ఆవేదనలో కండల వీరులు
ఉపాధికీ దిక్కులేక అవస్థలు
కండలను చూపిస్తూ జాతీయ స్థారుులో పతకాలు కొల్లగొట్టే వీరులు వారు. తాము సాధించిన పతకాల గురించి సహచరులు, బంధువులు అభినందిస్తుంటే అవధులు లేని ఆనందం వారిది. కానీ, ఆ ఆనందం వెనక చెప్పలేని వేదన, నిట్టూర్పు. తమ కష్టాన్ని గుర్తించేవారు లేరని, ప్రోత్సహించేవారు కరువయ్యారనే ఆవేదన. ఎన్ని పతకాలు తెచ్చినా.. చివరకి బతకాడానికి కూడా ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి. ఇది బాడీ బిల్డింగ్‌లో జాతీయ స్థారుులో సత్తా చాటుతున్నా.. సరైనా ప్రోత్సాహం లేక అవస్థలు పడుతున్న గాజువాక యువకుల దయనీయ స్థితి.
బాడీ బిల్డింగ్‌లో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థారుు పోటీల్లో గాజువాక ప్రాంతానికి చెందిన వారు తొలి నుంచీ సత్తా చూపుతున్నారు. మిస్టర్ విశాఖ, మిస్టర్ ఆంధ్రా టైటిల్స్ కై వసం చేసుకున్న వారూ అధికమే. వారి స్ఫూర్తితో ఎంతోమంది క్రీడాకారులు ఈ పోటీలపై ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థారుు పోటీలకు ఈ ప్రాంతం నుంచి ఏటా సుమారు 15 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అరుుతే వీరికి సరైన ప్రోత్సాహం లేక అవస్థలు పడుతున్నారు. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
పతకాలు సాధించినా.. ఉపాధి లేదు
వేల రూపాయలు ఖర్చుపెట్టి ఈ క్రీడలో పతకాలు సాధిస్తున్నా సరైన ఉపాధి అవకాశాలు లేక చతికిలపడుతున్నారు. మిస్టర్ విశాఖ, మిస్టర్ ఆంధ్రా స్థారుులో పతకాలు సాధించినవారు కూడా కాంట్రాక్టు కార్మికులుగా పని చేసి కుటుంబాన్ని పోషించుకోవల్సిన దుస్థితిలో ఉన్నారు. మిగతా క్రీడలకు ఇచ్చే ప్రోత్సాహం తమకు ఎందుకివ్వడం లేదంటూ వీరు ప్రశ్నిస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదు.
ఖర్చు ఎక్కువే..
బాడీ బిల్డర్‌గా తయారు కావాలంటే అందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మాంసం, గుడ్లు, పాలు వంటి బలమైన ఆహారం తినాలి. తిండికి తగ్గట్టు రోజూ రెండుపూటలా కసరత్తులు చేయాలి. గాజువాక, వడ్లపూడి, పెదగంట్యాడ, నాతయ్యపాలెం, కూర్మన్నపాలెం ప్రాంతాల్లోగల జిమ్‌లలో అనేకమంది తర్ఫీదు పొందుతున్నారు. జాతీయస్థారుు పోటీల్లో పాల్గొనే క్రీడాకారుడు కనీసం అరుుదేళ్ల పాటు ఇలా కఠిన సాధన చేయాలి.
ఇందుకు నెలకు సుమారు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుందని బాడీ బిల్డర్లు చెబుతున్నారు. ఈ క్రీడలో ప్రవేశించేవారు అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుచేసే అవకాశం లేకపోవడంతో సత్తా ఉన్నప్పటికీ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు.
ఉపాధి కూడా దొరకడం లేదు
ఎంతో కష్టపడి బాడీ బిల్డింగ్‌లో ఎన్నో పతకాలు సాధించా.. అరుునా ఉపాధి కూడా దొరకడంలేదు. ఒక్కో బాడీ బిల్డర్‌కు కేవలం సాధన చేయడానికే నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతుంది. అంత మొత్తం భరించాలంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి. పతకాలు సాధించిన క్రీడాకారులనైనా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. బాడీ బిల్డర్లుగా పతకాలు సాధించిన ఎంతోమంది కూలీలుగా, బౌన్సర్లుగా మిగిలిపోతున్నారు. సరైన జీవిత గమ్యం ఉండటంలేదు.
- కె.అప్పారావు, మిస్టర్ ఆంధ్రా టైటిల్ విజేత
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
ఒక బాడీ బిల్డర్ తయారు కావాలంటే ప్రతినెలా వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల సాధారణ కుటుంబాలకు చెందినవారు రాణించలేకపోతున్నారు. కుటుంబ పరంగా ఆర్థికంగా ఫర్వాలేదుకున్నవారు మాత్రమే సాధన చేసి అంతర్జాతీయ పోటీలకు వెళ్లగలుగుతున్నారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సామాన్య కుటుంబాల నుంచి కూడా ప్రతిభావంతులైన బాడీ బిల్డర్లు తయారవుతారు.
-రాజారావు, అంతర్జాతీయ బాడీ బిల్డర్