని వివరిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు నోటీసు బోర్డులో ప్రకటించారు.అలాగే స్థానిక పీఏసీఎస్ నుంచి కూడా రుణమాఫీ హామీని తప్పించుకునే విధంగా కొన్ని కరపత్రాల్ని రైతుల ఇంటింటికీ పంచిపట్టారు.దీనికి సమ్మతిస్తేనే, పంట రుణాలకు ముందుకు రావాలంటూ ఆ నోటీసులో ప్రకటించడం రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రబాబు విధానం చూస్తుంటే 2003 నాటి పాలన గుర్తుకు వస్తుందని బాధిత రైతులంటున్నారు. వ్యవసాయం దండగ అన్న ఆయన ఆ జ్ఞాపకాలకు తిలోదకాలివ్వలేకే తొలి సంతకంలోనే నైజాన్ని చాటుకున్నారని విమర్శిస్తున్నారు. కళ్ల ముందు ఖరీఫ్ సాగు కనబడుతుందని, ఇంకా ఎన్ని రోజుల తర్వాత రుణమాఫీ ప్రకటిస్తారని అడుగుతున్నారు. కాగా గుడ్లవల్లేరు మండలంలోని ఒక్క కౌతవరం ఆంధ్రాబ్యాంకు పరిధిలోనే 30మంది రైతులకు పంట రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.12లక్షల మేరకు బంగారు నగల మీద సాగుకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల్ని వెంటనే చెల్లించకపోతే 28వ తేదీన రుణగ్రస్తుల బంగారు నగల్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీచేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి నోటీసులు ఇవ్వాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చినందునే నోటీసులు ఇచ్చామని కౌతవరం ఆంధ్రాబ్యాంకు మేనేజరు ప్రసాద్ చెబుతున్నారు. పొలాల పాసు పుస్తకాల నకలు పెట్టి రుణాలు తీసుకోని బంగారు నగల రుణగ్రస్తుల్ని వ్యాపారులుగా గుర్తించి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. రెండెకరాలు చేస్తున్నా... వ్యవసాయానికే రుణం తీసుకన్నా. రూ.79వేలు సాగుకు ఖర్చయ్యింది. ఇపుడు మేనేజరు పొలం కాగితాలు పెట్టలేదు కాబట్టి అప్పు కట్టాల్సిందేనని అంటున్నారు. మాకు రుణమాఫీ చేయకుండా బడారైతులకే ఆ పథకం వర్తింపజేచేలా చేసేలా ఉన్నారు. - షేక్ అల్లాబక్షు, కౌతవరం రైతు రోజుల్లో చెల్లించమంటే ఎలా? నాలుగు రోజుల్లో పంట రుణం చెల్లించమని నోటీసులిస్తే, ఎలా చెల్లించగలం. మూడెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా. నగలు తీసుకెళ్లకపోతే ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం వేసేస్తానని బ్యాంకువారు అంటున్నారు. రుణమాఫీ చేసేంతవరకూ రుణాలు చెల్లించనే చెల్లించం. - ఈడె చలపతిరావు, కౌతవరం రైతు మహిళా రైతులెంతమంది.... ఐదెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా నన్ను రైతును కాదంటే ఎలా? రైతును కాదంటూ బంగారం అప్పు కట్టమని నోటీసులివ్వడం దారుణం. మహిళా రైతులంటున్నారు. నూటికి అలాంటి రైతులు ఎంతమంది ఉంటారు. రుణమాఫీ హామీ తప్పుకునేందుకే ఇలాంటి చేతకాని సాకులు వెతుక్కుంటున్నారు. - బోట్ల జగన్మోహనరావు, కౌతవరం రైతు