Samanyakiran
-
కాసింత సహృదయత లేదా?
ఆలోచనం గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగు దేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న తెలుగుదేశం వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో? కుటుంబాన్ని ఒక్కడై పోషిస్తున్న ఎలియేలుకు ఒక నెల క్రితం బాగా జ్వరమొచ్చింది. ఒంగోలుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలియేలు మొదట తన ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ దగ్గరకి వెళ్లి చూపించుకున్నాడు. ఆయనేవో మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గింది. కానీ ఒకటే నీరసం. పనికి పోవడం ఆపి చేతిలో ఉన్న 4 రూపాయలూ ఖర్చుపెట్టి ఇల్లు గడపడం మొదలు పెట్టాక ఎలియేలు వాళ్ళ కాలనీలోనే పదకొండేళ్ల చిన్న అబ్బాయి చనిపోయాడు. డెంగ్యూ అన్నారు. ఎలియేలుకు భయం వేసింది. మళ్ళీ జ్వరం కాయడం మొదలుపెట్టింది. ప్రభుత్వాసుపత్రిలో చూపిస్తే పరీక్షలు చేయాలి, ప్లేట్లెట్ కౌంట్ చూడాలన్నారు. చూడటానికి అవసరమైన మెషీను తమవద్ద లేదు కాబట్టి పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రికి పొమ్మన్నారు. అతని దగ్గర డబ్బులేదు. అతని భార్యకి బాగా భయం పట్టుకుంది. వేకువజామునే బస్సెక్కి పుట్టింటికెళ్లి తండ్రిని, అన్నల్నీ అడిగి ఐదువేలు తెచ్చి పరీక్షలు చేయించింది. అప్పట్నుంచి, మొన్న విజయవాడ నుంచి ఇంటికొచ్చేదాకా దాదాపు లక్షదాకా ఖర్చయింది. తర్వాతే అతను ఇంటికొచ్చాడు. ఇలాంటి కేసులు ప్రకాశం జిల్లాలో బోలెడు. ఒంగోలుకు దగ్గర్లోనే ఉన్న దర్శిలోనే ఇప్పటివరకు డెంగ్యూతో 15మంది పిల్లలు మరణించినట్టు వార్తలు. ప్రజారోగ్యం మన ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది. మందుల నుంచి ప్రతి ఒక్కటీ మన వైద్యశాలలో ఫ్రీ. అయితే కాగితాలలో కనిపించే మాటలకు కంటి ముందు కని పించే దృశ్యాలకు పొంతన ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పరిగెత్తుతున్నారు. ఒకప్పుడు మనకు ప్రతి ఊరిలో ఆయుర్వేద వైద్యులుండేవాళ్లు. వీరు డబ్బుకోసం కాక వైద్య సేవ మీద తృష్ణతో వైద్యం చేసేవారు. కొన్ని రోగాలకు, కొన్ని ఆపత్సమయాలకు అక్కరకు వచ్చే దేశీయ ప్రత్యామ్నాయ వైద్యాన్ని పెకలించివేసింది ఇంగ్లీష్ వైద్యం. ప్రకాశం జిల్లా అంతటా వీస్తున్న విషపు గాలి నన్నూ టైఫాయిడ్ రూపంలో ఆవహించింది. ఎంతకూ తగ్గని ఈ రోగం నాకు టైఫాయిడ్ మేరీని జ్ఞాపకం తెచ్చింది. టైఫాయిడ్ మేరీ యుఎస్‌లో మొదట గుర్తిం చిన టైఫాయిడ్ వ్యాధి లక్షణాలను కనిపించకుండా మోసుకొచ్చే వాహకం. 1900–1907 వరకు ఆమె వంటమనిషిగా పనిచేసిన ప్రతి ఇంటివారు జ్వరపడటమూ, కొంతమంది మరణించటం జరిగింది. దీనికి మేరీ కారణమని భావించి చేసిన పరిశోధనలో అది నిజమని రుజువయ్యాక ఆమె అరెస్టై అనేక ఏళ్ళ పాటు ఏకాకితనాన్ని అనుభవించింది. ఆ తరువాత ఏటా వేల సంఖ్యలో టైఫాయిడ్ కేసులు నమోదయ్యే అమెరికా మెరుగైన పారిశుధ్య పద్ధతులను అవలంబించి నేడు ఆ కేసులను మూడొందలు నాలుగొందలకి కుదించింది. ఆ కొన్ని కేసులు కూడా మెక్సికో, నార్త్ అమెరికా నుంచి వస్తున్న ప్రయాణికులు మోసుకొస్తున్నవే తప్ప అక్కడివి కావట. మనకి మన చుట్టూతా అందరూ టైఫాయిడ్ మేరీలే. మనం కూడా మన చుట్టు పక్కల వారికి టైఫాయిడ్ మేరీలమే. అమెరికా ఎప్పుడో శతాబ్దం పూర్వం ఆరోగ్యం పట్ల, పారిశుధ్యం పట్ల చూపించిన శ్రద్ధ మనం ఇప్పుడు కూడా చూపించలేక పోతున్నాం. ఒక రోజు నేను నా తమ్ముడి వెట్ క్లినిక్‌లో కూర్చుని వున్నాను. ఆరోగ్యంగా ఉన్న ఒక కుటుంబం బలహీనంగా వున్న ఒక దేశీ జాతి కుక్కను తీసుకుని వచ్చింది. ఊరకుక్క అని చిన్న చూపు చూడకండి అని వేడుకున్న యజమానురాలు ఆ శునకం రోగాన్ని నివేదించింది. అప్పటికప్పుడు ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు జరి గాయి. అంతసేపు ఆ కుక్క, ఆవేదన చెందుతున్న ఆ తల్లి ఒడిలో అలసటగా పడుకుని ఉంది. ఆ పడుకోవడంలో అది ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. ఇది రాస్తున్నపుడు