non immigrant visas
-
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
భారతీయులకు 10 లక్షల వీసాల జారీ
న్యూఢిల్లీ: భారత్‌లో 2023లో 10 లక్షల నాన్ ఇమిగ్రంట్ వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. ఇదే ఒరవడిని ఇకపైనా కొనసాగిస్తామని ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తమ కుమారుడి స్నాతకోత్సవానికి హాజరవుతున్న పునీత్ దర్గన్, డాక్టర్ రంజుసింగ్ దంపతులకు 10 లక్షలవ వీసాను గురువారం భారత్‌లో తమ రాయబారి గార్సెట్టి అందజేశారని వెల్లడించింది. లేడీ హార్డింజ్ కాలేజీలో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ రంజు సింగ్‌కు 10 లక్షలవ వీసా, ఆమె భర్త పునీత్ దర్గన్కు ఆ తర్వాతి వీసా జారీ అయ్యాయని వివరించింది. ప్రపంచదేశాల నుంచి అమెరికాకు అందే మొత్తం వీసా దరఖాస్తుల్లో 10 శాతం భారత్ నుంచే అని ఎంబసీ ప్రకటించింది. మొత్తం విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్ అండ్ ఎల్ కేటగిరీ(ఉద్యోగాలు)లో 65 శాతం భారతీయులవేనని కూడా తెలిపింది. 2019 కోవిడ్‌కి ముందుకంటే ఈసారి 20 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది 12 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారని పేర్కొంది. కోవిడ్ కారణంగా వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో తలెత్తిన డిమాండ్‌ను అధిగమించేందుకు చెన్నై కాన్సులేట్‌లో అదనపు సిబ్బంది నియామకం, హైదరాబాద్‌లో విశాలమైన భవనంలో నూతన కాన్సులేట్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయగలిగామని వివరించింది. -
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
డీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లు
వాషింగ్టన్: దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్‌గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్స్) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రంట్ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. -
1.4 కోట్ల మందిపై నిఘా!
వాషింగ్టన్: నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునేవారు దరఖాస్తు సమయంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా, ఫోన్, ఈ మెయిల్ వివరాలు వెల్లడించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ఏడాదికి దాదాపు 1.47 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. టూరిజం, వైద్య చికిత్స, వ్యాపారం కోసం జారీచేసే వీసాలు, హెచ్–1బీ, స్టూడెంట్ వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ రూపొందిస్తున్న కొత్త నియమావళి ప్రకారం వీరంతా తమ వ్యక్తిగత వివరాల్ని అమెరికాకు బహిర్గతం చేయడం తప్పనిసరి. సోషల్ మీడియా వివరాలు, పాస్‌పోర్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, విదేశీ ప్రయాణాల వివరాలూ చెప్పాలి.ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారిని సోషల్ మీడియా వివరాల్ని అడుగుతామని, ఈ నిర్ణయం ఏడాదికి 7 లక్షలపై ప్రభావం చూపనుందని గత సెప్టెంబర్‌లో అమెరికా వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనను మరింత విస్తరించి 1.4 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు వర్తింపచేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం దరఖాస్తుదారుడు మొత్తం 20 సోషల్ మీడియా ఫ్లాట్‌పాంల ఖాతాల వివరాలు తెలపాలి. వాటిలో అమెరికా నుంచి నడుస్తున్న ఫేస్బుక్, ఫ్లికర్, గూగుల్ ప్లస్, ఇన్‌స్ట్రాగాం, లింక్డిన్, మై స్పేస్, పింట్రెస్ట్, రెడిట్, టంబ్లర్, ట్విటర్, వైన్, యూట్యూబ్‌లు ఉండగా.. చైనా సైట్లు డౌబన్, క్యూక్యూ, సైనా వైబో, టెన్సెంట్ వైబో, యుకు, రష్యా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వీకే, ట్వూలు ఉన్నాయి. క్షుణ్నంగా తనిఖీలు.. క్షుణ్నంగా తనిఖీ చేశాకే అమెరికాలోకి అనుమతిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టాక.. గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్ కార్యాలయాల్లో దరఖాస్తుల తనిఖీని మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇప్పుడు వ్యాపార అవసరాలతో పాటు టూరిస్ట్ పర్యటనకు అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా ఈ తనిఖీల్ని కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికోలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా లేకుండా అమెరికాలోకి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న 40 దేశాలపై ఈ నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపబోవు. వీటిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. నిష్ఫల ప్రయత్నం.. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలు సేకరించాలనుకోవడం నిష్ఫల, సమస్యలు సృష్టించే ప్రయత్నమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డైరెక్టర్ హినా షంషీ అన్నారు. ఇది వ్యక్తిగత అంశాల్లోకి చొరబడడమే కాకుండా అర్థరహిత నిర్ణయమని డ్రెక్సెల్ యూనివర్సిటీలో అసోసియేట్ లా ప్రొఫెసర్ అనిల్ ఖాల్హన్ చెప్పారు. ప్రైవేటు ఖాతాల సమాచారం ఇవ్వాలని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని ఇంతకు ముందే చెప్పామని అందులో ఎలాంటి మార్పులేదని ఫేస్బుక్ పేర్కొంది. -
అమెరికా వీసాలు: పాక్ తోక కట్, భారత్ హ్యాపీ
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జారీచేసిన వీసాలలో పాకిస్తాన్‌కు ఏకంగా 40 శాతం కోత పెట్టారు. భారతీయులకు మాత్రం నాన్ ఇమ్మిగ్రెంట్ అమెరికా వీసాలు గత సంవత్సరంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. ఈ విషయం అమెరికా అధికారికంగా విడుదల చేసిన సమాచారంలో ఉంది. 2016 నాటి మార్చి-ఏప్రిల్‌లో విడుదల చేసిన వీసాల కంటే పాకిస్తాన్‌కు 40 శాతం తగ్గిపోవడం గమనార్హం. ఒబామా యంత్రాంగం గత సంవత్సరం నెలకు సుమారు 6,553 వీసాలు మంజూరు చేయగా, ట్రంప్ సర్కారు మాత్రం 3,925 వీసాలే ఇచ్చింది. ఈ సంవత్సరం మార్చికి ముందు అమెరికా విదేశాంగ శాఖ నెలవారీ జారీచేసిన వీసాల సంఖ్య వెల్లడించేది కాదు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే చెప్పేది. దాని సగటును బట్టి చూస్తే తాజా వివరాలు వెల్లడయ్యాయి. వీసాల డిమాండు ఏడాది పొడవునా ఒకే మాదిరిగా ఉండబోదని, అది మారుతూ ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. వేసవి సెలవుల్లోను, శీతాకాలం సెలవుల్లోను వీసాల సంఖ్య బాగా పెరుగుతుందని, అలాగే దేశాన్ని బట్టి కూడా మారుతుంటాయని చెప్పారు. గత సంవత్సరం భారత దేశానికి ప్రతినెలా సగటున 72,082 వీసాలు మంజూరు కాగా ఈసారి మాత్రం మార్చిలో 97,925 వీసాలు, ఏప్రిల్ నెలలో 87,049 వీసాలు వచ్చాయి. పాకిస్తాన్ సహా సుమారు 50 ముస్లిం దేశాలకు వీసాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు తగ్గిందని చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరాన్, సిరియా, సూడన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దాంతో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు 55 శాతం తగ్గిపోయాయి.