వెరిఫికేషన్ లేకుండా బీపీఎస్ దరఖాస్తులు మంజూరు
నెల్లూరు: బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద దరఖాస్తు చేసుకున్న వాటిని ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేయునున్నట్లు టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగరాజు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఎల్బీఎస్(లైసెన్స్ బిల్డింగ్ సర్వేయర్లు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారి ఫైల్స్‌ను టౌన్‌ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేస్తామన్నారు. ఆన్లైన్ పద్ధతి ప్రకారం బీపీఎస్ కూడా సులభ పద్ధతిలో చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారు వారి డాక్యుమెంట్లు అప్‌లోడ్‌చేయాలని సూచించారు. సమావేశంలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సుధాకర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఎల్‌బీఎస్‌లు పాల్గొన్నారు.