nine years
-
కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్‌పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు. గతంలోనే కిషన్‌రెడ్డి రిపోర్ట్ కార్డ్ హైదరాబాద్‌లో గత జూన్ 17న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్‌పాయింట్, డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్ నేత డా.ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 17లోగా అవగాహన కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఆత్మగౌరవం కోల్పోతోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అన్నివర్గాల భాగస్వామ్యంతో ఏర్పడిందని, తొమ్మిదేళ్లుగా ప్రజలు మోసగించబడుతూ, ఆత్మగౌరవం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షతన జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటు చేసి పేదలకు ఉన్నతవిద్య దూరం చేశారని చెప్పారు.ముప్పైమంది విద్యార్థులకు ఒక టీచర్ పేరుతో దాదాపుగా ఎనిమిదివేల స్కూళ్లను మూసివేశారని, పీహెచ్డీ చేసినవారు రూ.5వేలకు పనిచేస్తున్నారని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితబంధు, బీసీలకు లక్ష రూపాయల సహాయం ఓట్ల కోసమేనని, కేసీఆర్‌కు కుర్చీ మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదని, పుట్టిన పిల్లలమీద రూ.1.25 లక్షల అప్పు చేసిపెట్టారని చెప్పారు. వచ్చే నెల 6న అన్నివర్గాల సమస్యలను పుస్తకం రూపంలో విడుదల చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారులు అరవింద్‌రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధి పేరాల శేఖర్‌రావు, తుర్క నరసింహ, అశ్వథ్వామరెడ్డి, విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ పుంజు వయసు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా..
దొర్నిపాడు(నంద్యాల): ఈ పుంజు వయసు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లు. మండలంలోని క్రిష్టిపాడుకు గోసుల పుల్లయ్య దీని యజమాని. పుట్టినప్పటి నుంచి బొద్దుగా ఉండటం, దీనికి పుట్టిన పిల్లలు కూడా బలంగా ఉంటుండటంతో ఈ పుంజును ఎవరికీ అమ్మకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. వీటి జీవిత కాలం మూడు నుంచి ఏడేళ్లేనని, అయితే ఈ పుంజు తొమ్మిదేళ్లు బతకడంపై వెటర్నరీ డాక్టర్ హరిత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే? -
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్‌లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్‌లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో బాలుడు
-
తొమ్మిదేళ్ల తర్వాత కదలిక
బోయినపల్లి : మధ్యమానేరు జలాశయం నిర్మాణ పనులకు తొమ్మిదేళ్ల తర్వాత కదలిక వచ్చింది. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిర్మించాల్సిన మట్టికట్ట పనులను బుధవారం మండలంలోని మాన్వాడ గ్రామంలో ఈఈ గోవిందరావు, ఎస్డీసీ శంకర్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ మట్టికట్ట, 555 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. 2006లో మండలంలోని మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. రూ.406.48 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలువగా, రూ. 339.39 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేస్తామని జెడ్‌వీఎస్-రత్న-సుశి సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి పనులు చేపట్టాయి. ఈ సంస్థలు ప్రారంభంలో కేవలం కట్ట పనులు మాత్రమే చేసి ఇక పనులు చేయలేమని చేతులెత్తేశాయి. చేసిన పనులకు ఆ సంస్థలకు రూ.77 కోట్లు చెల్లించారు. మళ్లీ 2010లో రూ.454 కోట్ల అంచనాలతో ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్తో రూ.360.90 కోట్లకు ఎంఎస్ ఎస్ఏపీఎల్ అండ్ ఎంబీఎల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి మిడ్‌మానేర్ రిజర్వాయర్ పనులను దక్కించుకున్నాయి. మట్టికట్ట 10 కిలోమీటర్లు.. స్పిల్‌వే 555 మీటర్లు.. మండలంలోని వెంకట్రావ్పల్లి రూసో కళాశాల ప్రాంతంలో రిజర్వాయర్ 0 పాయింట్ తీసుకుని అక్కడి నుంచి మట్టికట్ట పనులు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కొదురుపాక పరిసరాల నుంచి మాన్వాడ మీదుగా ఐదు కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించనున్నారు. మాన్వాడ నుంచి ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల కాకులబోర్ వరకు ఐదు కిలోమీటర్లు మట్టికట్ట నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 10 కిలోమీటర్ల మట్టికట్ట నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండలంలోని మాన్వాడ గ్రామంలోని మానేరు నదిలో 555 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మాణం పనులు గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తున్నాయి. స్పిల్‌వే నిర్మాణంలో 25 గేట్లు, క్రాస్ రెగ్యులేటర్లు, తూముల నిర్మాణం పనులు చేస్తున్నారు. నిర్మాణ కాలం 16 నెలలు మట్టికట్ట పనులు, స్పిల్‌వే నిర్మాణం పనులు 16 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం కంట్రాక్టర్లకు గడువు విధించింది. 2016 ఖరీఫ్ సీజన్ వరకు జలాశయంలో మూడు టీఎంసీల నీరు నిలువ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వాయర్‌లో నిలువ చేసిన నీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకానికి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే ప్రభుత్వం మిడ్‌మానేర్ పనులు యుద్ధప్రాతిపదికన చేసేందుకు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. -
బాబు కాలం
‘అమ్మో.. చంద్రబాబును తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆ తొమ్మిదేళ్లు జీవితం మీదే విరక్తి కలిగింది. ఇలాగైతే ఎలా బతకాలని నిద్రలేని రాత్రులు గడిపాం. వ్యవసాయాన్ని ఆయన పక్కా వ్యాపారంగా చూశారు. రైతులకు లబ్ధి కలిగే ఒక్క పని చేసింటే ఒట్టు. కరెంటు బిల్లులు ముక్కు పిండి వసూలు చేశారు. బిల్లు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ ఇళ్లకు నోటీసులు అతికించి వెళ్లారు. ఇపుడు అవన్నీ మరచిపోయి కబుర్లు చెబుతున్నారాయన. ఇపుడు ఆయనకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని రైతులు చెబుతున్నారు. -
ఆ తొమ్మిదేళ్లు రైతులకు నరకం
చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ర్టం నంబర్‌వన్ వుహానేత పథకాలను నీరుగార్చిన అసవుర్థుడు కిరణ్ చంద్రబాబు నీతిలేని రాజకీయు నాయుకుడు వూజీవుంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి ఫైర్ రావుకుప్పం, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పాలనలో రైతన్న నరకం అనుభవించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజ మెత్తారు. అప్పట్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వైఎస్ఆర్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్యకిరణ్, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళికి మద్దతుగా బుధవారం పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు. రామకుప్పంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయున ప్రసం గించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో పట్టుబట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షల పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని తెలియుజేశారు. బాబు కేబినెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాగం జనార్ధన్‌రెడ్డి వూనసిక జబ్బులతో పిచ్చిపట్టి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రకటించి, రైతులను చులకన చేసి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని బాబు నేడు ఆల్ ఫ్రీ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని ఆరోపించారు. మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వా న్ని కాపాడిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. కుప్పంలోనే ఉచిత విద్యుత్‌పై హామీ ఇచ్చారు. వుహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుప్పం రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయున అధికారంలోకి రాగానే ఇచ్చిన వూట ప్రకారం మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి పరిపాలనలో వుంచి అనుభవజ్ఞుడని తెలిపారు. గ్రామీణ సవుస్యలపై ఆయనకు వుంచి అవగాహన ఉందని, కుప్పం ప్రజల సవుస్యలను కచ్చితంగా తీరుస్తాడన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలో వచ్చిన వెంటనే పాలారు ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీటి సవుస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తావున్నారు. హంద్రీ-నీవా కాలువను కుప్పం వరకు పొడగిస్తావున్నారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఆయన అకాల మరణం తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 33 జబ్బులను తొలగించారని, ఫీజు రీరుుం బర్స్‌మెంటు పథకానికి నిధులు విడుదల చేయుని అసవుర్థ సీఎంగా కిరణ్‌కువూర్‌రెడ్డి మిగిలిపోయూరన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టిన చంద్రబాబు మైనారిటీలకు ద్రోహం చేశారన్నారు. మైనారిటీలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌దేనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోసంచేసి గెలుస్తున్నారు: చంద్రమౌళి ప్రతి సారీ చంద్రబాబు కుప్పం ప్రజలను మోసగించి గెలుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి ఆరోపించారు. 1989 ఎన్నికల్లో ప్రతి ఇంటికీ రెండు పాడి ఆవులు ఇస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. 2009 ఎన్నికల్లో నగదు బదిలీ పథకం పేరుతో నకిలీ ఏటీఎం కార్డులిచ్చి మోసగించారన్నారు. ఈ సారి కూడా ఏదో జాదూ చేస్తాడని, వాటిని నవ్మువద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి, నవ్ముకానికి ఓటువేయూలని కోరారు. తొలుత వూజీ జెడ్పీటీసీ సభ్యులు ఆరేళ్ల జయుప్ప, వూజీ ఎంపీపీ ఆంజనేయుప్ప, వెంకటేష్‌బాబు, గౌస్‌బాషా, వాసు, విజలాపురం బాబు, నరసింహులు, సెంథిల్ ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీ నాయుకులు వుణీంద్ర బాబు, లాయుర్ అవురనాథ్, వూజీ సర్పంచ్‌లు వుధుసూదన్‌రెడ్డి, సుగుణప్ప, వూజీ సింగిల్‌విండో చైర్మన్ విజయ్కువూర్రెడ్డి, సింగిల్‌విండో డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి, వూజీ ఎంపీపీలు సిద్ధప్ప, సుబ్రవుణ్యం, రిటైర్డ్ ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, రిటైర్డ్ వీఏవో రావుక్రిష్ణారెడ్డి, వాటర్‌షెడ్ చైర్మన్ శ్రీనివాసులు, వుంజునాథ్రెడ్డి పాల్గొన్నారు. బాబుకు ఎందుకు ఓటేయూలి: సామాన్య కిరణ్ అధికారంలో ఉన్నంతకాలం ప్రజా సమస్యలను పట్టించుకోని చంద్రబాబుకు ఎందుకు ఓటేయూలని చిత్తూరు లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని బాబుకు ఓటు వేసే విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. గెలిచిన అనంతరం నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.