no coercive action
-
వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్‌పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది. అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. -
వరవరరావు బెయిల్ పొడిగింపుపై 6న విచారణ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ బెయిల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్ఏఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్‌సింగ్ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
సీఎం గారూ.. లొంగిపోతే చర్యలుండవు: హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వారాల్లోగా అమేథి జిల్లాలోని కోర్టులో లొంగిపోవాలని, అలా చేస్తే ఆయనపై కఠిన చర్యలు ఉండబోవని అలహాబాద్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అమేథి జిల్లాలోని ఓ దిగువ కోర్టులో కేజ్రీవాల్ మీద క్రిమినల్ కేసు పెండింగులో ఉంది. ఈ కేసులో హాజరు కావాలంటూ ఆ కోర్టు ఈనెల 12న ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ హైకోర్టులో సవాలు చేశారు. దానిపై జస్టిస్ ఏఎన్ మిట్టల్ నేతృత్వంలోని లక్నో బెంచి తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్ మీద గురువారమే విచారణ ముగియగా, శుక్రవారం నాడు కోర్టు తన రూలింగ్ వెలువరించింది. అసలు అమేథీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కేజ్రీవాల్ కోరారు. తొలుత అమేథీ కోర్టులో వ్యక్తిగత హాజరును మినహాయించాలని అక్కడే కోరగా, ఆ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. అయితే.. నాలుగు వారాల్లోగా ముఖ్యమంత్రి కోర్టు ఎదుట లొంగిపోయి, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, చట్టప్రకారం ఆ కేసును విచారిస్తారని హైకోర్టు లక్నో బెంచి తెలిపింది. అమేథీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు అసలెక్కడా లేదని వ్యాఖ్యానించింది. అసలు మొత్తం కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరరాని, అయితే అలా స్టే ఇచ్చేందుకు తగిన కారణాలు ఏవీ ఆ కోర్టుకు కనిపించలేదని హైకోర్టు చెప్పింది.