NRI trs cell
-
అమెరికాలో ‘కాళేశ్వరం’ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి యూఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం–మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో మిన్నెసొటాలో ఎడెన్ప్రయరీలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవాని రామకృష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్, భీమా రవి, పాతూరి యోగేందర్, ముదిరెడ్డి రాజవెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల చిరకాలవాంఛ నెరవేరనుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని 40 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందుతుందన్నారు. -
లండన్లో టీఆర్ఎస్సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
రాయికల్ : లండన్లోని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్సెల్ ఆధ్వర్యంలో ఈస్ట్హోమ్లో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లండన్లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాదులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ సీఏం కేసీఆర్ హయాంలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం ఉందని, ఎలాంటి మతభేదాలు లేకుండా పండుగలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి నాయకుడు హైదర్ ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్రెడ్డి, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరి బోర్డు చైర్మన్ వెంకట్రెడ్డి, సభ్యులు సత్యం, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో త్వరలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్
రాయికల్: అమెరికాలో త్వరలోనే ఎన్నారై టీఆర్ఎస్ సెల్ను ప్రారంభించనున్నట్లు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ బుధవారం తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు వివిధ దేశాల్లోని ఎన్నారైలు ముందుకు వస్తున్నారన్నారు. సభ్యత్వం తీసుకునేందుకు శాఖను ప్రారంభించాలని కోరుతూ ఈ మెయిల్ పంపిస్తున్నారని తెలిపారు.