Nithyananda case
-
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
నిత్యానందస్వామి అరెస్టయ్యేనా?
చెన్నై, టీ.నగర్: తిరుచ్చి యువతి అనుమానాస్పద మృతి వ్యవహారంలో నిత్యానందస్వామి అరెస్టయ్యేనా? అనే ఊహాగానాలు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నాయి. తిరుచ్చి సమీపంలోని నవలూరు మేలవీధికి చెందిన అర్జునన్ భార్య ఝాన్సీరాణి (56). వీరి మూడో కుమార్తె సంగీత బీసీఏ పట్టభద్రురాలు. ఇలావుండగా ఈమె చెన్నై, బెంగుళూరులోని నిత్యానందస్వామి ధ్యాన తరగతులకు వెళ్లి వస్తుండేది. ఇలావుండగా 2014 డిసెంబర్ 28న బెంగళూరు నిత్యానంద ఆశ్రమంలో ఉన్న శిష్యుడు ప్రాణానంద ఝాన్సిరాణిని ఫోన్లో సంప్రదించి తమ కుమార్తె సంగీత గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో కుమార్తె మృతిలో అనుమానం ఉన్నట్లు ఝాన్సిరాణి బెంగుళూరు రాంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2015లో తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ శరవణన్ ఆధ్వర్యంలో సంగీత మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపారు. ఇలావుండగా సంగీత తల్లి ఝాన్సీరాణి, నిత్యానంద లైంగిక హింసలకు గురైన ఆర్తిరావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. దీంతో ఆయన విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను ఇక్కడికి రప్పించి అరెస్టు చేయాలని కోరారు. దీనిపై ఝాన్సీరాణి స్పందిస్తూ సీబీఐ విచారణకు తాను అందజేసిన పిటిషన్‌పై చర్యలకు ఆదేశించడంతో తన కుమార్తె ఆత్మ తనను హతమార్చిన వారికి కచ్చితంగా దండన ఇప్పిస్తుందన్నారు. -
నేను పరమశివుణ్ణి.. నన్నెవరూ టచ్ చేయలేరు!
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. లెక్కలేనన్ని వివాదాలున్నాయి. కేసుల భయంతో ఎక్కడ తలదాచుకున్నాడో కూడా తెలియదు. కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో మాత్రం తనను ఎవ్వరూ టచ్ చేయలేరని నిత్యానంద పేర్కొన్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే.. 'నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఏ స్టుపిడ్ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు.. నేను పరమశివుడిని.. నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను' అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించాడు. అయితే, అది ఎక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.. కానీ, ఆ వీడియో మాత్రం వైర్‌గా మారిపోయింది. "No judiciary can touch me. M param shiva" : #NithyanandaSwami from an undisclosed location. pic.twitter.com/WXdZ6bGCdO — Divesh Singh (@YippeekiYay_DH) November 22, 2019 వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి? -
నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి
న్యూఢిల్లీ : వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం ఏర్పాటు చేయడమనేది అంత సులువు కాదు: కేంద్రం ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్ట్ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మాట్లాడుతూ.. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. -
ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!
న్యూఢిల్లీ: దొంగ పాస్పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్పోర్ట్కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద..దొంగ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రంజిత బాధితురాలు కాదు కాబట్టి..
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామిజీపై కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను రామనగర కోర్టు రద్దు చేసింది. నిత్యానంద అనేకసార్లు కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 6న అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో నిత్యానంద కోర్టుకు అర్జీ సమర్పించగా విచారణ జరిపిన జిల్లా సింగిల్ బెంచ్ కోర్టు జడ్జీ దినేశ్‌కుమార్ సదరు అరెస్టు వారెంట్‌ను రద్దు చేస్తూ తీర్పు నిచ్చారు. ఇదే కేసులో మరో నిందితుడు శివ వల్లభనేని అనే వ్యక్తిపై జారీ చేయబడిన అరెస్టు వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. ఇదే సందర్భంగా సినీనటి రంజిత నిత్యానందపై ఉన్న అత్యాచారం కేసులో ప్రాసిక్యూషన్‌కు సహాయంగా ఉండడానికి అవకాశం కల్పించాలని పెట్టుకున్న అర్జిని కొట్టేసిన తీర్పును ప్రశ్నిస్తూ మరోసారి పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. రంజిత బాధితురాలు కాదు కాబట్టి ఆమె పెట్టుకున్న అర్జీని తిరస్కరించడం సబబుగానే ఉందని కోర్టు మరోసారి అభిప్రాయపడింది. -
నిత్యానందకు కర్ణాటక కోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు వివాదాస్పద నిత్యానంద స్వామికి (45) కోర్టు షాకిచ్చింది. గత రెండు నెలలుగా కోర్టుగా గైర్హాజరువుతున్న నిత్యానందకు కర్ణాటకలోని రామనగర సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు విచారణకు రాకుండా నిత్యానంద స్వామి పరారీలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. ఈ సారి కోర్టు విచారణకు ఆయన తప్పకుండా హాజరు కావాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు. బెంగళూరు సమీపంలోని బిడది ఆశ్రమంల కూడా నిత్యానంద ఆచూకీ లభ్యం కాలేదని, దీంతో ఈ వారెంట్ జారీ చేశామని దర్యాప్తు అధికారి హొన్నప్ప తెలిపారు. నిందితుడు ఎక్కడ ఉన్నదీ విచారిస్తున్నామనీ, అనంతరం తదుపరి చర్యలతీసుకుంటామని చెప్పారు. అయితే వారణాసిలో చాతుర్మాస దీక్షలో ఉన్నకారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని నిత్యానంద తరపు న్యాయవాది వాదించారు. కాగా ఎనిమిదేళ్ల క్రితం అత్యాచారం, తదితర కేసులో నిత్యానంద స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010 లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన నిత్యానందకు, బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. 2017లో ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో 2018 జూన్‌లో విచారణ ప్రారంభమైంది. అలాగే మూడవ నిందితుడు నిత్యా సచ్చిదానంద, రెండవ నిందితుడు గోపాల్ రెడ్డికి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, విచారణకు సహకరించకుండా ఆగస్టు 8 నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. -
నటి రంజిత పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, తమిళ సినిమా(చెన్నై): స్వామి నిత్యానంద కేసును పునః విచారణ జరిపించాలని నటి రంజిత ఇదివరకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరో వారానికి వాయిదా పడింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద, నటి రంజిత సన్నిహితంగా ఉన్న వీడియో 2010లో ఒక టీవీ చానల్ ప్రసారం చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది నకిలీ వీడియో అంటూ నిత్యానంద ఆశ్రమానికి చెందిన ఒక నిర్వాహకుడు స్థానిక పాండిబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కొందరు ఆ వీడియోను చూపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అందులో శ్రీధర్, లెనిన్, అయ్యప్పన్, ఆర్తిరావ్ తదితరులను నేరస్తులుగా పేర్కొని దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసును సీబీసీఐడీ చేపట్టింది. ఈ కేసు విచారణ స్థానిక సైదాపేట కోర్టులో తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నటి రంజిత మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సీబీసీఐడీ కోర్టుకు దాఖలు చేసిన చార్జ్ షీటులో నేరస్తురాలిగా పేర్కొన్న ఆర్తిరావ్ ఈమెయిల్‌ను సరిగా పరిశీలించలేదని, ఆమె వినయ్ భరద్వాజ్ కలిసి కట్ర పన్నారని తన పిటిషన్లో రంజిత ఆరోపించారు. వారి ఈమెయిల్‌లను క్షుణంగా పరిశీలించాలని కోరారు. అదేవిధంగా నిత్యానంద కేసు విచారణ కర్ణాటక కోర్టులో జరుగుతోందని, అక్కడి పోలీసులు అసలు వీడియోను పరిశీలించకుండా నకిలీ వీడియోతో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల ఈ కేసుపై పునఃవిచారణ జరిపించాలని ఆమె కోరారు. కాగా ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రమేష్ సమక్షంలో విచారణకు వచ్చింది. రంజిత తరపున న్యాయవాది ఇళయరాజా హాజరై వాదించారు. ఈ పిటిషన్‌పై తగిన బదులివ్వాల్సిందిగా న్యాయమూర్తి సీబీసీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీచేసి విచారణను మరో వారానికి వాయిదా వేశారు. -
సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు
సాక్షి, బెంగళూరు : నిత్యానంద కేసు సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎస్.హెచ్ హొసగౌడ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యాచార ఆరోపణల కింద నిత్యానంద పురుషత్వ పరీక్షలకు సంబంధించిన కేసు రామనగర జిల్లా కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనశిష్యులతో కలిసి కోర్టుకు బుధవారం నిత్యానంద హాజరయ్యారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.