no employment
-
సత్తా ఉంది.. ప్రోత్సాహమే లేదు..!
ఆవేదనలో కండల వీరులు ఉపాధికీ దిక్కులేక అవస్థలు కండలను చూపిస్తూ జాతీయ స్థారుులో పతకాలు కొల్లగొట్టే వీరులు వారు. తాము సాధించిన పతకాల గురించి సహచరులు, బంధువులు అభినందిస్తుంటే అవధులు లేని ఆనందం వారిది. కానీ, ఆ ఆనందం వెనక చెప్పలేని వేదన, నిట్టూర్పు. తమ కష్టాన్ని గుర్తించేవారు లేరని, ప్రోత్సహించేవారు కరువయ్యారనే ఆవేదన. ఎన్ని పతకాలు తెచ్చినా.. చివరకి బతకాడానికి కూడా ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి. ఇది బాడీ బిల్డింగ్‌లో జాతీయ స్థారుులో సత్తా చాటుతున్నా.. సరైనా ప్రోత్సాహం లేక అవస్థలు పడుతున్న గాజువాక యువకుల దయనీయ స్థితి. బాడీ బిల్డింగ్‌లో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థారుు పోటీల్లో గాజువాక ప్రాంతానికి చెందిన వారు తొలి నుంచీ సత్తా చూపుతున్నారు. మిస్టర్ విశాఖ, మిస్టర్ ఆంధ్రా టైటిల్స్ కై వసం చేసుకున్న వారూ అధికమే. వారి స్ఫూర్తితో ఎంతోమంది క్రీడాకారులు ఈ పోటీలపై ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థారుు పోటీలకు ఈ ప్రాంతం నుంచి ఏటా సుమారు 15 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అరుుతే వీరికి సరైన ప్రోత్సాహం లేక అవస్థలు పడుతున్నారు. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పతకాలు సాధించినా.. ఉపాధి లేదు వేల రూపాయలు ఖర్చుపెట్టి ఈ క్రీడలో పతకాలు సాధిస్తున్నా సరైన ఉపాధి అవకాశాలు లేక చతికిలపడుతున్నారు. మిస్టర్ విశాఖ, మిస్టర్ ఆంధ్రా స్థారుులో పతకాలు సాధించినవారు కూడా కాంట్రాక్టు కార్మికులుగా పని చేసి కుటుంబాన్ని పోషించుకోవల్సిన దుస్థితిలో ఉన్నారు. మిగతా క్రీడలకు ఇచ్చే ప్రోత్సాహం తమకు ఎందుకివ్వడం లేదంటూ వీరు ప్రశ్నిస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదు. ఖర్చు ఎక్కువే.. బాడీ బిల్డర్‌గా తయారు కావాలంటే అందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మాంసం, గుడ్లు, పాలు వంటి బలమైన ఆహారం తినాలి. తిండికి తగ్గట్టు రోజూ రెండుపూటలా కసరత్తులు చేయాలి. గాజువాక, వడ్లపూడి, పెదగంట్యాడ, నాతయ్యపాలెం, కూర్మన్నపాలెం ప్రాంతాల్లోగల జిమ్‌లలో అనేకమంది తర్ఫీదు పొందుతున్నారు. జాతీయస్థారుు పోటీల్లో పాల్గొనే క్రీడాకారుడు కనీసం అరుుదేళ్ల పాటు ఇలా కఠిన సాధన చేయాలి. ఇందుకు నెలకు సుమారు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుందని బాడీ బిల్డర్లు చెబుతున్నారు. ఈ క్రీడలో ప్రవేశించేవారు అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుచేసే అవకాశం లేకపోవడంతో సత్తా ఉన్నప్పటికీ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఉపాధి కూడా దొరకడం లేదు ఎంతో కష్టపడి బాడీ బిల్డింగ్‌లో ఎన్నో పతకాలు సాధించా.. అరుునా ఉపాధి కూడా దొరకడంలేదు. ఒక్కో బాడీ బిల్డర్‌కు కేవలం సాధన చేయడానికే నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతుంది. అంత మొత్తం భరించాలంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి. పతకాలు సాధించిన క్రీడాకారులనైనా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. బాడీ బిల్డర్లుగా పతకాలు సాధించిన ఎంతోమంది కూలీలుగా, బౌన్సర్లుగా మిగిలిపోతున్నారు. సరైన జీవిత గమ్యం ఉండటంలేదు. - కె.అప్పారావు, మిస్టర్ ఆంధ్రా టైటిల్ విజేత ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం ఒక బాడీ బిల్డర్ తయారు కావాలంటే ప్రతినెలా వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల సాధారణ కుటుంబాలకు చెందినవారు రాణించలేకపోతున్నారు. కుటుంబ పరంగా ఆర్థికంగా ఫర్వాలేదుకున్నవారు మాత్రమే సాధన చేసి అంతర్జాతీయ పోటీలకు వెళ్లగలుగుతున్నారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సామాన్య కుటుంబాల నుంచి కూడా ప్రతిభావంతులైన బాడీ బిల్డర్లు తయారవుతారు. -రాజారావు, అంతర్జాతీయ బాడీ బిల్డర్ -
ఏజ్ బారాయే..కొలువు రాదాయే
