Nishant Kumar
-
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
పార్వతీపురం: ఆయన ఆ జిల్లాకే ప్రధాన అధికారి. ఆయన తలచుకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందగలరు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్. వివరాల్లోకి వెళితే...పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నిషాంత్‌కుమార్ భార్య కరుణ బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వాగ్దేవి, వైద్యులు త్రివేణి, చిన్నపిల్లల వైద్యుడు బి.గణేష్ చైతన్య వైద్యసేవలందించి సుఖప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో అక్కడి సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన భార్య తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ భార్య కూడా ఇటీవల 108 వాహనంలో వెళ్లి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచి్చన సంగతి తెలిసిందే. -
మరణించాడనుకుంటే, మోమోలు తింటూ కనిపించాడు
భాగల్పూర్: బిహార్‌లో భాగల్పూర్కు చెందిన నిశాంత్ కుమార్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆయన మరణించాడనే భావించారు. అయితే హఠాత్తుగా ఒక రోజు నోయిడాలో మోమోలు తింటూ ఆయన బావమరిదికే దొరకడం విశేషం. భాగల్పూర్లోని నౌగాచికి చెందిన నిశాంత్ కుమార్ ఒక పెళ్లి కోసం తన అత్త మామల ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో సుశాంత్ తండ్రి తన కుమారుడిని అతని అత్తింటి సభ్యులే హత్య చేశాడని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య రచ్చ వీధికెక్కింది. సుశాంత్ బావమరిది ఒక రోజు నోయిడా వెళితే అక్కడ మోమోలు అమ్మే దుకాణం దగ్గర ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆకలేస్తోందని మోమోలు అడిగితే దుకాణం దారుడు అతనిని పొమ్మని కసురుకుంటున్నాడు. దీంతో జాలిపడ్డ రవిశంకరే డబ్బులు ఇచ్చి అతనికి మోమోలు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరేంటని అడగ్గా నిశాంత్ కుమార్ అని తమది బిహార్ అని చెప్పడంతో నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశాంత్ నోయిడాకి ఎలా చేరాడో, ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. -
సెమీస్‌లో పోరాడి ఓడిన దీపక్, నిశాంత్.. కాంస్యాలతో ముగింపు
తాషెకంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ మూడు కాంస్య పతకాలతో ముగించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. శుక్రవారం జరిగిన మూడు సెమీఫైనల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ శక్తినంతా ధారపోసి పోరాడినా ఫలితం లేకపోగా... మోకాలి గాయం కారణంగా తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) జట్టు వైద్య బృందం సలహా మేరకు రింగ్‌లోకి దిగకుండానే ప్రత్యర్దికి ‘వాకోవర్’ ఇచ్చాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన ఫ్రాన్స్ బాక్సర్ బిలాల్ బెనామాతో జరిగిన సెమీఫైనల్లో దీపక్ 3–4తో ఓడిపోయాడు. మూడు రౌండ్లలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీపక్ పంచ్‌ల ధాటికి ఒకసారి రిఫరీ బెనామాకు కౌంట్‌బ్యాక్ ఇచ్చారు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో నిర్ణీత మూడు రౌండ్ల తర్వాత రిఫరీలు బౌట్‌ను సమీక్షించి చివరకు బెనామా పైచేయి సాధించినట్లు తేల్చారు. ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షిమ్‌బెర్జనోవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో నిశాంత్ దేవ్ 2–5తో ఓటమి చవిచూశాడు. అస్లాన్‌బెక్‌పై నిశాంత్ లెఫ్ట్, రైట్ క్రాస్ పంచ్‌లతో విరుచుకుపడినా వీటిలో కచ్చితత్వం లేకపోవడంతో చివరకు కజకిస్తాన్ బాక్సర్దే పైచేయి అయింది. సైడెల్ హోర్టా (క్యూబా)తో తలపడాల్సిన నిజామాబాద్ బాక్సర్ హుసాముద్దీన్ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేకపోయాడు. దియాజ్ ఇబనెజ్ (బల్గేరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో హుసాముద్దీన్ మోకాలికి గాయమైంది. త్వరలోనే ఆసియా క్రీడలు ఉండటం... ఈ క్రీడలు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత టోరీ్నగా కూడా ఉండటంతో భారత బాక్సింగ్ వైద్య బృందం హుసాముద్దీన్ గాయం తీవ్రత పెరగకూడదనే ఉద్దేశంతో బరిలో దిగవద్దని సలహా ఇచి్చంది. దాంతో హుసాముద్దీన్ రింగ్‌లోకి దిగలేదు. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 10. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ కుమార్ (2021), హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్ (2023) కాంస్య పతకాలు గెలిచారు. -
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
సీఎం ఆస్తి కంటే కొడుకు ఆస్తే ఎక్కువ
► లాలు ఇద్దరు కొడుకుల కంటే నితీష్ ఆస్తే తక్కువ ► కన్న కొడుకు ఆస్తిలో ఆయనది మూడో వంతే ► ఓ మంత్రి గారి ఆస్తి రూ. 8.4 లక్షలేనట పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తుల వివరాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కుమారుడి ఆస్తి విలువ నితీష్ ఆస్తి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. నితీష్ ఆస్తుల విలువ రూ.59.3 లక్షలు కాగా, కుమారుడు నిశాంత్ కుమార్ రూ. 2.14 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలు ప్రసాద్ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రాపర్టీ విలువ సీఎం ఆస్తి కంటే దాదాపు రెట్టింపు ఉంది. తేజస్వి ఆస్తుల విలువ రూ. 1.12 కోట్లు. సొంత వాహనం లేని డిప్యూటీ సీఎం నూతన సంవత్సరం ప్రారంభం రోజున బిహార్ మంత్రులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వివరాలు వెలువడ్డాయి. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తనకు సొంత వాహనం లేదని చెప్పారు. ఐపీఎల్లో ఆడటం ద్వారానే తాను ఆ డబ్బు సంపాదించినట్లు తేజస్వి వెల్లడించారు. తేజస్వి అన్న, మంత్రి తేజ్ ప్రతాప్ రూ.1.5 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. తేజ్ ప్రతాప్‌కు రూ.79.2 లక్షల స్థిరాస్తి, రూ. 30 లక్షల బీఎమ్‌డబ్ల్యూ కారు, రూ.15.4 లక్షల విలువ చేసే బైక్ ఉన్నాయి. సీఎం నితీష్ ఆస్తులు రూ.12 లక్షలు పెరగగా, కుమారుడు నిశాంత్ ప్రాపర్టీ విలువ కోటి రూపాయలకు పైగా పెరిగింది. ఒక స్పోర్ట్స్ కారు, ల్యాప్ టాప్, కంప్యూటర్ సెట్, ఏసీ, ట్రేడ్ మిల్, వాషింగ్ మిషన్ ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. రిచెస్ట్.. పూరెస్ట్ మినిస్టర్స్ జల వనరుల శాఖ మంత్రి లల్లన్ సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 4.4 కోట్లు. కాగా, చివరి స్థానంలో మంత్రి అనితాదేవి ఉన్నారు. ఆస్తుల విలువ రూ.8.4 లక్షలతో అనితా దేవి చిట్టచివర నిలిచారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ దుర్మరణం
పంజాబ్‌లోని మొగ - బర్నాల రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ నిశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో మరో ముగ్గురు ట్రైనీ ఐఏఎస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ట్రైనీ ఐఏఎస్‌లు ప్రయాణిస్తున్న కారు దల గ్రామ సమీపంలో రహదారి పక్కనున్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన తమకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని చెప్పారు. గాయపడిన ట్రైనీ ఐఏఎస్‌లు పి. మల్లిక్, అజిత్ సింగ్, హర్ష కుమార్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. అలాగే డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. తక్కతాపురా నుంచి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.