
శివాజీనగర (బెంగళూరు): నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం తనకు ఇష్టం లేదని నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్‌రాజ్ అన్నారు. ఆయన గురువారం బెంగళూరులో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. మోదీపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. అయితే ఆయన విధానాలు సరైనవి కావని వ్యాఖ్యానించారు. తాను హిందూ మతం వ్యతిరేకిని కానని, మత రాజకీయాలు చేయలేదని, హిందూ మతం గురించిఏనాడూ మాట్లాడలేదనిస్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సినీ రంగానికి పూర్తి సమయాన్ని కేటాయించనని మంచి అవకాశాలువస్తే ఒకటి రెండు సినిమాలను మాత్రమే ఒప్పుకొంటానని చెప్పారు.