new planets
-
మరో కొత్త గ్రహన్ని గుర్తించిన నాసా..అచ్చం భూమిలాగే..!
వాషింగ్టన్: విశ్వంలో భూమితో పాటు వేరే ఇతర గ్రహలు నివాసయోగ్యానికి కచ్చితంగా ఉండి ఉంటాయనేది పరిశోధకుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగా నాసా ఇప్పటికే భూమిని పోలి నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహలపై అన్వేషణ కొనసాగిస్తోంది. కాగా ప్రస్తుతం అచ్చం భూమిలాగా ఉన్న మరో గ్రహన్ని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. కాగా ఈ గ్రహం భూమి నుంచి సుమారు 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ వాతావరణంలో ఉన్నట్లుగా ఈ గ్రహంపై కూడా మేఘాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహానికి పరిశోధకులు టివోఐ-1231బి(TOI-1231b)గా నామకరణం చేశారు. భూ గ్రహంతో పోలిస్తే చాలా పెద్దగా, నెఫ్ల్యూన్తో పోలిస్తే కాస్త చిన్నగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం టివోఐ-1231బి గ్రహంపై సుమారు మన భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులు కల్గి ఉన్నట్లుగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టివోఐ-1231బి గ్రహం భూ వాతావరణంపై ఉన్న ఉష్ణోగ్రత సుమారు 57 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లుగా గుర్తించారు. నాసా ఇప్పటివరకు కనుగొన్న గ్రహల్లో టివోఐ-1231బి చిన్న గ్రహంగా నిలిచింది. కాగా ఈ గ్రహంపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. చదవండి: ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం! -
అక్కడ పగటిపూట ఐరన్ వర్షం..!
లండన్ : సౌర కుటుంబానికి వెలుపల.. 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. అసాధారణ రీతిలో వేడిగా ఉండే ఆ గ్రహంపై ఐరన్ వర్షం కురుస్తోందని గుర్తించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘డబ్ల్యూఏఎస్పీ-76బీ’గా గర్తించిన ఆ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత్తలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లోహాలు ఆవిరిగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. అక్కడ వీచే బలమైన గాలులు రాత్రి వేళను చల్లగా మారేలా చేస్తాయని, ఆ సమయంలో ఇనుము బిందువులుగా ఘనీభవిస్తుందని అంచనా వేశారు. ఆ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఎదురుగా తిరుగుతున్న సమయంలో(పగటిపూట) మాత్రమే ఇనుము వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. వాతావరణం చల్లబడ్డాక రాత్రిపూట పూర్తి చీకటి నెలకొంటుందని తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటుందని.. కానీ ఆ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుందన్నారు. ఆ గ్రహం తన మాతృ నక్షత్రం నుంచి పగటిపూట భూమి సూర్యుని నుంచి గ్రహించే రేడియేషన్ కంటే వేల రేట్లు అధికంగా పొందుతుని ఆ పరిశోధనలో వెల్లడించారు. -
మరో భూమి.. మనకు దగ్గరలో!?
భూమిని పోలిన మరో గ్రహం ఉందా? అక్కడ జీవరాశి మనుగడ సాధ్యమేనా? మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? అక్కడకు మనం వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు అవునని.. సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. ఒట్టావా : భూమిని పోలిన మరో గ్రహాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందని సైంటిస్టులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహానికి కె2-18బీ అని సైంటిస్టులు నామకరణం చేశారు. భూమిని పోలిన ఈ గ్రహాన్ని కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో పరిశోధకులు సంయుక్తంగా గుర్తించారు. తాజాగా గుర్తించిన ఈ గ్రహంపై మంచుతో కూడిన రాళ్లు, పర్వతాలతో ఉందని ఉంటుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన రేయాన్ క్లుటీర్ తెలిపారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్ఓ) డేటాను విశ్లేషించే క్రమంలో ఈ గ్రహం గురించిన సమాచారం తెలిసిందని ఆయన తెలిపారు. కే2-18బీ గ్రహం ఇంచుమించుగా నెఫ్ట్యూన్ గ్రహాన్ని పోలి ఉంటుందని రేయాన్ చెప్పారు. ద్రవ్యరాశి గురించిన సమాచారం లేదన్న ఆయన.. సూర్యుడి (అక్కడి పాలపుంతలో ఉండే నక్షత్రం) చుట్టూ తిరిగేందుకు 32.9 రోజుల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ గ్రహం గురించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
సిద్ధాంతాలకు సవాల్!
లండన్: ఇప్పటి వరకు ఉన్న అనేక ఖగోళ సిద్ధాంతాలను సవాల్ చేస్తున్న ఓ భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని ఇప్పటి వరకు ఉన్న అనేక సిద్ధాంతాలు చెబుతున్నా యి. కానీ ఈ సిద్ధాంతాలన్నీ తప్పని నిరూపిస్తూ చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎన్జీటీఎస్–1బీ అనే ఓ భారీ గ్రహాన్ని బ్రిటన్లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం తదితర అంశాల్లో ఇప్పుడున్న సిద్ధాంతాలను ఈ నూతన గ్రహం సవాల్ చేస్తోంది. గురుగ్రహం పరిమాణంలో ఈ ఎన్జీటీఎస్–1బీ ఉన్నట్లు, ఓ చిన్న నక్షత్రం చుట్టూ ఇది పరిభ్రమిస్తున్నట్లు గుర్తించామని వార్విక్ వర్సిటీకి చెందిన పీటర్ వీట్లే వివరించారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ చిన్న నక్షత్రానికి, ఎన్జీటీఎస్–1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమేనని చెప్పారు. ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం తన పరిభ్రమణాన్ని 2.6 రోజుల్లో పూర్తి చేస్తోంది. -
విశ్వంలో మరో 100 గ్రహాలు!
వాషింగ్టన్: విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100కు పైగా గ్రహాలను తన రెండో దశలో కెప్లర్ (కె-2 మిషన్) గుర్తించింది. యాంత్రిక లోపాల వల్ల ఈ కెప్లర్ దారి తప్పింది. కొత్త గ్రహాలు నక్షత్రం చుట్టూ తిరుగుతూ కెప్లర్ను దాటినపుడు నక్షత్రాల వెలుగుకు అడ్డు రావడంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. 2013 మేలో కెప్లర్తో సంబంధాలు తెగాయి. అయితే దీన్ని ఆ తర్వాత శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి, టెలిస్కోప్ సాయంతో వెంబడిస్తున్నారు. ఈ గ్రహాలతోపాటు మరిన్ని గుర్తించే సామర్థ్యం కె-2కు ఉందని ఇయాన్ క్రాస్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ కెప్లర్ను ప్రయోగించిన మొదటి 80 రోజుల్లో దాదాపు 60 వేల నక్షత్రాలను గుర్తించిందని, 7 వేలకు పైగా వెలుతురు విరజిమ్మే సిగ్నల్స్ను కనుగొందని ఆయన తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణ కోసం పాలపుంత మొత్తం గాలించేందుకు కెప్లర్ను 2009లో ప్రయోగించారు.