మాంఝీకి ఫిబ్రవరి 20న 'బల'పరీక్ష
బీహార్ అసెంబ్లీలో విశ్వాసాన్నినిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి ముఖ్యమంత్రి జితేన్ రామ్ మాంఝిని ఆదేశించినట్టుగా
సమాచారం. ఫిబ్రవరి 20 న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ముఖ్యమంత్రి తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుందని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి. జెడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన సహచర ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.