Nizamabad MP Kalvakuntla Kavitha
-
పప్పా... నా స్కీం కాపీ కొట్టిండు!
►గ్రామాల్లో పర్యటిస్తుంటే నా బాల్యమే గుర్తుకొస్తోంది ►మౌలిక సదుపాయల సమస్య తీవ్రంగా ఉంది ►ప్రజల రుణం తీర్చుకునేందుకే ‘మన ఊరు-మన ఎంపీ’ ►ఏటా 40 వేల మందికి శిక్షణిచ్చి ఉపాధి కల్పించే యోచన ►నిజామాబాద్ ఎంపీ కవితతో సాక్షి ఇంటర్వ్యూ.. గ్రామాల్లో నిద్ర చేస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మమ్మ ఊరికి పోయినప్పుడు అప్పుడెప్పుడో నిద్రపోయేదాన్ని. మళ్లీ చాలా ఏళ్ల తరవాత గ్రామాల్లో నిద్రపోతున్న. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై అలసిపోయి పడుకుంటే హాయిగా నిద్రొస్తుంది’’ ‘మన ఊరు-మన ఎంపీ’ పేరుతో జగిత్యాల డివిజన్లో గత నాలుగు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ గ్రామాల్లోనే రాత్రిపూట బస చేస్తున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలివి. రోజుకు ఐదు గ్రామాల చొప్పున పలు గ్రామాల్లో పర్యటించిన కవిత గురువారం జగిత్యాల నియోజకవర్గం పరిధిలో మన ఊరు-మన ప్రణాళిక తొలిదశ పర్యటన పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గురించే ఆలోచిస్తానని చెప్పడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. వాటిల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి. -సాక్షి ప్రతినిధి, కరీంనగర్ జనంతో మమేకమై తిరగడంలో ఆనందం ఉంది.. పార్లమెంట్ ద్వారా నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. సభలో ఏమాత్రం తప్పుడు సమాచారంతో మాట్లాడినా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారు. అందుకే ప్రసంగించే ముందు సమగ్ర అధ్యయనం చేస్తున్నాను. తొలిసారి ఎంపీగా ఉంటూ అధ్యయనం కోసం పార్లమెంట్ బృందం తరపున ఎక్కువ విదేశీ పర్యటనలు చేసిన వ్యక్తిని నేనే. అయితే ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో జనంతో కలిసి తిరగడంతో వచ్చే ఆనందం ఎక్కడా దొరకదు. నియోజకవర్గమంతా పర్యటించడం అసాధ్యమే... పార్లమెంట్ సభ్యుడి పరిధిలో సగటున 800 గ్రామాలుంటాయి. ఏడాదికి 90 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. నెలకు రెండు రోజులు స్టాండింగ్ కమిటీ సమావేశాలుంటాయి. విదేశీ పర్యటనలు అదనం. అట్లాంటప్పుడు ఒక ఎంపీ తన ఐదేళ్ల పదవీకాలంలో అన్ని గ్రామాల్లోని ప్రజలను కలిసి రావడం దాదాపు అసాధ్యమే. అయితే నేనెక్కడున్నా మీ కోసమే ఆలోచిస్తాననే భావన ప్రజల్లో కలగాలనే ఉద్దేశంతోనే ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ మూడు హామీలను వంద శాతం నెరవేరుస్తా గత ఎన్నికల్లో నేను మూడు హామీలను మాత్రమే ఇచ్చాను. అందులో ఒకటి నిజామాబాద్ వరకు రైల్వేలైను ఏర్పాటు. అందుకోసం రూ.140 కోట్లు కూడా మంజూరయ్యాయి. నా ఐదేళ్ల పదవీ కాలంలోనే రైల్వేలైను పనులను పూర్తి చేస్తా. రెండోది పసుపు బోర్డును ఏర్పాటు చేయించడం. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా. పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తే దేశవ్యాప్తంగా పసుపు రైతులకు లాభం జరుగుతుంది. మూడోది ఇంటింటికీ మంచినీరందిస్తానని హామీ ఇచ్చాను. అదృష్టం కొద్దీ ప్రభుత్వమే వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నీరు అందించేందుకు సిద్ధమైనందున ఆ మూడు హామీలను వంద శాతం నెరవేరుస్తాననే నమ్మకముంది. గల్లీల్లో నడవాలంటే పడవలో పోయినట్లుంది గ్రామాల్లో ఎటు చూసినా రోడ్లు, మౌలిక సదుపాయాల కొరతే వేధిస్తోంది. నడుస్తుంటే పడవలపై వెళ్లాలా అన్నట్లుగా రోడ్లు తయారయ్యాయి. మౌలిక సదుపాయల కొరత కూడా తీవ్రంగా ఉంది. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. తొందరగా పనులు చేద్దామని మనకున్న ఆచరణలోకొచ్చే సరికి విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫైళ్లు కదలాలంటే చాలా సమయం పడుతుంది. మన వ్యవస్థే అట్ల తయారైంది. ఇందులో మార్పు తీసుకురావాల్సిన అవసరముంది. రోళ్లవాగు పూర్తి చేస్తా చిన్ననీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తే జిల్లాలో 25 శాతం మేరకు వలసలు తగ్గుతాయి. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. సౌదీ వలసలు దాదాపు తగ్గు ముఖం పడతాయి. రోళ్లవాగు ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం. ఆ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తా. తెలంగాణ జాగృతి స్కిల్ డెవలెప్మెంట్ను స్థాపిస్తా తెలంగాణలో విద్యార్థులు, యువత, మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో తెలంగాణ జాగృతి పేరుతో స్కిల్ డెవలెప్మెంట్ పేరిట ఏటా 40 వేల మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం. 10వ తరగతి నుండి మొదలుకుని ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన వారంందరికీ కేంద్ర సహకారంతో వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తాం. వివిధ పరిశ్రమలతో పాటు విదేశీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఈ మేరకు విదేశీ అంబాసిడర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతం విదే శాల్లో ఉన్న మన తెలంగాణ వాళ్లకు స్కిల్ డెవలెప్మెంట్లో శిక్షణ ఇప్పించడం ద్వారా రెట్టింపు వేతనాలను పొందేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తాం. పప్పా... నా స్కీం కాపీ కొట్టిండు! నిజామాబాద్ ఎన్నికల సభలోనే ఇంటింటికీ మంచినీళ్లందిస్తానని హామీ ఇచ్చిన. ఈ మేరకు ప్రణాళిక రూపొందించిన. వాటర్‌గ్రిడ్ పేరిట మా పప్పా(ముఖ్యమంత్రి కేసీఆర్) రూపొందించిన స్కీం నా నుండి కాపీ కొట్టిందే (నవ్వుతూ). అఫ్కోర్స్ ఆ స్కీం మా పప్పా 25 ఏళ్ల క్రితమే సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అమలు చేశాడు. నిజానికి నేనే మా పప్పా స్కీంను కాపీ కొట్టా. -
దశ మారేనా!
‘మిషన్ కాకతీయ’ ⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు రాక ⇒ నీటి వనరుల నవీకరణపై సమీక్ష ⇒ హాజరు కానున్న మంత్రి పోచారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటల కింది ఆయకట్టుకు మం చిరోజులొచ్చాయి. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలవారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభో త్సవాలలో పాల్గొననున్నారు. జడ్పీ సమావేశ మందిరం లో ‘మిషన్ కాకతీయ’పై జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు శాసనసభ, శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ ‘మిషన్ కాకతీయ’ తీరు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా విడతలవారీగా 46,531 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణకు కార్యాచరణ రూపొం దించింది. ఇందులో మొదటి విడతగా 9,971 చెరువులు, కుంటలను తీసుకుంది. జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 630 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నీటిపారుదలశాఖ అధికారులు నిజామాబా ద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో 450 చెరువులు, కుంటలను సర్వే చేశారు. 158 చెరువులు, కుంటల కోసం రూ.84.89 కోట్ల నిధులు కావాలని అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వాటి మంజూ రు లభించింది. ఈ పనులకు ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు కూడ ఆహ్వానించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న టెండర్లు తెరిచి పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు ఆక్రమణలు, కబ్జాలకు గురి కాగా, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి. నిజామాబాద్ సమీపంలో రామర్తి చెరువుతో కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరలలో చిక్కుకున్నాయి. ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్‌గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు తొలగించకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ కాకతీయ’కు ప్రతిబంధకాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి హరీష్‌రావు పర్యటన ఇలా మంత్రి తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పా టు చేసిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ సిస్టమ్, మహిళా రైతుల విశ్రాంతి గృహాలను ప్రారంభిస్తారు. 11 గంట లకు జడ్పీ సమావేశ మందిరంలో ‘మిషన్ కాకతీ య’పై వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి సదాశి వనగర్ మండలం భూంపల్లి చెరువును పరిశీలిస్తారు. 4 గంటలకు గాంధారి మండలం గుజ్జులడ్యామ్, 4.45 గంటలకు కాటేవాడి డ్యామ్‌ను సందర్శిస్తారు. 5 గంటలకు గాంధారి మండల కేంద్రంలో ‘ప్రెస్‌మీట్’ నిర్వహించిన అనంతరం 5.30కు గాంధారి లోనే చిన్న నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి 6 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. -
లండన్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి
* విద్య, వైద్యం, టెక్నాలజీ, ఇండస్ట్రీకి ప్రాధాన్యం * అదే నమూనాలో రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ కృషి * లండన్ పర్యటనతో కొత్త అంశాలు నేర్చుకున్నాను * ‘సాక్షి’తో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత రాయికల్ : ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా పేరొందిన లండన్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని, ఆ నగర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఈ నెల 2నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 మంది ఎంపీలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి కవితకు అవకాశం దక్కింది. సెమినార్ ముగించుకుని స్వరాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అక్కడి అనుభవాలను ఆమె శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘ఈ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి యువ ఎంపీలు హాజరయ్యారు. 14 మందిలో ఇద్దరం మహిళా ఎంపీలం ఉన్నాం. సెమినార్లో ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన సంస్కరణలు, అక్షరాస్యత పెరుగుదల, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, హక్కుల సాధన, ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి సంస్కరణలపై చర్చ జరిగింది. భారత ఎంపీలం అందరం ఒకేచోట కలవడంతో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నాం. లండన్‌లో టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రీపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ద్వారా అనూహ్యమైన ప్రగతిని సాధించినట్టు గమనించాను. అదేరీతిలో మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడమే నాన్న (కేసీఆర్) గారి మొదటి ఆశయం. ఇందుకు నా పర్యటనలో గమనించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక లండన్‌లో తెలంగాణ ప్రవాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరాను. పెట్టుబడిదారులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించగా, మంచి స్పందన కనిపించింది. త్వరలోనే పెట్టుబడులు వస్తాయనే నమ్మకముంది. తెలంగాణ ఉద్యమం లండన్‌లోనూ విస్తరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ ఎన్నారెసైల్, తెలంగాణ జాగృతి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. నేను లండన్‌లో అడుగుపెట్టగానే వీరంతా ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వందరోజుల పాలనపై ఏకంగా ఒక పుస్తకాన్నే రూపొందించారు. దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’’ అని కవిత తన పర్యటన విశేషాలను కుప్లంగా వివరించారు.