not valid
-
గృహిణుల సేవలకు వెలకట్టలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి రూ.2.5 లక్షలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవిత కాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు’అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. విచారించిన ధర్మాసనం ‘ఒక గృహిణి సేవలను రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించడం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు’అని పేర్కొంటూ రూ.6 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆర్టీసీలో ఇక పాత నోట్లు చెల్లవు
-
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మధురై: రెండు వేర్వేరు మతాలకు చెందినవారు ఒకే మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చట్టబద్ధం కాదని మద్రాసు హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. రెండు విభిన్న మతాలకు చెందిన స్త్రీ, పురుషుడు ఏదో ఒక మతాచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లదని చెప్పింది. కేవలం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే రెండు మతాల మధ్య జరిగిన వివాహాలు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఓ హిందూ మతానికి చెందిన అమ్మాయి, క్రైస్తవమతానికి చెందిన అబ్బాయి గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవి తీర్పును వెలువరించారు. దీని ప్రకారం ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముందు వారిలో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని ఆ తర్వాత జరిగే వివాహమే చెల్లుబాటవుతుందని పేర్కొంది. 1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం, మత మార్పిడి అవసరం లేకుండానే వీరి వివాహాన్ని నమోదు చేయాల్సి వుందని సూచించింది. మేజర్ అయిన ఆ యువతికి ఎక్కడికైనా వెళ్లి నివసించే హక్కు ఉందని, ఆమెకు తల్లిదండ్రులు, ఇతరుల రక్షణ అవసరం లేదని కూడా చెప్పింది.