Nilofer cyclone
-
నీలోఫర్ తుపానుపై కేంద్రం సమీక్ష
న్యూఢిల్లీ: అరేబియాలో సముద్రంలో ఏర్పడ్డ నీలోఫరన్ తుపాన్‌పై కేంద్రం సమీక్షించింది. మంగళవారమిక్కడ కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. గుజరాత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 31 వ తేదీ రాత్రి తుపాన్ తీరం దాటనుంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని నలియా వద్ద తుపాన్ తీరం దాటనుందని అధికారులు తెలిపారు. నీలోఫర్ తుపాన్ వల్ల తెలంగాణతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. -
నలియా వద్ద తీరం దాటనున్న నీలోఫర్ తుపాన్
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నిలోఫర్ తుపానుగా మారి నవంబర్ 1న తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గుజరాత్‌లోని నలియా వద్ద తీరం దాటనున్నట్లు వారు తెలిపారు. గుజరాత్ సహా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితులలో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బలగాలను తరలించారు. **