nomination documents
-
తెలంగాణ: హుషారుగా నామినేషన్ల జాతర (ఫొటోలు)
-
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఆస్తులు రూ.44 కోట్లు.. అప్పులు రూ.96 లక్షలు
హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వీటికి అదనంగా గాంధీ భార్య శ్యామలదేవికి రూ.31,65,38,000 ఆస్తులు ఉండగా అప్పులు రూ.86,34,167 ఉన్నాయి. 2014లో మాదాపూర్ ఠాణా పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఆరోపణలతో గాంధీపై ఓ కేసు నమోదైంది. గత ఎన్నికల (2018) అఫిడవిట్లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు పరిష్కారం కావడంతో ప్రస్తుతం గాం«దీకి ఎలాంటి నేర చరిత్ర లేదు. -
నామినేషన్లకు ఇంకా కొన్ని గంటలే...
హైదరాబాద్: నామినేషన్ల ఘట్టం ముగియడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. దీంతో ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిథుల రీత్యానూ గురు, శుక్రవారాలు శుభ దినాలుగా భావిస్తుండటంతో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టెన్షన్.. టెన్షన్ ఆయా పార్టీల నుంచి టికెట్లు లభించిన వారు ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, అభ్యర్థులను ప్రకటించని నియోజక వర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చార్మినార్ సీటును ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ చార్మినార్ సీటును దానికి కేటాయించనుందనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదని చెబుతున్నారు. బీజేపీలో జనసేన కిరికిరి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గ్రేటర్ పరిధిలోని సీట్లపైనా ఆ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ స్థానాలను అది ఆశించగా కుత్బుల్లాపూర్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు ఇచ్చారు. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించడంతో అది తన అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్‌ను ప్రకటించింది. ఇటీవలి కాలం వరకు బీజేపీలో ఉన్న ప్రేమ్‌కుమార్ జనసేనలో చేరి వెంటనే టికెట్ దక్కించుకున్నారు. శేరిలింగంపల్లిని జనసేనకు కేటాయించకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపుల్లో ఆ మేరకు సఫలమైనట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్కాజిగిరి, మేడ్చల్, నాంపల్లి, కంటోన్మెంట్ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు ఎవరికి దక్కనున్నాయనేది సస్పెన్స్‌గా మారింది. -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
నేడు కోనాయిపల్లికి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. -
నామినేషన్లపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు!
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ప్రారంభమైంది. అయితే ఇందులో సామాన్యులూ ఎన్నికల క్రతువులో భాగం కావొచ్చు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో తమ విద్య, వ్యాపారం, ఆస్తులు, అప్పులు, నేరచరిత, వారసత్వ సంపదను వారి అఫిడవిట్లో పొందుపరచాలి. దీన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కానీ, కొందరు తమ వివరాలను తప్పుగా చూపే అవకాశం కూడా ఉంది. అలా అభ్యర్థులు సమర్పించిన వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే, లేదంటే నామినేషన్ వేసిన వాళ్లపై ఏమైనా ఫిర్యాదులు ఎవరైనా చేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా?. నామినేషన్ వేసిన అభ్యర్థులపై నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికే ఫిర్యాదు చేయొచ్చు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాన్ని సంబంధిత అధికారికి అందించిన వెంటనే ఆన్లైన్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అనంతరం ఆ కార్యాలయ నోటీస్ బోర్డుపై అభ్యర్థుల అఫిడవిట్ ఉంచుతారు. వీటిని ఎవరైనా పరిశీలించి, సమాచారం తప్పుగా ఉన్నట్లు తెలిస్తే అభ్యంతరాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు. :::ఓటు అనేది ప్రతీపౌరుడి హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే.. హిల్లరీ క్లింటన్ -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి
కోల్‌కతా: భవానీపూర్ ఉప ఎన్నికకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్లో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదని, అందువల్ల ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలంటూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖ రాసింది. అయితే ఆ కేసులు మమతపై ఉన్నవి కాదని ఎన్నికల కమిషన్ ఇది వరకే తేల్చిందని టీఎంసీ స్పష్టం చేసింది. బీజేపీ తరఫున భవానీపూర్ బరిలో దిగుతున్న ప్రియాంక తిబ్రేవాల్‌కు, నియోజకవర్గానికి బీజేపీ ఎన్నికల చీఫ్ ఏజెంట్‌గా ఉన్న సజల్ ఘోష్ ఈసీకి లేఖ రాశారు. చదవండి: గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?: West Bengal Bypoll తనపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించడంలో మమత విఫలమైనందున ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని లేఖలో పేర్కొన్నారు. టీఎంసీ నేత, బెంగాల్ రవాణా మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మమత బెనర్జీ పేరుతో ఉన్న మరో మహిళపై ఆ కేసులు నమోదయ్యాయని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా గత ఎన్నికల్లో స్పష్టం చేసిందని చెప్పారు. -
వారణాసికి పసుపు రైతులు
ఆర్మూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పసుపు రైతుల బృందం బయలుదేరి వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నామినేషన్లు సమర్పించేందుకు జిల్లాకు చెందిన సుమారు 25 మంది రైతులు ఆర్మూర్ నుంచి గురువారం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతుల సమస్యలను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం, ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలనే లక్ష్యంగా రైతులు ఈ నామినేషన్లు వేయనున్నారు. ఇటీవల రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చర్చ జరిగేలా చేయగలిగారు. అయితే రైతుల ఐక్య కార్యాచరణ కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేస్తే సమస్య తీవ్రత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని పసుపు రైతులు భావిస్తున్నారు. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు కాకుండా పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నామినేషన్లు వేయనున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర సాధించుకోవడంతో పాటు పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ బాట పట్టిన రైతులు తమకు గెలుపు, ఓటములు ముఖ్యం కాదని తమ సమస్య దేశ వ్యాప్తంగా చర్చకు వస్తే త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. బయల్దేరిన పసుపు రైతులు.. పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని రైతు సేవా కేంద్రం సమీపానికి చేరుకున్న పసుపు రైతులు విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పసుపు రైతులు చలో వారణాసి పేరిట నామినేషన్లు వేయడానికి బయల్దేరుతున్నామన్నారు. తమకు మద్దతుగా తమిళనాడుకు చెందిన పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు దైవశిగామణి ఆధ్వర్యంలో సైతం పసుపు రైతులు తరలి వస్తున్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు సాధించుకోవడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు రైతులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 12 ఏళ్లుగా తాము పసుపు రైతుల పక్షాన ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. డిచ్పల్లి మండలంలో పసుపు పండించరన్న అరవింద్ జ్ఞానం ఏపాటితో అర్థమయిందన్నారు. డిచ్పల్లి మండలంలో రెండు వందల మంది రైతులు 300 ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారన్నారు. అనంతరం ఆర్మూర్ మండలం మామిడిపల్లి శివారు నుంచి బస్సులో హైదరాబాద్ వరకు బయల్దేరిన పసుపు రైతులకు కోటపాటి నర్సింహనాయుడు వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నుంచి వీరు రైలు ప్రయాణం ద్వారా వారణాసికి చేరుకోనున్నారు. వారణాసికి బయల్దేరిన వారిలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, కొట్టాల చిన్నారెడ్డి, వేముల శ్రీనివాస్, నాగలింగం, గురడి రాజరెడ్డి తదితరులున్నారు. కాగా వారణాసికి వెళ్లిన రైతులతో మాకు సంబంధం లేదని నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన పసుపు రైతులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.