శివాజీనగర(కర్ణాటక): లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. ప్రస్తుతమున్న ఏ పార్టీలోనూ నిజాయితీ లేదని, అందువల్ల ఏ పార్టీలోనూ చేరబోనన్నారు. బెంగళూరులోని మార్థాస్ ఆస్పత్రిలో జన్మించానని, చామరాజపేట, శాంతినగరలలో కొన్నాళ్లు నివాసం ఉన్నానని చెప్పారు.
‘జస్ట్ ఆస్కింగ్’ ద్వారా తాను అడిగిన ఏ ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు. పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన నేతలు.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా ఎవరో ఒకరి చెప్పుచేతల్లో ఉండిపోతున్నారని విమర్శించారు. త్వరలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment