న్యూఢిల్లీ: ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇందులో ఎనిమిది స్వర్ణ పతకాలున్నాయి. తొలి రోజున అమిత్ (57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పసిడి పతకాలు గెలుపొందగా... రెండో రోజు సోనూ (60 కేజీలు), సోమ్‌వీర్ (86 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. రజనీష్ (65 కేజీలు) కాంస్య పతకం నెగ్గాడు.