Nine people
-
నైన్ ఆల్ ఫైన్
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్‌కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. -
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: డబ్బు కోసం పీకలు కోసే సుపారీ గ్యాంగ్‌ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ ఆధారంగా పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో నలుగురు వ్యక్తులు హత్యలకు గురికాకుండా కాపాడగలిగారు. జిల్లాలో నాలుగు వేర్వేరు హత్యలకు పన్నిన కుట్రలను ధర్మవరం రూరల్, తాడిపత్రి రూరల్, కళ్యాణదుర్గం పోలీసులు భగ్నం చేశారు. మొత్తం తొమ్మిది మంది నిందితలను అరెస్ట్ చేసి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో మీడియాకు వెల్లడించారు. బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు కుట్ర బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ చిన్న పెద్దయ్య, బత్తలపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో బత్తలపల్లి – ధర్మవరం రహదారిలో వేల్పుమడుగు క్రాస్ వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బత్తపల్లి మండలం గంటాపురానికి చెందిన బోయపాటి ఈశ్వరయ్య, పావగడ తాలూకా కనికెలబండ గ్రామానికి చెందిన వెంకటేష్, కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన గంగాధర్, బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన అక్కిం లక్ష్మినారాయణ, పోట్లమర్రికి చెందిన బొత్తల నాగార్జున, గంటాపురానికి చెందిన అంబక్‌పల్లి శివశంకర్, మాతంగి వెంకటనారాయణ, ఎర్రాయపల్లికి చెందిన గొట్టి రమణ ఉన్నారు. వీరి నుంచి నాలుగు వేటకొడవళ్లు, 8 డిటోనేటర్లు, 8 జెలిటెన్ స్టిక్స్, 200 గ్రాముల నాటు బాంబుబల తయారీ పౌడర్, మూడు ఐరన్ పైపులు, ఒక మారుతీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో మరో నిందితుడైన గంగాధర్ తాడిపత్రి రూరల్‌పోలీసులకు చిక్కాడు. ఆధిపత్య పోరుతోనే.. అరెస్టయిన బోయపాటి ఈశ్వరయ్యకు బత్తలపల్లికి చెందిన ఓ వ్యక్తితో కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామంలో ఆధిపత్య పోరు, రానున్న ఎన్నికల్లో సదరు వ్యక్తి ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన నిందితుడు హత్యకు కుట్ర పన్నాడు. దీంతో పాటు కోర్టు విచారణలో ఉన్న ఓ కేసు విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే నెపంతో ఎలాగైనా కడతేర్చాలని పథక రచన చేశాడు. తన పొలం పనులు చూసుకునే చలపతి అనే వ్యక్తితో చర్చించి కిరాయి హంతకులను కూడగట్టాలని సూచించాడు. ఓ హత్యకేసులో నిందితులైన లక్ష్మినారాయణ, అంబక్‌పల్లి శివశంకర్, బొత్తల నాగార్జునలను చలపతి సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. నాగార్జున ద్వారా గొట్టి రమణ, ఈయన ద్వారా నాటు బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన వెంకటేష్, గంగాధర్‌లను ఆశ్రయించాడు. తనకు అడ్డు తగులుతున్న వ్యక్తిని అంతమొందించేందు కోసం బోయపాటి ఈశ్వరయ్య రూ. 4 లక్షలు అందజేశాడు. దీంతో హత్యకు అవసరమైన వేటకొడవళ్లు, మందుగుండు సామగ్రి సిద్ధం చేసుకుని కుట్ర పన్నుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా దీంతోపాటు మరోరెండు వేర్వేరు హత్యలకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. మనస్పర్ధలతో మరొకటి.. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బరాయుడికి బత్తలపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తితో కొంతకాలంగా మనస్పర్ధలున్నాయి. ఇద్దరూ సమీప బంధువులే అయినప్పటికీ మండలస్థాయి పదవి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన పదవి పోయేందుకు ఆ వ్యక్తే కారణమని భావించిన సుబ్బరాయుడు అతన్ని చంపాలని భావించాడు. గొట్టి రమణను ఆశ్రయించి రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరాయుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హత్యకుట్ర భగ్నం తాడిపత్రి మండలానికి చెందిన ఓ గ్రామస్థాయి నాయకుడిని హతమార్చేందుకు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వీరాపురానికి చెందిన లక్ష్మినారాయణ, కంబదూరు మండలం రాల్లపల్లికి చెందిన గంగాధర్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజశేఖర రెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో మరువ వంక వద్ద వీరిని అదుపులోకి తీసుకుని, వీరి నుంచి రెండు వేట కొడవళ్లు, ఏడు డిటోనేటర్లు, ఏడు జిలిటెన్ స్టిక్స్, 200 గ్రాముల బాంబుల తయారీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వీరాపురం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి, వెంకటనారాయణ, పావగడకు చెందిన వెంకటేశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరు, పరారీలో ఉన్న ముగ్గురు కలిసి పథకం వేశారు. జిల్లా జైలులో ఉన్నప్పుడు ఈ ఐదుగురు కలిసి కుట్రకు వ్యూహరచన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన వీరాపురం చింతా భాస్కర్‌రెడ్డి హత్య కేసులో లక్ష్మినారాయణ, రంగనాథరెడ్డి, వెంకటనారాయణలు, కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన పేలుళ్ల కేసులో గంగాధర్, వెంకటేష్‌లు జిల్లా జైలులో ఉండేవారు. తమకు ఓ వ్యక్తి టార్గెట్‌గా ఉన్నాడని, అతనని హతమార్చేందుకు సహకరించాలని వీరాపురానికి చెందిన ముగ్గురు నిందితులు గంగాధర్, వెంకటేష్ అడిగారు. ఇందుకు సహకరిస్తే ఆర్థికంగా సహాయపడతామని చెప్పడంతో సరేనని అంగీకరించారు. మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు వినియోగించి చంపడంలో తమకు అనుభవముందని, గతంలో కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలో వారు పాల్పడిన పేలుళ్ల హత్యోదంతాన్ని గుర్తు చేశారు. హత్య కుట్రకు అక్కేడే వ్యూవహరచన చేశారు. ఇటీవలే వీరాంతా రెండు వేర్వేరు సందర్భాల్లో బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. వీరంతా కలసి శుక్రవారం ఆ వ్యక్తిని చంపాలని సిద్ధమయ్యారు. తాను బత్తలపల్లి హత్యల్లో పాల్గొంటానని వెంకటేష్ చెప్పగా, మందుగుండు సామగ్రి, మారణాయుధాలతో లక్ష్మినారాయణ, గంగాధర్‌లు ఆ వ్యక్తిని చంపాలని బయలుదేరి పోలీసులకు చిక్కాడు. మిగతా ఇద్దరు ఈ విషయం తెలుసుకుని పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నాలుగు వేర్వేరు హత్య కుట్రలను భగ్నం చేసిన తాడిపత్రిరూరల్, ధర్మవరం రూరల్, కళ్యాణదుర్గం పోలీసులను ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అభినందించారు. ఆర్వోసీ మాజీ నేత హత్యకు కుట్ర కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన ఆర్వోసీ మాజీ నాయకుడు రామకృష్ణను చంపాలని కె.బి.వెంకటేష్, ఇ.గంగాధర్‌లు పథకం పన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాళ్ళపల్లి దుర్గప్పను మందుపాతర పేల్చి కడతేర్చారు. హతుడి సోదరుడైన రామకృష్ణ నుంచి ప్రతీకారచర్య ఉంటుందని నిందితులు భావించారు. దుర్గప్ప హత్యకేసులో జైలు నుంచి బయటకొచ్చాక కచ్చితంగా చంపుతాడని, అంతకన్నా ముందుగానే రామకృష్ణను తామే చంపితే ఇబ్బందులుండబోవని భావించారు. దీంతో జైలులోనే పథక రచన చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. -
తొమ్మిది మంది అదృశ్యం
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది అదృశ్యమయ్యారు. వీరులో ఒక బధిరుడు, ఒక బాలుడు, బాలిక, ముగ్గురు విద్యార్థినులు, ఒక మహిళ, ఒక యువతి, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరి కోసం అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లో బధిరుడు... సికింద్రాబాద్: రైల్వేస్టేషన్లో ఓ బధిరుడు అదృశ్యమయ్యాడు. గోపాలపురం హెడ్‌కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం....విశాఖపట్నం అలీపురానికి చెందిన యు.