Nine medals
-
భారత రెజ్లర్లకు తొమ్మిది పతకాలు
న్యూఢిల్లీ: ససారీ సిటీ మాటియో పెలికోన్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇటలీలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ సోన్బా గొంగాణే (65 కేజీలు) స్వర్ణం గెలుపొందగా... రాహుల్ అవారే (61 కేజీలు) రజతం, దీపక్ పూనియా (86 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో సోన్బా గొంగాణే 9–8తో ఇద్రిసోవ్ (రష్యా)పై గెలిచాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. గుర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) స్వర్ణం, జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్యం గెలిచారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా (50 కేజీలు) స్వర్ణం, పూజా ధండా (57 కేజీలు), మంజు (59 కేజీలు) రజతాలు, దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
రెజ్లర్ల ‘పసిడి పట్టు’
న్యూఢిల్లీ: ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇందులో ఎనిమిది స్వర్ణ పతకాలున్నాయి. తొలి రోజున అమిత్ (57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పసిడి పతకాలు గెలుపొందగా... రెండో రోజు సోనూ (60 కేజీలు), సోమ్వీర్ (86 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. రజనీష్ (65 కేజీలు) కాంస్య పతకం నెగ్గాడు.