నాకెందుకో దాని ముఖంలో ఆ రోజు కనిపించిన ఆ సౌఖ్యం పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. గాలి మార్పుకోసం ఒంగోలు నుంచి పారిపోయి వచ్చాను నేను. ఇవాళ పొద్దుటే కళ్లు తెరవగానే ఎదుట కనిపించిన ఆకు పచ్చటి మైదానం నాకు శరత్ చంద్ర ఛటోపాధ్యాయ ‘దత్త’ నవలలో డాక్టర్ నరేంద్రుడుని జ్ఞాపకం తెచ్చింది. మైదానంకి ఆవలనుంచి నడుచుకుంటూ వస్తున్న అతని రూపం, ఆ పుస్తకంలో అక్కడక్కడా కనిపించే మసూచి రోగం జ్ఞాపకం వచ్చాయి. అందులో ఒక మాట.. ‘‘సహృదయం అనే వస్తువు ఒకటి ఉంది. మీరు దాన్ని ఇంకెక్కడా చూడలేదా’’ అని. తెలుగుదేశం పార్టీ గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతూ ఉంది. మరి ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో? బహుశా బాబుగారు ఇచ్చేదేదయినా ఇప్పుడే ఇచ్చేస్తే ఓటేసేనాటికి మరచిపోతారని అనుకుంటున్నారేమో. ఈ పార్టీలు, రాజకీయాలు అంతా పక్కన పెట్టేసి ఆలోచించి చూడండి, సహృదయత అనే వస్తువు ఒకటి వుంది. మీకింతవరకు పరిచయం కాకుంటే పరిచయం చేసుకోండి. మన రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేనివే. రాజకీయాలు పక్కన పెట్టి వారికి వెచ్చటి ఓదార్పును ఇవ్వండి. ఆరోగ్య సేవలు మెరుగుపరచండి. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి : సామాన్య కిరణ్ 91635 69966 -
నీటి సమస్య తీరుస్తా.. వలసలను నివారిస్తా
చంద్రబాబు వైఫల్యాలు, ప్రజా సమస్యలే ప్రచార అస్త్రాలు టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు చూసి జగన్ వెంట నడవాలని నిర్ణయించా సాక్షి ఇంటర్వ్యూలో వైఎస్సార్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్యకిరణ్ చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, జాతీయ రహదారి సమస్య వంటి ప్రధాన అంశాలు, కుప్పం నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ జి.సామాన్యకిరణ్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. వలసలను నివారిస్తానని చెబుతున్నారు. సమాజ సేవే లక్ష్యంగా ట్రస్టు నడుపుతున్నారు. పేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు. ‘సాక్షి ’కి సామాన్యకిరణ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. మీ కుటుంబ నేపథ్యం సామాన్యకిరణ్: నేను పుట్టింది మదనపల్లెలో. మా తండ్రి స్వగ్రామం జిల్లాలోని పూతలపట్టు మండలం టి.కొత్తూరు గ్రామం. అమ్మ సొంతూరు నెల్లూరు జిల్లా టీపీ.గూడురు మండలం వరిగొండ. ఉద్యోగ రీత్యా అక్కడే ఉండేవాళ్లం. 2013 వరకు నెల్లూరులోనే అధ్యాపకురాలిగా పని చేశాను. భర్త జీ.కిరణ్ది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో చదివేటప్పుడు పరిచయమయ్యారు. మాది ప్రేమ వివాహం. వెస్ట్‌బెంగాల్ ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. మీ విద్యా నేపథ్యం సామాన్యకిరణ్: చిత్తూరులో 10వ తరగతి వరకు చదివాను. ఎస్వీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్డీ చేశాను. పలు అంశాలపై పరిశోధనలు, అనేక సాహిత్య ప్రచురణలు చేశాను. నెల్లూరులో 2013 వరకు తెలుగు అధ్యాపకురాలిగా పని చేశాను. చిత్తూరు ఎంపీగా మీరేం చేస్తారు సామాన్యకిరణ్: చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తాగునీరు, సాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అత్యవసర సమస్యగా పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రెండవ ప్రధాన సమస్య వలసలు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ఉపాధి కోసం బెంగుళూరు, చెన్నయ్‌కి వెళ్తున్నారు. వలసలను నిరోధించేందుకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తాను. తద్వారా ప్రజల వలసలు ఆగుతాయి. నేషనల్హైవే-4 నియోజకవర్గం మీదుగానే కర్నాటకకు వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించి, రోడ్డును నాలుగులైన్లుగా మార్చేందుకు కృషి చేస్తా. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపడతాను. చిత్తూరు విజయా డెయిరీని చంద్రబాబు తన స్వార్థం కోసం మూయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుజరాత్ ఆనంద్ తరహా డెయిరీని సహకార రంగంలోనే రైతుల కోసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడతాం. కుప్పం, పలమనేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కృషి చేస్తా. ఏనుగుల దాడుల్లో పంట, ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థికసాయం చేయటం కూడా ఒక ప్రధాన అంశంగా ముందుకెళ్తాం. పాకాలను మోడల్ రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అభివృద్ధి చేస్తాం. కుప్పంలో నీటి సమస్య పరిష్కారానికి వైఎస్ చేపట్టిన పాలారు ప్రాజెక్టును పూర్తి చేయిస్తాం. మూడు ఫైఓవర్ల నిర్మాణానికి చర్యలు చేపడతాం. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు. సామాన్యకిరణ్: చదువుకునే రోజుల్లోనే వామపక్ష సిద్దాంతాల పట్ల ఆకర్షితురాలినయ్యా. నా తెలుగు సాహ్యిత పరిశోధనలు కూడా అభ్యుదయ అంశాలకు సంబంధించినవే. అలా కొనసాగుతున్న క్రమంలో వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై రాజకీయాల్లోకి వచ్చాను. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయి జగన్‌ను వేధించి, ఆయనపై పన్నిన కుట్రలు చూసి చలించాను. ఆయనతో పాటు నడవాలని, మద్దతుగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. జగన్ ఆదేశం మేరకు ఖమ్మం జిల్లా మధిర వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టాను. డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్కకు ధీటుగా పని చేశాను. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ ఆదేశించటంతో ఎన్నికల బరిలో దిగాను. ప్రచారంలో కీలకంగా ప్రస్తావిస్తున్న అంశాలు సామాన్యకిరణ్: పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ఎప్పుడో జనంలోకి వెళ్లిపోయింది. 20 నుంచి 30 సంవత్సరాల పాటు జగన్మోహన్రెడ్డి సీఎంగా పని చేయబోతున్నారు. ఆయన వస్తేనే వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. చెప్పింది చేసే నిజాయితీ, విశ్వసనీయత జగన్‌లో ఉన్నాయనేది ప్రజలు నమ్ముతున్నారు. పార్టీ మేనిఫెస్టోలో జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలను, హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఆయన తొలి సంతకంగా ప్రకటించిన అమ్మఒడి పథకానికి ఆడపడుచుల్లో అద్భుతమైన స్పందన వస్తోంది. దీని వల్ల పేదరికం, నిరుద్యోగాన్ని అత్యం త త్వరగా రూపుమాపవచ్చు. పిల్లలు చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్తారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు పింఛన్ పెంపు ఒక భరో సా. ధరల స్థిరీకరణ నిధితో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ఇవన్నీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, చిత్తూరు లోక్‌సభ పరిధిలో కూరగాయల సాగు, చెరకు, వేరుశనగ రైతులు, బెల్లం తయారీ రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రచారం సాగిస్తున్నాము. జనం నుంచి స్పందన చాలా బాగుంది. -
ఆ తొమ్మిదేళ్లు రైతులకు నరకం
చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ర్టం నంబర్‌వన్ వుహానేత పథకాలను నీరుగార్చిన అసవుర్థుడు కిరణ్ చంద్రబాబు నీతిలేని రాజకీయు నాయుకుడు వూజీవుంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి ఫైర్ రావుకుప్పం, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పాలనలో రైతన్న నరకం అనుభవించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజ మెత్తారు. అప్పట్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వైఎస్ఆర్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్యకిరణ్, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళికి మద్దతుగా బుధవారం పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు. రామకుప్పంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయున ప్రసం గించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో పట్టుబట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షల పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని తెలియుజేశారు. బాబు కేబినెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాగం జనార్ధన్‌రెడ్డి వూనసిక జబ్బులతో పిచ్చిపట్టి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రకటించి, రైతులను చులకన చేసి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని బాబు నేడు ఆల్ ఫ్రీ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని ఆరోపించారు. మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వా న్ని కాపాడిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. కుప్పంలోనే ఉచిత విద్యుత్‌పై హామీ ఇచ్చారు. వుహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుప్పం రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయున అధికారంలోకి రాగానే ఇచ్చిన వూట ప్రకారం మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి పరిపాలనలో వుంచి అనుభవజ్ఞుడని తెలిపారు. గ్రామీణ సవుస్యలపై ఆయనకు వుంచి అవగాహన ఉందని, కుప్పం ప్రజల సవుస్యలను కచ్చితంగా తీరుస్తాడన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలో వచ్చిన వెంటనే పాలారు ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీటి సవుస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తావున్నారు. హంద్రీ-నీవా కాలువను కుప్పం వరకు పొడగిస్తావున్నారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఆయన అకాల మరణం తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 33 జబ్బులను తొలగించారని, ఫీజు రీరుుం బర్స్‌మెంటు పథకానికి నిధులు విడుదల చేయుని అసవుర్థ సీఎంగా కిరణ్‌కువూర్‌రెడ్డి మిగిలిపోయూరన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టిన చంద్రబాబు మైనారిటీలకు ద్రోహం చేశారన్నారు. మైనారిటీలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌దేనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోసంచేసి గెలుస్తున్నారు: చంద్రమౌళి ప్రతి సారీ చంద్రబాబు కుప్పం ప్రజలను మోసగించి గెలుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవళి ఆరోపించారు. 1989 ఎన్నికల్లో ప్రతి ఇంటికీ రెండు పాడి ఆవులు ఇస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. 2009 ఎన్నికల్లో నగదు బదిలీ పథకం పేరుతో నకిలీ ఏటీఎం కార్డులిచ్చి మోసగించారన్నారు. ఈ సారి కూడా ఏదో జాదూ చేస్తాడని, వాటిని నవ్మువద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి, నవ్ముకానికి ఓటువేయూలని కోరారు. తొలుత వూజీ జెడ్పీటీసీ సభ్యులు ఆరేళ్ల జయుప్ప, వూజీ ఎంపీపీ ఆంజనేయుప్ప, వెంకటేష్‌బాబు, గౌస్‌బాషా, వాసు, విజలాపురం బాబు, నరసింహులు, సెంథిల్ ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీ నాయుకులు వుణీంద్ర బాబు, లాయుర్ అవురనాథ్, వూజీ సర్పంచ్‌లు వుధుసూదన్‌రెడ్డి, సుగుణప్ప, వూజీ సింగిల్‌విండో చైర్మన్ విజయ్కువూర్రెడ్డి, సింగిల్‌విండో డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి, వూజీ ఎంపీపీలు సిద్ధప్ప, సుబ్రవుణ్యం, రిటైర్డ్ ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, రిటైర్డ్ వీఏవో రావుక్రిష్ణారెడ్డి, వాటర్‌షెడ్ చైర్మన్ శ్రీనివాసులు, వుంజునాథ్రెడ్డి పాల్గొన్నారు. బాబుకు ఎందుకు ఓటేయూలి: సామాన్య కిరణ్ అధికారంలో ఉన్నంతకాలం ప్రజా సమస్యలను పట్టించుకోని చంద్రబాబుకు ఎందుకు ఓటేయూలని చిత్తూరు లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని బాబుకు ఓటు వేసే విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. గెలిచిన అనంతరం నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
చంద్ర బాబూ... జిల్లాకు ఏం చేశారు ?
హెరిటేజ్ కోసం విజయా డెయిరీని మూసేశారు లాభాల్లో ఉన్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారు సొంత జిల్లాకు మేలు కంటే కీడే ఎక్కువ చేశారు వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ధ్వజం జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పాలన-నారాయణస్వామి పెనుమూరు, న్యూస్‌లైన్: తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు లోకసభ అభ్యర్థి సామాన్య కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ స్థానం ఎన్నికల పరిశీలకులు,మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆమె పెనుమూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పులిగుంటీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తరోడ్డు ఇండ్లు, ఠాణావేణుగోపాల పురం, సీఎస్ అగ్రహారం కాలనీ, చార్వాకానిపల్లె, చార్వాకానిపల్లె హరిజనవాడ, బీసీ కాలనీ, మంగళ కాలనీ, పెనుమురు చెక్ పోస్టు, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పెనుమూరు రెడ్డి రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాకు చేసిన మేలు కంటే కీడు ఎక్కువన్నారు. చంద్రగిరి మండలంలో ఉన్న హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయా డెయిరీ మూసివేశారని ఆరోపించారు. అలాగే లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్నప్పుడు ఉచిత కరెంట్‌పై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని సీఎం అయిన వెంటనే తొలి సంతకంతో నెరవేర్చారన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చిత్తూరు డెయిరీని తెరిపిస్తానన్నారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లావాసులు తాగు,సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్‌ను, గంగాధరనెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి నారాయణస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. అలాగే ఎన్టీఆర్ జలాశయం నుంచి మిగులు జలాలు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు అనుసంధానం చేయడానికి సప్లయ్ చానల్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు అభ్యర్థి నారాయణస్వామి మాట్లాడుతూ సీమాంధ్రలో 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకోవడం ఖాయం అన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పారు. కుతూహలమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేను చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యులు శైలజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కారేటి గోవిందరెడ్డి, దూది కృష్ణమూర్తి, సాతంబాకం నరసింహారెడ్డి, పెద్దినేని గోపాల్ నాయుడు, మండల కన్వీనర్ మహాసముద్రం సురేష్‌రెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ దూది రవికుమార్, మండల అధికార ప్రతినిధి చింతాచెన్నకేశవులు, మండల కార్యదర్శి పెద్దరాసిపల్లె నరసింహారెడ్డి మండల యూత్ కన్వీనర్ ఐరాల మురళీకుమార్రెడ్డి, మండల బీసీ సెల్ కన్వీనర్ మనోహర్, ఎస్సీ నాయకులు దామోదరం తదితరులు పాల్గొన్నారు. -
సుభిక్ష పాలన జగన్‌కే సాధ్యం
టీడీపీ ప్రలోభాలకు లోనుకావద్దు చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచుతారు వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్యకిరణ్ చిత్తూరు (కొంగారెడ్డిపల్లె) న్యూస్‌లైన్: రాష్ట్రంలో సుభిక్షపాలన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్ అన్నారు. సోమవారం చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్ పేటలో వైఎస్సార్సీపీ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి అన్ని వర్గాలకు మేలు జరిగేలా పాలన అందించారన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాల మేలును చెబుతున్నారన్నారు. వైఎస్సార్ అందించిన సుభిక్షపాలన మరోమారు రావాలంటే ప్రతి ఓటరూ నిలకడగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మహా నేత రాజశేఖరరెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలనే తలంపుతో జనం కోసం వైఎస్.జగన్ ఎత్తిన జెండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె వివరించారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టాలను తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డేనని అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి ఐదు సంక్షేమ పథకాల అమలు సంతకాలతో అన్నిరంగాల ప్రజలను ఆదుకుంటారన్నారు. ఎన్నికల్లో ఫ్యానుగుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభర్థులను గెలిపించాలని ఆమె కోరారు. చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచే రకమని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలకు పాల్పడ్డారన్నారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు కూడా వెనుకాడలేదన్నారు. అయితే అదే షుగర్ ఫ్యాక్టరీని వైఎస్.రాజశేఖరరెడ్డి నిలబెట్టారన్నారు. ఆల్ ఫ్రీ ప్రకటనలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవద్దని ఆమె సూచించారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. చిత్తూరు పార్లమెం ట్‌కు తనను, పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు, చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు, ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి, కేంద్ర పాలకమండలి సభ్యుడు ఆర్.గాంధీ, రూరల్ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఎంఎస్.బాబు, రూరల్‌మండల కన్వీనర్ రాజా, ఎన్ఆర్పేట సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు.