బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ: ప్రకాశ్‌ రాజ్‌ | I Will Contest From Bangalore Central Says Prakash Raj | Sakshi
Sakshi News home page

బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ: ప్రకాశ్‌ రాజ్‌

Published Sat, Jan 5 2019 8:29 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

I Will Contest From Bangalore Central Says Prakash Raj - Sakshi

సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తాను పోటీచేసే స్థానంను ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఈ వార్తను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన పలు అంశాలపై చర్చించారు. ప్రకాశ్‌రాజ్‌ రాజకీయ ప్రకటనపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఇదివరకే అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement