not invited
-
మెలానియా కార్యక్రమానికి కేజ్రీకి పిలుపేది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బీజేపీ పనే: ఆప్ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. -
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్జ్యోత్సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్లోని నన్కనా సాహిబ్లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
పెద్దాయనను పక్కన పెట్టేశారా?
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీకి గురువారం చేదు అనుభవం ఎదురైంది. మరోసారి ఆయనకు పార్టీ వ్యక్తులు మర్యాద మరిచారు. ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్ధితి విధించి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీలోని అగ్రశ్రేణి నాయకులందరితో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయగా దానికి అద్వానీని ఆహ్వానించకుండా పక్కన పెట్టేశారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అద్వానీ జైలుకు కూడా వెళ్లారు. అలాంటి ఆయనను అదే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీజేపీ మార్గదర్శక్ మండల్ లో సభ్యుడైన అద్వానీ.. ఆ సమావేశంలో లేని లోటు కొట్టొచ్చిన్నట్లు కనిపించింది. అదే సమయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా దుర్భుద్ధి ఈ చర్య ద్వారా స్పష్టమవుతోందని పలువురు అద్వానీ మద్దతు దారులు పెదవి విరిచారు. ఈ కార్యక్రమాన్ని అమిత్ షానే ఏర్పాటుచేసి ఆయన సమన్వయ కర్తగా వ్యవహరించారు. అయితే, గతంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అనడంతోపాటు, ప్రస్తుతం కేంద్రంలో ఒక్కరి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని కూడా అద్వానీ అన్నారు. ఈ మాటలు బీజేపీని, ఆరెస్సెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. అప్పటి నుంచి అద్వానీ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న పార్టీ పెద్దలు.. ఆయనను ఎమర్జెన్సీ కార్యక్రమానికి పిలవకుండా పక్కన పెట్టేశారు.