రేపటితో ముగిసిపోతున్న గడువు..లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిరాశ ఆర్భాటపు ప్రకటనలు తప్ప జాడ లేని నోటిఫికేషన్లు ఒక్క రంగంలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వని ఏపీపీఎస్సీ డీఎస్సీల ద్వారా నియమించాల్సిన పోస్టులనూ పట్టించుకోని ప్రభుత్వం వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నా లాభం లేకుండా పోయిందని నిరుద్యోగుల ఆవేదన చేసేది లేక వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న పీజీ, బీటెక్ పట్టభద్రులు సాక్షి, హైదరాబాద్:ఇదిగో గ్రూప్-1 ఉద్యోగాలు.. అదిగో టీచర్ కొలువులు.. అల్లదిగో పోలీసు జాబ్‌లు అంటూ నిరుద్యోగులను ఊరించిన రాష్ట్ర సర్కారు చివరికి వారి నోట్లో మట్టి కొట్టింది! వేల కొద్దీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఆర్భాటపు ప్రకటనలతో లక్షలాది మందిలో ఆశలు రేపి వారి జీవితాలతో చెలగాటమాడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా.. ప్రకటనలు జారీ చేసిందే తప్ప వాటి భర్తీపై చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు.. 60 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామంటూ జీవోల సాక్షిగా చెప్పిన మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. చివరికి వయోపరిమితి సడలింపు సైతం నీటి మూటే అయింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని నిరుద్యోగుల డిమాండ్ మేరకు 36 ఏళ్లకు పెంచినా ఈ రెండేళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు గరిష్ట వయోపరిమితిని దాటనున్నారు. రెండేళ్ల వయోపరిమితి సడలింపు 31-12-2013 వరకు జారీ అయ్యే నోటిఫికేషన్లకే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. రేపటితో ఈ గడువు పూర్తవుతోంది. అంటే వయో పరిమితిని పెంచినా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నమాట! ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన లు నమ్మి.. వయసు మీరుతున్న అభ్యర్థులెందరో కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నారు. చివరి ప్రయత్నంలో అయినా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కష్టపడ్డారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండానే గడువు ముగిసిపోతుండడంతో వారంతా నిరాశలో మునిగిపోయారు. ఈ రెండేళ్ల వయసు సడలింపు ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు మాత్రమే వర్తించనుండడంతో.. పీజీలు చేసిన వారు సైతం దిక్కులేని పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించారు: వివిధ శాఖలతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేస్తామని ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్యలో ప్రభుత్వం ఊరించింది. ఆర్థికశాఖ 60,841 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జీవోలు జారీ చేసింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారిలో ఆశలు రేపింది. గరిష్ట వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో 34 ఏళ్ల వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచుతూ 29-06-2013న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జీవో 518 జారీ చేశారు. అందులో రెండేళ్ల వయోపరిమితి పెంపు 31-12-2013 నాటికి జారీ చేసే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. కానీ ఈ రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ఈ గడువు మరొక్క రోజులో పూర్తి కానుంది. ఈ నెల 31లోగా అంటే.. మరో 24 గంటల్లో ఏపీపీఎస్సీ గానీ లేదా రిక్రూట్మెంట్ శాఖలు గానీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తే ఈ పెంపు వర్తిస్తుంది. లేదంటే వయసు మీరిన లక్షలాది మంది కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. 2013లో ఖాళీ పోస్టులు నోటిఫై చే సి, వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ముందుగానే సంవత్సర క్యాలెండర్ విడుదల చేశారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 13న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ జీవో 5691 జారీ చేశారు. అనంతరం ఆర్థిక శాఖ గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్‌కు చెందిన 33,738 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ 2013 జూన్‌లో 132 జారీ చేసింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11,623 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 10,865 పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థిక శాఖ మరో 24,078 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జూలైలో జీవో 183 జారీ చేసింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 1,127 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 2,443 పోస్టులు, విద్యాశాఖ ద్వారా 20,508 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం సెప్టెంబర్‌లో పలు శాఖల్లో మరో 3,025 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ ఆర్థికశాఖ జీవో 262 విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తున్నట్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్ల సంగతిని మాత్రం గాలికొదిలేసింది. దీంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి పీజీ, బీటెక్‌లు పూర్తి చేసిన యువత కూడా ఇప్పుడు వీఆర్వో పోస్టుల నోటిఫికేషన్ రావడంతో వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధం లేకున్నా.. రాష్ట్ర విభజనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధం లేకపోయినప్పటికీ ఏపీపీఎస్సీ గానీ ఇతర శాఖలు గానీ నోటిఫికేషన్లు జారీ చేయడంలేదు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోల్లో రాష్ట్ర కేడర్ పోస్టులు వెయ్యికి మించి ఉండవని, మిగతా పోస్టులన్నీ జిల్లా, జోనల్ పోస్టులేనని, వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం శోచనీయమని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం ఇటీవలే ఏపీపీఎస్సీకి మాత్రం సభ్యులను నియమించడం విచిత్రంగా ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2011లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
కంప్యూటర్ విద్య.. అదో మిథ్య
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : విద్యార్థులకు ప్రాథమిక దశనుంచే కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడకపోగా, మరోవైపు వందలాది మంది కంప్యూటర్ ఫ్యాకల్టీ (బోధనా సిబ్బంది)ని రోడ్డున పడేసింది. కంప్యూటర్ విద్య అటకెక్కడంతో ఇప్పటికే 440 మంది బోధకులు ఉద్యోగాలను కో ల్పోగా, వచ్చే నెలలో మరో 24మంది రోడ్డున పడనున్నారు. మూడేళ్ల ముచ్చట... జిల్లాలో 279 ఉన్నత పాఠశాలల్లో 2010లో కంప్యూటర్ విద్యాబోధన చేపట్టారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున ఫ్యాకల్టీలను నియమించారు. ఐదేళ్లపాటు విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించే బాధ్యతను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఒక్కొక్క పాఠశాలకు ఒక జనరేటర్, 11 కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ను సరఫరా చేయడంతోపాటు, ఇద్దరేసి ఫ్యాకల్టీలను కూడా నియమించింది. వారికి తొలుత రూ.1,400 జీతం నిర్ణయించగా, కొంతకాలానికి రూ.2వేలకు పెంచారు. 2011లో కంప్యూటర్ టీచర్స్ 3 నెలలకు పైగా సమ్మె చేయడంతో జీతాన్ని రూ.2,600కు పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న 196, నవంబర్ 15 నాటికి 24 పాఠశాలలకు కంపెనీ కాంట్రాక్టు పూర్తికావడంతో కంప్యూటర్ ల్యాబ్‌లకు తాళంవేసి కంప్యూటర్లను ప్రధానోపాధ్యాయులకు సదరు కంపెనీ అప్పగించింది. ఫ్యాకల్టీలను విధుల నుంచి తప్పించింది. దీంతో 440 మంది ఉద్యోగులు రోడ్డునపడాల్సి వచ్చింది. మిగిలిన 12 పాఠశాలల్లో పనిచేస్తున్న 24 మంది జనవరి 30నాటికి కాంట్రాక్ట్ ముగియనుండటంతో వారుకూడా నిరుద్యోగులుగా మారనున్నారు. మరో 47 పాఠశాలల కు మాత్రం 2014 చివరి వరకూ గడువు వుంది. ఇదిలావుండగా, కంప్యూటర్ ల్యాబ్‌లు మూతపడటం, ఫ్యాకల్టీలను తొలగించడంతో 232 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోరుుంది.