వరవరరావు బెయిల్‌ పొడిగింపుపై 6న విచారణ | Relief to Varavara Rao No coercive action against till Sept 6 NIA tells HC | Sakshi
Sakshi News home page

Elgar Parishad: వరవరరావు బెయిల్‌ పొడిగింపుపై 6న విచారణ

Published Sat, Sep 4 2021 12:31 PM | Last Updated on Sat, Sep 4 2021 12:31 PM

Relief to Varavara Rao No coercive action against till Sept 6 NIA tells HC - Sakshi

ఫైల్‌ ఫోటో

ముంబై:  ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

బెయిల్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్‌ బెయిల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్‌ఏఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌సింగ్‌ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement