Bail appeal
-
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా
ముంబై: నీలిచిత్రాలు నిర్మించి యాప్స్ ద్వారా ఆన్లైన్లో వినియోగంలోకి తెచ్చారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీసులు ఈ కేసులో భాగంగా తాజాగా కోర్టు అందజేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని, బెయిల్ ఇవ్వాలని కోర్టును కుంద్రా కోరారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని మెట్రోపాలిటన్ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు ముగిసిపోయిందని కుంద్రా తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ అభిప్రాయ పడ్డారు. హాట్‌షాట్స్ యాప్స్‌లో ఉన్న శృంగార వీడియోల రూపకల్పనలో కుంద్రా క్రియాశీల పాత్ర పోషించారనే ఏ ఒక్క ఆధారాన్నీ పోలీసులు అనుబంధ చార్జ్‌షీట్‌లో పొందు పరచలేదని న్యాయవాది వివరించారు. చదవండి: రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు వాస్తవానికి సంబంధిత నటులే ఆయా వీడియోలను యాప్స్‌లోకి అప్లోడ్ చేశారన్నారు. పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కుంద్రాకు వ్యతిరేకంగా అభియోగాలకు బలంచేకూర్చే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. ఎఫ్ఐఆర్లో మొదట కుంద్రా పేరు లేదని, పోలీసులే తర్వాత జతచేశారని న్యాయవాది ఆరోపించారు. -
వరవరరావు బెయిల్ పొడిగింపుపై 6న విచారణ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ బెయిల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్ఏఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్‌సింగ్ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
‘మాలేగావ్’ నిందితులకు బెయిల్
ముంబై: మాలేగావ్ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఐఏ మహంతి, జస్టిస్ ఏఎమ్ బాదర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్ సింగ్, లోకేశ్ శర్మ, మనోహర్ నర్వారియా, రాజేంద్ర చౌదరిలకు బెయిల్ మంజూరు చేశారు. రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదనే షరతును విధించింది. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2013లో అరెస్టు అయినప్పటి నుంచి ఈ నలుగురు జైళ్లో ఉన్న సంగతి విదితమే. 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును మొదట మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థ విచారణకు తీసుకొని మైనార్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసింది. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అనంతరం ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతుల్లోకి వెళ్లింది. మెజారిటీ వర్గానికి చెందినవారే ఈ పేలుళ్లకు పాల్పర్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ.. మొదట నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై ఉన్న చార్జ్‌షీట్‌ను తొలగించింది. దీంతో 2016లో స్పెషల్ ట్రయల్ కోర్టు ఎన్ఐఏ వాదనలను అంగీకరించి, తొమ్మిది మంది నిందితులను విడుదల చేసింది. -
సుశీల్‌కు బెయిల్ తిరస్కరించిన కోర్టు
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సుశీల్.. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతోపాటు అతడిని తమకు అప్పగించాలన్న హైదరాబాద్ పోలీసుల అభ్యర్థనను సమ్మతించింది. ఈ నెల 9,10వ తేదీల్లో సుశీల్‌ను విచారించేందుకు వీలు కల్పించేలా మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్ గూడ జైలులో ఉన్నారు. -
గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆ కంపెనీ యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ అభ్యర్థనపై విచారణను సుప్రీం కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వేసవి సెలవుల అనంతరం జూలై 3న విచారించనున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.