ఆ తొమ్మిదేళ్లు రైతులకు నరకం
- చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ర్టం నంబర్‌వన్
- వుహానేత పథకాలను నీరుగార్చిన అసవుర్థుడు కిరణ్
- చంద్రబాబు నీతిలేని రాజకీయు నాయుకుడు
- వూజీవుంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి ఫైర్
రావుకుప్పం, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పాలనలో రైతన్న నరకం అనుభవించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజ మెత్తారు. అప్పట్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్యకిరణ్, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళికి మద్దతుగా బుధవారం పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు.
రామకుప్పంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయున ప్రసం గించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో పట్టుబట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షల పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని తెలియుజేశారు.
బాబు కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాగం జనార్ధన్‌రెడ్డి వూనసిక జబ్బులతో పిచ్చిపట్టి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రకటించి, రైతులను చులకన చేసి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని బాబు నేడు ఆల్ ఫ్రీ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని ఆరోపించారు. మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వా న్ని కాపాడిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు.
కుప్పంలోనే ఉచిత విద్యుత్‌పై హామీ ఇచ్చారు.
వుహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుప్పం రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయున అధికారంలోకి రాగానే ఇచ్చిన వూట ప్రకారం మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి పరిపాలనలో వుంచి అనుభవజ్ఞుడని తెలిపారు. గ్రామీణ సవుస్యలపై ఆయనకు వుంచి అవగాహన ఉందని, కుప్పం ప్రజల సవుస్యలను కచ్చితంగా తీరుస్తాడన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ అధికారంలో వచ్చిన వెంటనే పాలారు ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీటి సవుస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తావున్నారు. హంద్రీ-నీవా కాలువను కుప్పం వరకు పొడగిస్తావున్నారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఆయన అకాల మరణం తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం నుంచి 33 జబ్బులను తొలగించారని, ఫీజు రీరుుం బర్స్‌మెంటు పథకానికి నిధులు విడుదల చేయుని అసవుర్థ సీఎంగా కిరణ్‌కువూర్‌రెడ్డి మిగిలిపోయూరన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టిన చంద్రబాబు మైనారిటీలకు ద్రోహం చేశారన్నారు. మైనారిటీలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌దేనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మోసంచేసి గెలుస్తున్నారు: చంద్రమౌళి
ప్రతి సారీ చంద్రబాబు కుప్పం ప్రజలను మోసగించి గెలుస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి ఆరోపించారు. 1989 ఎన్నికల్లో ప్రతి ఇంటికీ రెండు పాడి ఆవులు ఇస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. 2009 ఎన్నికల్లో నగదు బదిలీ పథకం పేరుతో నకిలీ ఏటీఎం కార్డులిచ్చి మోసగించారన్నారు. ఈ సారి కూడా ఏదో జాదూ చేస్తాడని, వాటిని నవ్మువద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి, నవ్ముకానికి ఓటువేయూలని కోరారు.
తొలుత వూజీ జెడ్పీటీసీ సభ్యులు ఆరేళ్ల జయుప్ప, వూజీ ఎంపీపీ ఆంజనేయుప్ప, వెంకటేష్‌బాబు, గౌస్‌బాషా, వాసు, విజలాపురం బాబు, నరసింహులు, సెంథిల్ ప్రసంగించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయుకులు వుణీంద్ర బాబు, లాయుర్ అవురనాథ్, వూజీ సర్పంచ్‌లు వుధుసూదన్‌రెడ్డి, సుగుణప్ప, వూజీ సింగిల్‌విండో చైర్మన్ విజయ్‌కువూర్‌రెడ్డి, సింగిల్‌విండో డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి, వూజీ ఎంపీపీలు సిద్ధప్ప, సుబ్రవుణ్యం, రిటైర్డ్ ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, రిటైర్డ్ వీఏవో రావుక్రిష్ణారెడ్డి, వాటర్‌షెడ్ చైర్మన్ శ్రీనివాసులు, వుంజునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
బాబుకు ఎందుకు ఓటేయూలి: సామాన్య కిరణ్
అధికారంలో ఉన్నంతకాలం ప్రజా సమస్యలను పట్టించుకోని చంద్రబాబుకు ఎందుకు ఓటేయూలని చిత్తూరు లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని బాబుకు ఓటు వేసే విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. గెలిచిన అనంతరం నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.