హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సుశీల్.. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతోపాటు అతడిని తమకు అప్పగించాలన్న హైదరాబాద్ పోలీసుల అభ్యర్థనను సమ్మతించింది. ఈ నెల 9,10వ తేదీల్లో సుశీల్‌ను విచారించేందుకు వీలు కల్పించేలా మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించింది.
ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్ గూడ జైలులో ఉన్నారు.
సుశీల్‌కు బెయిల్ తిరస్కరించిన కోర్టు
Published Tue, Mar 8 2016 5:47 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement