not pay
-
రూ.67,228 కోట్లు ఇక రానట్టే!.. వసూలు కావడం కష్టమేనన్న సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, తనకు రావాల్సిన బకాయిలు రూ.96,609 కోట్లలో రెండొంతులు అయిన రూ.67,228 కోట్లను (2022 మార్చి నాటికి) ఇక ‘వసూళ్లు కావడం కష్టమే’ అనే విభాగం కింద చేర్చింది. వివిధ కంపెనీలపై విధించిన జరిమానాలు చెల్లించకపోవడం, ఫీజుల చెల్లింపుల్లో వైఫల్యం, తన ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవవడం వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం బకాయిల్లో రూ.63,206 కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పీఏసీఎల్, సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించినవి కావడం గమనార్హం. అలాగే, మొత్తం వసూలు కావాల్సిన బకాయిల్లో 70 శాతానికి సమానమైన రూ.68,109 కోట్లు వివిధ కోర్టులు, కోర్టులు నియమించిన కమిటీల విచారణ పరిధిలో ఉన్నట్టు 2021–22 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. అన్ని మార్గాల్లో ప్రయత్నించినా కానీ, రూ.67,228 కోట్లు వసూలయ్యే అవకాశాల్లేవని సెబీ తేల్చింది. -
అధికారుల ఓవరాక్షన్.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..
సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్లోని ఓ ప్లాట్లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు. సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్ చదవండి: Hyderabad: డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా అధికారులు.. ఇదేం తీరు..! -
'జైలుకైనా వెళ్తాం కానీ రూపాయి కూడా చెల్లించం'
ఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణ కోసం యమునా నదీ పరిసర ప్రాంతాల్లో పర్యావవరణానికి హాని కలిగించారన్న కారణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థకు 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కార్యక్రమ ప్రారంభానికి ముందుగానే ఈ జరిమానాను డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలలో పేర్కొంది. అయితే దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించబోం అని స్పష్టం చేశారు. యమునా నదీ పరిసరాల్లో చేసిన ఏర్పాట్లన్ని తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసినవే అని, కార్యక్రమం ముగిసిన అనంతరం వాటిని తొలగిస్తామని ఆయన వెల్లడించారు. ప్రపంచ సాస్కృతిక సమ్మేళనం ప్రైవేటు కార్యక్రమం కాదని, లక్షలాది మంది హాజరౌతున్న ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత కార్యక్రమంగా చూడొద్దని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.