భాస్కరరావు నగరంలోని బొగ్గులకుంటలో అమ్మ, అక్కతో కలిసి ఉంటున్నాడు. తనకు రావాల్సిన వికలాంగ పింఛన్‌ను తెచ్చుకొనేందుకు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన భాస్కరరావు ఈనెల 21న నగరానికి రైల్లో తిరిగి బయలుదేరాడు. అతని రాకకోసం సోదరి కృష్ణవేణి నాంపల్లి రైల్వేస్టేషన్లో ఎదురు చూసింది. అయితే అతను రాకపోవడంతో రైల్వే పోలీసులను ఆశ్రయించి నాంపల్లి, సికింద్రాబాద్స్టేషన్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. అతను సికింద్రాబాద్ స్టేషన్లో దిగి బయటకు వెళ్లినట్టు కనిపించింది. దీంతో సోదరి గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతాఫల్మండిలో బాలుడు... చిలకలగూడ : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ జయశంకర్ కథనం ప్రకారం.. సీతాఫల్మండి టీఆర్టీ క్వార్టర్స్‌కు చెందిన దీపక్(11) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 23న సాయంత్రం స్నేహితులతో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తండ్రి కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నారపల్లిలో బీటెక్ విద్యార్థిని... బోడుప్పల్: బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ కిషన్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హనుమంత్‌రెడ్డి కుమార్తె సుమలత(23) నారపల్లి దివ్యనగర్‌లోని హాస్టల్ ఉంటూ నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ వెళ్తున్నానని హాస్టల్లో చెప్పి బయలుదేరిన సుమలత ఇంటికి చేరలేదు. దీంతో ఆమె తండ్రి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థిని... బోడుప్పల్: పుస్తకాలు తెచ్చుకొనేందుకు స్కూల్‌కు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం... బోడుప్పల్ రెడ్డీస్ కాలనీకి చెందిన గోపాల్ బహుదూర్ కుమార్తె అనిత బహుదూర్(14) ఇందిరానగర్‌లోని న్యూటన్ గ్రామార్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. శనివారం స్కూల్‌కు వెళ్లిన అనిత తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి గోపాల్ బహుదూర్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హాల్‌టికెట్ కోసం వెళ్లిన విద్యార్థిని... దుండిగల్: కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కూతురు సుజాత(17) మేడ్చల్‌లోని స్ఫూర్తి కళాశాలలో చదువుతోంది. కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కళాశాలకు వెళ్లిన సుజాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. లక్ష్మీగూడలో బాలిక... కాటేదాన్: బాలిక అదృశ్యమైన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మహేంద్రనాథ్ కథనం ప్రకారం...లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్ప ప్రాతానికి చెందిన మహ్మద్ అజ్మతుల్లా కూతురు మున్నిబేగం(16) ఈనెల 21న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదుచేశారు. కేసు దర్యాప్తులో ఉంది. అడ్డగుట్టలో మహిళ... అడ్డగుట్ట: పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. తుకారాంగేట్ పోలీసుల కథనం ప్రకాం... అడ్డగుట్ట ఆజాద్చంద్రశేఖర్నగర్కు చెందిన సీహెచ్ రమేష్, స్వరూప(23) దంపతులు. రమేష్ ఆటోడ్రైవర్ కాగా, స్వరూప మహేంద్రాహిల్స్‌లోని రోడ్డు నెం. 6లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. అయితే, రోజూ మాదిరిగానే ఈనెల 11న పనికి వెళ్లిన స్వరూప రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. భర్త ఆమె కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం తుకారాంగేట్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్‌లో యువతి.. చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ అక్రంబాబా కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని అంజనీనగర్కు చెందిన బి.కవిత (16) ఈనెల 23న ఉదయం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రాజు ఆదివారం మాదాపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -గచ్చిబౌలి నేపాల్‌కు చెందిన వృద్ధుడు... నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు కూతురు వద్దకు వచ్చి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రంజిత్ కథనం ప్రకారం.. గీత్ బహదూర్ (60) నేపాల్ నుంచి కూతురు వద్దకు వచ్చాడు. ఈనెల 22న ఉదయం 6 గంటలకు టీ తాగేందుకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో అల్లుడు రాంబహదూర్ మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. -గచ్చిబౌలి