వారణాసి వెళ్లిన వారంతా టీఆర్ఎస్ నాయకులన్నారు. కమ్మర్పల్లి నుంచి.. కమ్మర్పల్లి: ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి నామినేషన్ వేయడానికి కమ్మర్పల్లి నుంచి రైతులు గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తున్నామని తెలిపారు. బద్దం రాజశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, చింత గణేష్, రాజేష్, పెంట ముత్తెన్న, బద్దం రాజేశ్వర్, రాజేందర్, శివ, మోహన్, పాషా, లక్ష్మణ్ తదితరులు వారణాసి వెళ్లిన వారిలో ఉన్నారు. ఏర్గట్ల నుంచి.. మోర్తాడ్: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీగా పోటీ చేయడానికి ఏర్గట్ల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం తరలి వెళ్లారు. పసుపు ఏర్పాటు లక్ష్యంగా ప్రధానిపై పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారణాసికి తరలివెళ్లిన వారిలో నాయకులు తుపాకుల శ్రీనివాస్‌గౌడ్, ఉపేంద్ర, బద్దం ముత్యం, దండబోయిన సాయన్న, బర్మ చిన్న నర్సయ్య తదితరులు ఉన్నారు. మాకు సంబంధం లేదు.. పెర్కిట్ (ఆర్మూర్): వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన రైతులు స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడుతూ వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని స్పష్టం చేశారు. తాము పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కినపుడు వారు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేసారన్నారు. వాళ్లకు చిత్త శుద్ధి ఉంటే అప్పుడే మాతో కలిసి వచ్చేవారన్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. మండలాల వారీగా కమిటీలు వేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రైతులు కోల వెంకటేశ్, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్, మహేందర్, నర్సయ్య, ఆరె సాయన్న, సుమన్, సంజీవ్, మోహన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, లింగా రెడ్డి, ప్రవీణ్, రైతు ప్రతినిధులు అన్వేష్ రెడ్డి, సాయా రెడ్డి, ప్రభాకర్, దేవరాం పాల్గొన్నారు. -
నేటి నుంచి నామినేషన్లు
ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల కావడంతో పరిషత్ ప్రక్రియ ఊపందుకుంది. జిల్లాలోని ప్రాదేశిక నియోజకవర్గాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా, మొదటి దశలో ఆరు, రెండో దశలో ఐదు, చివరి విడతలో ఆరు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేష్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ముందుగా మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 26 నుంచి రెండో దశ పరిషత్ ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. పరిషత్ పోరులో భాగంగా మొదటి విడతలో ఆదిలాబాద్, మావల, జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల్లోని 6 జెడ్పీటీసీ స్థానాలకు, 51 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఒకేచోట ప్రక్రియ జరుగనుంది. అయితే ఒక జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, మూడు లేదా నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారిని నియమించి సిద్ధంగా ఉంచారు. వీరు మండల పరిషత్ కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ బుధవారం వరకు కొనసాగనుంది. అంటే మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించి ఈ నెల 25న పరిశీలన చేస్తారు. అదే రోజు సాయంత్రం అర్హత అభ్యర్థుల నామినేషన్లను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో తిరస్కరణకు గురైన వాటిపై అప్పీలు చేసుకునేందుకు ఈ నెల 26 వరకు గడువుంది. తిరస్కరణకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 27న ప్రకటిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 28 వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. కాగా ఈ ఆరు మండలాలకు మే 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. -
ప్రకాశ్‌రాజ్ నామినేషన్ తిరస్కరించండి
కృష్ణరాజపురం : బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ నేత గిరీశ్‌కుమార్ నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. కర్ణాటకతో పాటు తమిళనాడులో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చొప్పున ఎన్నికల గుర్తింపు కార్డులు కలిగిఉన్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల గుర్తింపు కార్డులో ప్రకాశ్‌రాజ్ సన్నాఫ్ మంజునాథ రై అని ఉందని ఫిర్యాదులో గిరీశ్‌కుమార్ పేర్కొన్నాడు. -
ముహూర్తంతో ముందుకు
సాక్షి, ఏలూరు (మెట్రో) : సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలోని కీలకమైన మొదటి దశలోకి అడుగుపెట్టారు. కీలక ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వానికి బుధవారం తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన ఎంపీ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం మొదలు పెట్టారు. జిల్లాలో ఒక వైపు పార్టీల అధినేతలు ప్రచార పర్వాలు కొనసాగిస్తుంటే మరోవైపు ఆయా పార్టీల అభ్యర్థుల వారి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. మంగళవారం పోలవరం నియోజవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలు పెట్టారు. అధినేతలు ప్రచారాలు ఒక ఎత్తయితే అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు మరో వైపు దాఖలవుతున్నాయి. జిల్లాలో నరసాపురంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన రఘురామకృష్ణంరాజు బుధవారం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కొవ్వూరు అభ్యర్థి తానేటి వనిత నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా దెందులూరు తెలుగుదేశం అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం వారి ముహూర్తాల ప్రకారం పూర్తి చేశారు. ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా లోక్‌సభ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జ్యోత్సుల వెంకట సూర్యనారాయణ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అందించారు. మొత్తం నామినేషన్లు అసెంబ్లీకి 20 నామినేషన్లు, 26 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు 2, దీనికి గాను 4 సెట్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు ఇలా.. నరసాపురం 1 ఏలూరు 1 అసెంబ్లీ స్థానాలకు ఇలా.. కొవ్వూరు 3 నిడదవోలు 2 ఆచంట 4 ఉండి 1 తణుకు 2 తాడేపల్లిగూడెం 2 ఉంగుటూరు 2 దెందులూరు 3 పోలవరం 1 పాలకొల్లు – నర్సాపురం – భీమవరం – ఏలూరు – గోపాలపురం – చింతలపూడి – -
ముగిసిన నామినేషన్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్పంచ్ స్థానాలకు అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొంది. ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు ముగ్గురు, నలుగురు బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతుండటంతో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతగా జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అవసరమున్న గ్రామాల్లో మండల స్థాయి నాయకులే సమన్వయ పరుస్తున్నారు. మండలంలో రెండు, మూడు గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన అన్ని చోట్లా పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. చిన్న గ్రామ పంచాయతీల్లోనే ఏకగ్రీవానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై దాదాపు చేతులెత్తేశారు. నియోజకవర్గాల్లో ఆ పార్టీల ఇన్చార్జులు పంచాయతీ ఎన్నికల జోలికే వెళ్లడం లేదు. చివరి రోజు.. జిల్లాలో తొలి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177 గ్రామ పంచా యతీల సర్పంచ్ స్థానాలకు, వీటి పరిధిలోని 1,746 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు గడువు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో నామినేషన్లు స్వీకరించే స్టేజ్–1 రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద హడావుడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసేలోగా 177 సర్పంచ్ స్థానాలకు 1,155 నామినేషన్లు, 1,746 వార్డు సభ్యుల స్థానాలకు 4,205 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. బైండోవర్లతో రహస్యంగా..? సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుశాఖ సైతం హెచ్చరించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటీవల వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను పోలీసులు బైండోవర్ చేశారు. దీంతో ఒకటీ, రెండు గ్రామాల్లో రహస్యంగా వేలం పాటలు జరిగాయనే ఊహాగానాలు వినిపించాయి. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకొస్తున్నారు. -
నామినేషన్లకు నేటితో తెర
ఆదిలాబాద్‌టౌన్: తొలివిడత ప్రకటించిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి బుధవారంతో తెరపడనుంది. దీంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడతలో సర్పంచు, వార్డుస్థానాల అభ్యర్థులు నామినేషన్లు క్లస్టర్ కేంద్రాల్లో దాఖలు చేస్తున్నారు. తొలిరోజు 53 మంది అభ్యర్థులు సర్పంచు స్థానాలకు, 23 అభ్యర్థులు వార్డుస్థానాలకు నామినేషన్లు సమర్పించగా, రెండోరోజు మంగళవారం సర్పంచ్ స్థానాలకు 119, వార్డుస్థానాలకు 277 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మద్దతుదారులతో కలిసి అభ్యర్థులు నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ కేంద్రాలు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడుతున్నాయి. మండలాల వారీగా.. మొదటిరోజు నామమాత్రంగా నామినేషన్లు సమర్పించగా, రెండోరోజు ఊపందుకున్నాయి. మావల మండలంలో సర్పంచు స్థానాలకు 8 నామినేషన్లు దాఖలుకాగా, వార్డుస్థానాలకు 21, ఆదిలాబాద్‌రూరల్ మండలంలో 31 సర్పంచు స్థానాలకు, వార్డుస్థానాలకు 116 నామినేషన్లు వచ్చాయి. జైనథ్ మండలంలో 31 సర్పంచ్ స్థానాలకు, 34 వార్డుస్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదేవిధంగా బేల మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు, 47 వార్డు స్థానాలకోసం అభ్యర్థులు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. తాంసి మండలంలో 22 సర్పంచ్‌స్థానాలకు, 40 వార్డు స్థానాలకు, భీంపూర్ మండలంలో 10 సర్పంచ్ స్థానాలకు, 19 వార్డుస్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి సర్పంచ్ స్థానాలకు 172 నామినేషన్లు దాఖలుకాగా, వార్డుస్థానాలకు 300 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు నేడు చివరి గడువు గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుస్థానాల నామినేషన్ గడువు బుధవారంతో ముగియనుంది. 10న నామినేషన్ల పరిశీలన, 11న అప్పీల్‌కు ఆఖరుతేదీ, 13న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన, 21న పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం నామినేషన్లకు చివరి గడువు ఉండడంతో భారీఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. -
మీ ఇంట్లో బిడ్డలా ఉంటా..
సాక్షి, సూర్యాపేట అర్బన్ : మీ ఇంట్లో బిడ్డగా ఉంటూ సేవ చేస్తానని.. తనను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు సంకినేని నామినేషన్ పత్రాలతో సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర, సాయిబాబా దేవాలయాల్లో పూజలు చేశారు. ఉదయం పది గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేట నియోజక వర్గ ప్రజలు ఒకసారి అవకాశం కల్పిస్తే పేటను అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, నాయకులు రుక్మారావు, జుట్టుకొండ సత్యనారాయణ, నల్లగుంట్ల అయోధ్య, కట్కూరి గన్నారెడ్డి, కొణతం అప్పిరెడ్డి, హబిద్, తుక్కాని మన్మధరెడ్డి, జటంగి వెకంటేశ్యర్లు, శ్రీరాములు, సంపత్‌కుమార్,బూర మల్సూర్‌గౌడ్, వల్దాసు ఉపేందర్, రాజేష్‌నాయక్, మమతారెడ్డి, రంగినేని ఉమ, నాగమణి, శారద, పోలోజు మౌనిక, మీర్ అక్బర్, రమేష్ పాల్గొన్నారు. బీజేపీలో చేరికలు : టీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరినవారిలో మిడ్తనపల్లి మాజీ సర్పంచ్ ఎం.గంగయ్య, కందగట్ల నుంచి మద్ది నర్సింహారెడ్డి, బొద్డు మల్సూర్, పాతకోట్ల రమేష్, రవీందర్, వెంకన్న ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంకినేని వరుణ్, జాటోతు రాజేష్‌నాయక్, అస్లం, తప్పెట్ల శ్రీరాములు, ఏడుకొండలు ఉన్నారు. సూర్యాపేటరూరల్ : మండలంలోని కుసుమవారిగూడెంలో టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు సోమవారం రాత్రి సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. చేరిన వారిలో వెన్న శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గోగుల నర్సయ్య, సైదులు, రాంబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్,జుట్టుకొండ సత్యనారాయణ, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, నల్లకుంట్ల అయోధ్య, శైలేంద్రాచారి, సైదులు, రామకృష్ణ, నరేష్‌గౌడ్, వెన్న శశిధర్‌రెడ్డి, అబీద్, శ్రీనివాస్‌రెడ్డి, శివ పాల్గొన్నారు. -
అభ్యర్థులూ.. ఇవి పాటించండి!
కల్వకుర్తి టౌన్ : రానున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థులు పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సినవి.. 1) చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రసీదు 2) స్క్రూటినీకి హాజరయ్యే నోటీసు 3) ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్ 4) కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127–ఏ కింద సూచనలు 5) ప్రతిజ్ఞ లేదా శపథం చేసినట్లు ధృవీకరణ పత్రం 6) నామినేషన్ పత్రాల్లోని లోపాలతో పాటు ఇంకా జతపరచాల్సిన పత్రాల చెక్ మెమో శాసనసభకు పోటీచేసే అభ్యర్థులు ఫారం–2బీ ని సంబంధిత రిటర్నింగ్ కార్యాలయంలో ఉచితంగా ఇస్తారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్ల వరకు దాఖలు చేయొచ్చు. రెండు ఫొటోలు దగ్గర ఉంచుకోవాలి. ఇందులో ఒకటి స్టాంపు సైజు ఫొటోను నామినేషన్ పేపర్‌పై అంటించాలి. మరో పాస్సోర్టు సైజు ఫొటోను ఫారం–26(అఫిడవిట్)పై అతికించాలి. జనరల్ అభ్యర్థులైతే రూ.10వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు రూ.5వేలు చెల్లించాలి. అయితే, షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగల వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చు. (2బీలోని పార్ట్–1) నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిస్టర్ రాజకీయ పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులైతే వారి నామినేషన్లు అదే నియోజకవర్గంలోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. (2బీలోని పార్ట్–2) ఇతరులు అనగా రిజిస్టర్, గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులైతే నామినేషన్ పత్రంలోని ఫారం–2బీ, పార్ట్–3లోని (సీ) కాలం ఎదురుగా సూచించిన గుర్తుల్లో మూడింటిని ప్రాధాన్యత క్రమంలో రాయాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గం ఓటరు కానట్లయితే.. ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అ«ధికారి నుండి ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీని నామినేషన్ పత్రానికి జత చేయాలి. ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులైతే నామినేషన్ పేపర్లో వేలిముద్ర వేశాక తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు కూడా వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్ వేసిన అభ్యర్థి 48 గంటల ముందు తన పేర కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలి. అంతకు ముందు తెరచిన అకౌంట్లను అనుమతించరు. నామినేషన్ పత్రంలోని ప్రతీ కాలం తప్పనిసరిగా నింపాలి. ఆ కాలంలో నింపాల్సింది లేనట్లయితే లేదు / వర్తించదు అనేది రాయాలి. అంతే తప్ప డ్యాష్(–) వంటివి రాయకూడదు... ఏ కాలం కూడా ఖాళీగా వదలకూడదు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం–26 నోటరైజ్డ్ అఫిడవిట్లో అన్ని కాలమ్స్ నింపాలి. ఏదైనా నింపాల్సినది లేనట్లయితే లేదు / వర్తించదు అనేది రాయాలి. అంతే కానీ డ్యాష్(–)వంటివి రాయకూడదు.. ఏ కాలం కూడా ఖాళీగా వదలొద్దు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పార్ట్–3ఏ లో తప్పనిసరిగా పేర్కొనాలి. డీసీఎల్ నుంచి విద్యుత్‌కు సంబంధించి, మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ నుంచి వీటికి సంబంధించిన, ప్రభుత్వం కేటాయించిన వసతిగృహం(క్వార్టర్)లో ఉన్నట్లయితే పదేళ్ల నుండి ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ లేదా శపథం(తెలుగు మరియు ఆంగ్లం) చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను తమకు నచ్చిన దేవుడు లేదా మనస్సాక్షిపై కానీ చేయొచ్చు. రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నమూనా సంతకాన్ని ఇవ్వాలి. ఇది అభ్యర్థుల తరపున ఎవరినైనా అనుమతించేందుకు ఉపకరిస్తుంది.అదే విధంగా అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపర్లో ఎలా ముద్రించాలో తెలుగులో పేపర్ మీద రాసి ఇవ్వాలి. ఈ ఏడాది నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్ధిష్టంగా ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై పోటీ చేసే పక్షంలో, తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను సదరు పార్టీకి తెలియజేయాలి. సదరు రాజకీయ పార్టీ అభ్యర్థు నేర చరిత్ర సమాచారాన్ని తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యర్ధి పూర్వాపరాలను సదరు ప్రాంతంలో విస్తృత ప్రజాదరణ కలిగిన వార్తా పత్రికల్లో డిక్లరేషన్ రూపంలో అభ్యర్థితో పాటుగా సంబంధిత రాజకీయ పార్టీ ప్రకటించాలి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం కల్పించాలి. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కనీసం మూడుసార్లు అలా ప్రకటించాలి. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు వారి నేర సమాచారాన్ని తెలుపుతూ ఫార్మాట్–సీ–1 లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి అభ్యర్థులను పోటీకి నిలిపే రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని ఫార్మాట్–సీ–2లో ఇస్తూ డిక్లరేషన్ ప్రచురించాలి అభ్యర్థిత్వ ఉపసంహారణకు తుదిగడువు తేదీ నుండి ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు వరకు కనీసం వేర్వేరు తేదీల్లో వార్తాపత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుంది. -
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
-
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శశిధర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా పూరించి దాఖలు చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప లోక్‌సభ స్థానానికి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టరేట్లోనే నామినేషన్లు వేయాలన్నారు. ఒకవేళ ఆర్వో అందుబాటులో లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన డీఆర్వో వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్కడి ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. రాజంపేట లోక్‌సభకు నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు చిత్తూరుకు వెళ్లి ఆర్వో అయిన అక్కడి జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలలో నామినేషన్లు స్వీకరించబోరని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీన స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు లేని రాజకీయ పార్టీ అభ్యర్థికి పదిమంది బలపరచాల్సి ఉంటందని పేర్కొన్నారు. ఆర్వో గదిలోకి అభ్యర్థితోసహా ఐదు మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్వో గదికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక్కో వాహనంలో ఐదు మందికి మించకూడదన్నారు. నామినేషన్లు ముగిసే వరకు కలెక్టరేట్‌లోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను మాత్రమే దాఖలుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు అర్హత ఉంటుందని చెప్పారు. లోక్‌సభకు నామినేషన్ ఫీజు కింద రూ. 25 వేలు, అసెంబ్లీకి రూ. 10 వేలు చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మినహాయిం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్బంగా సమర్పించే ఫారం-26 (అఫిడవిట్లో) ఖాళీలు వదలరాదన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజమని రుజువైతే చర్యలు తప్పవన్నారు. అఫిడవిట్లను ఆర్వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని సీఈఓ వెబ్సైట్లో ఉంచుతామని, మీడియాకు ఉచితంగా అందజేస్తామని వివరించారు. అఫిడవిట్లలో ఖాళీలు వదిలితే అభ్యర్థికి నోటీసు జారీ చేస్తామని, ఆ అభ్యర్థి మళ్లీ నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసేందుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంకు అకౌంటును తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఓటున్న నియోజకవర్గం నుంచి సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా పొందుపరచాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద 50 వేల రూపాయల కంటేఎక్కువ ఉంటే సీజ్ చేస్తామన్నారు. ముగ్గురు వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నారని, వ్యయ నివేదికలను అభ్యర్థులు సక్రమంగా సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థికి తాము షాడో రిజిష్టర్లను నిర్వహిస్తామన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజున ఓటరు కుడి చూపుడు వేలుకు ఇంకు గుర్తు వేస్తారని తెలిపారు. స్లిప్పులు లేకపోయినా ఈసీ సూచించిన 24 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టినా ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 560 ర్యాంప్స్, టాయిలెట్స్, తాగునీరు, షామియానా వంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల వలే డిక్లరేషన్ సరిపోదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఒకరు మాత్రమే జనరల్ ఏజెంటుగా ఉంటారని, ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్న వారిని జనరల్ ఏజెంటుగా అనుమతించబోమన్నారు.