NTR Gardens
-
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
సచివాలయానికి సరికొత్త రహదారులు
సాక్షి, హైదరాబాద్: భవనం వైశాల్యం, నిర్మాణ ప్రత్యేకతల పరంగా దేశంలోనే అతిపెద్ద సచివాలయం. దేశంలో మరే ప్రభుత్వ భవనంపై లేనట్టుగా ఐదంతస్తులకు సరిపడా వైశాల్యంతో రెండు భారీ గుమ్మటాలు.. మంత్రిత్వ శాఖలకు సంబంధించి అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా ఏర్పాటు.. పీక్ అవర్స్‌లో ఆ భవనం చుట్టూ గంటకు 20 వేల వాహనాల ప్రవాహం.. నిత్యం వేల మంది సందర్శకులు వచ్చే ప్రాంగణం.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేందుకు వచ్చే వీఐపీలు.. అలాంటి కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిపెట్టుకుని ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు రాకుండా రాష్ట్ర కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రోడ్లను నిర్మించగా, మిగతా రోడ్లను విశాలం చేయటంతోపాటు మార్పుచేర్పులు చేస్తున్నారు. నలువైపులా నాలుగు రోడ్లు.. సచివాలయం చుట్టూ 4 రోడ్లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాహనాలు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపే వెళ్లే పరిస్థితి లేకుండా ఎటునుంచి ఎటైనా వెళ్లేలా రోడ్లను సిద్ధం చేశారు. కొత్త భవనాన్ని నిర్మించే సమయంలోనే రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఓ ప్రైవేటు సంస్థతో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయించారు. కొన్ని రోడ్లు శాస్త్రీయంగా లేకపోవడంతో ట్రాఫిక్ అయోమయం కావడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారమిస్తుందని తేలింది. దీంతో వాటన్నింటిని సరిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆమేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి.. ♦ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లుంబినీ పార్కువైపు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా ఉండటంతో లుంబినీ పార్కు వద్ద రోడ్డును మూసేశారు. సచివాలయ ప్రధాన ద్వారం ముందు నుంచి 110 అడుగుల వెడల్పుతో డబుల్ రోడ్డు నిర్మించారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి ట్రాఫిక్‌ను కొత్త రోడ్డుతో అనుసంధానించారు. ♦ బీఆర్కే భవనం వైపు మళ్లే చోట ఆదర్శనగర్ రోడ్డును వెడల్పు చేస్తున్నారు. అక్కడే ఉన్న కూడలిని మూసేసి వాహనాలకు ఎల్ఐసీ కార్యాలయం వద్ద యూ టర్న్ ఆప్షన్ ఇచ్చారు. ♦ లక్డీకాపూల్ నుంచి వచ్చే రోడ్డును సచివాలయ భవనం వద్ద వెడల్పు చేశారు. ఇక్కడి పెట్రోలు బంకును కూడా తరలించి అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు. ♦ సచివాలయ భవనం వెనక వైపు భవనాన్ని ఆనుకుని రోడ్డును వెడల్పు చేశారు. ఇక్కడే మసీదును నిర్మిస్తున్నారు. దానికి బయటి నుంచి కూడా జనం వచ్చేలా రోడ్డును సిద్ధం చేశారు. ♦ సచివాలయం–ఎన్టీఆర్ గార్డెన్స్ మధ్య (తెలంగాణ సచివాలయం పాత గేటు) ఉన్న రోడ్డును ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని ప్రతిష్టించే ప్రాంతం రోడ్డు వరకు వెడల్పు చేయనున్నారు. ♦ రోడ్లను ఇష్టమొచ్చినట్లు మార్చారని, కూడళ్లను మూసేశారని, ఇది వాహనదారులకు ఇబ్బందిగా ఉందన్న విమర్శలూ కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తాజా మార్పులు దోహదపడతాయని అధికారులంటున్నారు. -
HYD: ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ బంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై సందర్శక ప్రాంతాలను మూసేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18(శుక్రవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీ నుంచి వాటిని తెరుస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను 16వ తేదీ రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని ఇది వరకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు.. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్‌బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ వాహనదారులకు సూచించారు. అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. -
ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా– ఈ చాంపియన్ పోటీలకు భాగ్య నగరం సన్నద్ధమవుతోంది. ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. నెక్లెస్ రోడ్డులో 2.8 కిలోమీటర్ల ట్రాక్ పనులను ప్రారంభించారు. డిసెంబర్ నాటికల్లా ట్రాక్‌ను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీసేవిధంగా ఈ ట్రాక్‌ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల నిర్వహణపై అధ్యయనం కోసం గత నెలలో హెచ్ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్‌ను సందర్శించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ నేతృత్వంలో హెచ్ఎండీఏ సీనియర్ ఇంజినీర్లు, ప్లానింగ్ అధికారులు ఆగస్టులో సియోల్‌లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్ ట్రాక్ తరహాలోనే హైదరాబాద్‌లో ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులు ప్రారంభించారు. ఇదీ రూట్.. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కి.మీ మార్గంలో ట్రాక్ ఏర్పాటు చేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎనీ్టఆర్ గార్డెన్‌లోంచి వెనక వైపు ఉన్న మింట్ కాంపౌండ్ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్ ప్లాన్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన 12 ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్ తొలిసారిగా వేదిక కానుంది. గంటకు 250 కి.మీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు. డిసెంబర్లో డెమో ... ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబర్ నాటికి ట్రాక్‌ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు మొత్తం 40 లూప్స్ (రౌండ్స్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్‌షిప్ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకు వీలుగా ట్రాక్ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. (చదవండి: జవహార్‌నగర్‌లో కర్చీఫ్ లేకుండా తిరగలేం) -
అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు
ఖైరతాబాద్: అదుపుతప్పిన వేగంతో వచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ఘటన ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఐమాక్స్ రోటరీ చౌరస్తా వైపు వస్తున్న హోండా క్రిస్టా కారు (టిఎస్07 యుహెచ్2043) ఎన్టీఆర్ గార్డెన్ దాటగానే అదుపు తప్పిన వేగంతో రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. కారులో భార్యాభర్తతో పాటు రెండు సంవత్సరాల బాబు ఉన్నారు. బాబు తలకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరు కారులోంచి దిగి ఆటోలో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారును క్రేన్ సాయంతో అక్కడి నుంచి తొలగించారు. -
ఎన్టీఆర్ మెమోరియల్‌ను ముట్టుకోం
♦ ఆ పక్కనున్న చోట 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ♦ ఏడాదిపాటు అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల నిర్వహణ ♦ డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి ♦ కడియం చైర్మన్‌గా విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: సచివాలయం పక్కనే 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారక కేంద్రాన్ని ముట్టుకోకుండా ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న పార్టీ జోన్లో 125 అడుగుల అంబేడ్కర్ క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా, డెరైక్టర్ ఎం.వి.రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనంటే గౌరవముందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్స్, పక్కనున్న ప్రాంతం మొత్తం కలుపుకుని 39 ఎకరాలుంటే ఎన్టీఆర్ స్మారకం 4 ఎకరాలను మినహాయించి మిగతా 35 ఎకరాల పరిధిలో అంబేడ్కర్ స్క్వేర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తై అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించే ఉత్సవాలను, హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు. 14న సీఎం శంకుస్థాపన ఈ నెల 14న ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంత్యుత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కడియం తెలిపారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో శిథిలావ స్థలో ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్స్‌కు సీఎం అదే రోజు భూమిపూజ చేస్తారని, బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రానికి, ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న పార్టీ జోన్లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉన్న కార్ల పార్కింగ్ ప్రదేశంలో అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14కల్లా అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటును పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాం గం లేకపోతే ఆర్టికల్(3)లో ఆయా అంశాలను పొందుపరచకపోయి ఉంటే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఉండేది కాదన్నారు. దూరదృష్టితో అంబేడ్కర్ పొందుపరచిన ఆర్టికల్ (3) ప్రకారమే కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఉద్యమించి విజయం సాధించిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌ను వర్గానికో, కులానికో, ఏ కొందరికో పరిమితం చేయరాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజ లను ప్రభావితం చేసిన మహనీయుడిగా ఆయన్ను స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకయ్యే వ్యయంపై అంచనా వేయలేదని, ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైర్మన్‌గా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, ఎంపీలు బాల్క సుమన్, పసునూరు దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపకుడు మల్లేపల్లి లక్ష్మ య్య, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, హెచ్ఎండీఏ కమిషనర్, ఎస్సీ డీడీ డెరైక్టర్ ఉండనున్నారు. ఎస్సీశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఎస్సీశాఖ కార్యదర్శి బి.ఎం.డి. ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నయా సాల్ సంబురాలు
-
సిటీ అంతా ఫుల్‌జోష్
-
సండే సిటీ సందడి