breaking news
Nimisha Sajayan
-
వెబ్‌సిరీస్‌లో మాధవన్.. కథ ఏంటో చెప్పిన డైరెక్టర్
ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సిరీస్‌కు మాధవనే బలంతాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్‌కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్‌ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.నా ఫస్ట్ సిరీస్ ఇదేమాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్‌లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..బ్లాక్బెల్ట్నిమిషా తండ్రి సజయన్, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.మేకప్ నచ్చదునటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్‌కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికప్పుడు వంట నేర్చుకుని..కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది. GST చెల్లించలేదని ఆరోపణలుఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.రంగు అడ్డు కాదుకొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్


