NRAI
-
మను భాకర్‌కు విశ్రాంతి
న్యూఢిల్లీ: వచ్చే నెల భారత్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్‌లో మను భాకర్ పాల్గొనడం లేదు. ఆమె మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం 23 మంది సభ్యుల భారత షూటింగ్ జట్టును ఎంపిక చేసింది. ఇందులో పారిస్‌కు వెళ్లొచ్చిన తొమ్మిది మంది షూటర్లున్నారు. అయితే మొత్తం 23 మందిలో ఒక్క రిథమ్ సాంగ్వాన్ మాత్రమే రెండు ఈవెంట్లలో పోటీపడనుంది. ఆమె మహిళల 10 మీటర్ల, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో తలపడుతుంది. మిగతా వారంతా ఒక ఈవెంట్‌కే పరిమితం కానున్నారు. వచ్చే నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో ప్రపంచకప్ షూటింగ్ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. -
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూఢిల్లీలోని కర్ణీ సింగ్ రేంజ్లో ప్రపంచకప్ ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. ఒలింపిక్స్‌లోని 12 వ్యక్తిగత విభాగాల్లో విజేతలుగా నిలిచిన షూటర్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించనున్నారు. వీరితో పాటు గత సంవత్సరం దోహా, ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ చాంపియన్లు కూడా ఇందులో నేరుగా పాల్గొననున్నారు. ఇక ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు కూడా నేరుగా పోటీ పడనున్నారు. ఆతిథ్య హోదాలో భారత్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశాలు ఉన్నాయి. ‘ప్రపంచకప్ ఫైనల్ భారత్ లో జరగనుండటం ఇది రెండోసారి’ అని ఎన్ఆర్ఏఐ గురువారం ప్రకటించింది. -
‘ఖేల్‌రత్న’కు అంజుమ్ నామినేట్
న్యూఢిల్లీ: భారత స్టార్ రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్‌ను అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేసినట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. యువ షూటర్లను మెరికల్లా తీర్చిదిద్దుతోన్న ప్రముఖ కోచ్ జస్పాల్ రాణాను ఈ సారీ ‘ద్రోణాచార్య’ అవార్డు బరిలో ఉంచినట్లు తెలిపింది. వీరితో పాటు పిస్టల్ షూటర్లు సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, మను భాకర్... రైఫిల్ షూటర్ ఎలవనీల్ వలరివన్ పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. అర్హులైన అత్యుత్తమ షూటర్లనే అవార్డుల కోసం నామినేట్ చేశామని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ పేర్కొన్నారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల అంజుమ్ 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది. షూటింగ్లో సంచలనాలు నమోదు చేస్తోన్న టీనేజ్ షూటర్లు మను భాకర్, సౌరభ్, అనీశ్ భన్వాలాలను... ప్రపంచ స్థాయి షూటర్లుగా తీర్చిదిద్దిన 43 ఏళ్ల జస్పాల్ రాణా ఈసారి ద్రోణాచార్య పురస్కారాన్ని ఆశిస్తున్నారు. గతేడాదే రాణాకు ద్రోణాచార్య దక్కకపోవడంతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా సెలక్షన్ ప్యానల్‌ను బహిరంగంగా విమర్శించాడు. -
ఆఫర్ల తగ్గింపు దిశగా జొమాటో
ముంబయి : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే ఆఫర్లను పునఃసమీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రెస్టారెంట్ అసోసియేషన్‌తో చర్చల అనంతరం అవి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆన్లైన్ కంపెనీలు తమ వినియోగదారులకు ఇచ్చే భారీ ఆఫర్లతో తమ లాభాలు కుంచించుకుపోయాయంటూ కొన్ని రెస్టారెంట్లు తీవ్ర నిరసనను తెలియజేశాయి. దాదాపు 1800 రెస్టారెంట్లు ఆన్లైన్ కంపెనీలతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆగస్టు 15 నుంచి ఆర్డర్లను నిరాకరించాయి. ఆర్డర్లను నిలిపివేయడంపై జరిమానా చెల్లించాలని జొమాటో పంపిన నోటీసులపై రెస్టారెంట్లు తీవ్రంగా స్పందించాయి. దీంతో దిగి వచ్చిన ఆన్లైన్ కంపెనీలు వీటితో చర్చలు ప్రారంభించాయి. వీటిలో ముఖ్యమైన జొమాటో రెస్టారెంట్లతో నడుస్తోన్న వార్‌లో కాస్త వెనక్కి తగ్గింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. తమ తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటామని రెస్టారెంట్లను ట్వీట్ ద్వారా కోరారు. తమ వినియోగ దారులకు ఇచ్చే గోల్డ్ మెంబర్‌షిప్‌పై పునరాలోచన చేస్తున్నామని తెలిపారు. మనం కలసి వినియోగదారునికి ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయిద్దామని కోరారు. దీనిపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాహుల్‌సింగ్ మాట్లాడుతూ పోటీవేటలో పడి తమ రెస్టారెంట్ల ఆదాయం గణనీయంగా పడిపోయిందని వాపోయారు. ఆన్లైన్ కంపెనీలతో చర్చల ద్వారా రెస్టారెంట్ పరిశ్రమను రక్షించాలని నిర్ణయించాం అని తెలిపారు. డిస్కౌంట్లు అసంబద్దంగా ఉన్నాయని, ఆన్లైన్ కంపెనీలు వినియోగదారుల నుంచి పొందే ఆదాయాన్ని రెస్టారెంట్లతో పంచుకోవడం లేదని అన్నారు. ఫుడ్ సర్వీసెస్ ధరలు తగ్గాలి… జొమాటో గోల్డ్ ప్రొగ్రామ్.. తమ వినియోగదారులకు పెయిడ్ మెంబర్షిప్ ప్రొగ్రామ్. దీన్ని 2017 నవంబర్ నెలలో ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ కింద ఫుడ్, డ్రింక్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్ వంటి డీల్స్‌ను అందిస్తోంది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి రెస్టారెంట్లకు ఆదాయం పడిపోయింది. జొమాటో గోల్డ్‌లో జాయిన్ అయిన కొన్ని రెస్టారెంట్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఫుడ్ సర్వీసెస్ ధరలు ఇంకా తగ్గాలని గోయల్ కోరుతున్నారు. ఇప్పుడీ తాజా చర్చలతో ఆన్లైన్ ఆహార ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
అయితే హోటల్స్ లో తినకండి..!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆర్డర్స్ పై ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జ్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఏఐ) స్పందించింది. ప్రభుత్వం ప్రకటను విభేదించిన సంఘం సర్వీస్ చార్జ్ చెల్లించే ఉద్దేశం లేకపోతే హెటల్స్ లో తినొద్దంటూ ఒక ప్రకటన జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్ విధింపును పూర్తిగా సమర్ధించుకున్న ఎన్ఆర్ఏఐ సర్వీసు చార్జ్ ను ఐచ్ఛికం చేసే బదులు ప్రభుత్వం పన్నులు వదులుకోవాలని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు ఎన్ ఆర్ ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తమ వాదన మద్దతుగా రియాజ్ ఉదహరించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు. అలాగే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే సర్వీస్ ఛార్జ్ చెల్లింపులపై వినియోగదారులకు మర్యాదగా వివరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మను చంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు. కాగా సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది వినియోగదారులే నిర్ణయించుకుంటారని చెప్పిన కేంద్రం.. అది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తేల్చి చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అభినవ్ బింద్రా నేతృత్వంలో..
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత షూటర్ల పేలవ ప్రదర్శనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కమిటీకి షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించనున్నట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సమీక్షలో షూటర్ల వ్యక్తిగత ప్రదర్శను సమీక్షించిన అనంతరం వారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత్ నుంచి హీనా సిద్ధూ, మనవ్ జీత్ సింగ్ సిద్ధూ, గగన్ నారంగ్, జితూ రాయ్, అపూర్వ చండీలా తదితరులతో కూడిన షూటింగ్ బృందం రియోకు వెళ్లిన పతకం సాధించడంలో విఫలమైంది. రియోలో అభినవ్ బింద్రా, జితూ రాయ్‌లు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఈ నేపథ్యంలో భారత రైఫిల్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇటీవల భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ కూడా భారత షూటర్ల రియో ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్‌లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందంటూ షూటర్లకు ముందస్తు హెచ్చరికలు పంపారు.