
వినతిపత్రం అందజేస్తున్న గిరీశ్‌కుమార్ నాయుడు
కృష్ణరాజపురం : బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ నేత గిరీశ్‌కుమార్ నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. కర్ణాటకతో పాటు తమిళనాడులో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చొప్పున ఎన్నికల గుర్తింపు కార్డులు కలిగిఉన్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల గుర్తింపు కార్డులో ప్రకాశ్‌రాజ్ సన్నాఫ్ మంజునాథ రై అని ఉందని ఫిర్యాదులో గిరీశ్‌కుమార్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment