విజయనగరం ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదు: ఎస్పీ
విజయనగరం ఘర్షణల్లో వ్యక్తి చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ కార్తికేయ చెప్పారు. ఎస్ఎమ్ఎస్, ఫేస్‌బుక్‌లలో అసత్య ప్రచారం జరుగుతోందని, కారకులైన 35 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. శాంతియుత వాతావరణం నెలకొనేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.
కాగా విజయనగరంలో ఉద్రికత్త పరిస్థితి కొనసాగుతోంది. పద్మావతినగర్, కన్యకాపరమేశ్వరి గుడి వద్ద సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది.