దశ మారేనా! | Water Resources Update On the review | Sakshi
Sakshi News home page

దశ మారేనా!

Published Fri, Dec 5 2014 3:20 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

దశ మారేనా! - Sakshi

దశ మారేనా!

‘మిషన్ కాకతీయ’
చెరువుల పునరుద్ధరణకు కసరత్తు
నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు రాక
నీటి వనరుల నవీకరణపై సమీక్ష
హాజరు కానున్న మంత్రి పోచారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటల కింది ఆయకట్టుకు మం చిరోజులొచ్చాయి. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలవారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభో త్సవాలలో పాల్గొననున్నారు. జడ్‌పీ సమావేశ మందిరం  లో ‘మిషన్ కాకతీయ’పై జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు శాసనసభ, శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
 
ఇదీ ‘మిషన్ కాకతీయ’ తీరు
‘మిషన్ కాకతీయ’లో భాగంగా ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా విడతలవారీగా 46,531 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణకు కార్యాచరణ రూపొం దించింది. ఇందులో మొదటి విడతగా 9,971 చెరువులు, కుంటలను తీసుకుంది. జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 630 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

ఇందుకోసం నీటిపారుదలశాఖ అధికారులు నిజామాబా  ద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో 450 చెరువులు, కుంటలను సర్వే చేశారు. 158 చెరువులు, కుంటల కోసం రూ.84.89 కోట్ల నిధులు కావాలని అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వాటి మంజూ  రు లభించింది. ఈ  పనులకు ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు కూడ ఆహ్వానించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న టెండర్లు తెరిచి పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు.

జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు ఆక్రమణలు, కబ్జాలకు గురి కాగా, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి. నిజామాబాద్ సమీపంలో రామర్తి చెరువుతో కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరలలో చిక్కుకున్నాయి. ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్‌గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు తొలగించకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ కాకతీయ’కు ప్రతిబంధకాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
మంత్రి హరీష్‌రావు పర్యటన ఇలా
మంత్రి తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పా టు చేసిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ సిస్టమ్, మహిళా రైతుల విశ్రాంతి గృహాలను ప్రారంభిస్తారు. 11 గంట  లకు జడ్‌పీ సమావేశ మందిరంలో ‘మిషన్ కాకతీ య’పై వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతి  నిధులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి సదాశి వనగర్ మండలం భూంపల్లి చెరువును పరిశీలిస్తారు. 4 గంటలకు గాంధారి మండలం గుజ్జులడ్యామ్, 4.45 గంటలకు కాటేవాడి డ్యామ్‌ను సందర్శిస్తారు. 5 గంటలకు గాంధారి మండల కేంద్రంలో ‘ప్రెస్‌మీట్’ నిర్వహించిన అనంతరం 5.30కు గాంధారి లోనే చిన్న నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి 6 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement