Number portability
-
ఎస్సెమ్మెస్ ఆఫర్ లేకుంటే.. పోర్టబులిటీ అవకాశం ఇవ్వరా?
న్యూఢిల్లీ: టారిఫ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా యూజర్లు నంబర్ పోర్టబిలిటీ కోసం ఎస్ఎంఎస్ పంపించే సౌలభ్యం కల్పిస్తూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని టెలికం ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, యూజర్లు అందరికీ ఆదేశాలను అమలు చేయడానికి వొడాఫోన్ ఐడియాకు సముచిత సమయం ఇవ్వాలని ట్రాయ్‌కు సూచించింది. వేరే ఆపరేటర్‌కు మారాలనుకునే యూజర్లకు టెలికం కంపెనీలు తప్పనిసరిగా పోర్టింగ్ కోసం ఎస్ఎంఎస్ను పంపే సౌలభ్యం కల్పించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ 2021 డిసెంబర్లో ఆదేశించింది. టారిఫ్ ఆఫర్లు, వోచర్లు, ప్లాన్లతో దీన్ని ముడిపెట్టరాదని సూచించింది. కొన్ని ప్లాన్లలో ఎస్ఎంఎస్ సదుపాయం లేదనే సాకుతో నిర్దిష్ట టెల్కోలు.. నంబర్ పోర్టబిలిటీ కోసం సంక్షిప్త సందేశాలు పంపనివ్వకుండా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వొడాఫోన్ ఐడియా.. టీడీశాట్‌ను ఆశ్రయించింది. ఒక యూజరు .. ఎస్ఎంఎస్ లేని ప్యాక్‌ను ఎంచుకున్నారంటేనే వారు పోర్టింగ్ హక్కులను వదులుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని వాదించింది. కానీ వీటిని టీడీశాట్ తోసిపుచ్చింది. అయితే, పోర్టబిలిటీ కోసం పంపే ఇలాంటి ఎస్ఎంఎస్లను ఉచితం చేయకుండా, ఎంతో కొంత చార్జీలు వర్తింపచేసేలా ట్రాయ్ తగు వివరణ జారీ చేయాలని పేర్కొంది. చదవండి: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..! -
వోడాఫోన్ వర్సెస్ జియో.. ఆ సర్వీసులపై ట్రాయ్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే (పోర్టింగ్) యూజర్లకు టారిఫ్ వోచరు, ప్లాన్లతో సంబంధం లేకుండా ఎస్ఎంఎస్ సదుపాయాన్ని తక్షణం కల్పించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు అందరికీ దీన్ని వర్తింపచేయాలని సూచించింది. పోర్టింగ్ కోసం నిర్దిష్ట కోడ్‌ను (యూపీసీ) పొందడానికి 1900కు ఎస్ఎంఎస్ పంపే వెసులుబాటు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లు 1900కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను కొత్త ఆపరేటరుకు తెలియజేయడం ద్వారా నెట్వర్క్ మారవచ్చు. అయితే, ప్రస్తుతం కొన్ని టెల్కోలు పలు ప్లాన్లలో ఎస్ఎంఎస్ ప్యాకేజీలను అందించడం లేదు. దీంతో వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్ల ప్రీపెయిడ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎస్ఎంఎస్ ప్యాకేజీ లేదన్న కారణంతో .. 1900 నంబరుకు పోర్టింగ్ రిక్వెస్ట్ పంపనివ్వకుండా మోకాలడ్డుతున్నాయి. ఎస్ఎంఎస్లు కావాలంటే మరింత అధిక టారిఫ్ ప్లాన్‌నో లేదా ప్రత్యేకంగా ప్యాకేజీనో ఎంచుకోవాల్సి వస్తోంది. టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్న కొత్త విధానంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విధానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కొత్త ప్లాన్లపై రిలయన్స్ జియో సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. వీఐఎల్ ఇటీవల 18–25% మేర టారిఫ్‌లు పెంచింది. కొత్త టారిఫ్‌ల ప్రకారం 28 రోజుల వేలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ ప్లాన్ రేటును ఎస్ఎంఎస్ సర్వీసు లేకుండా రూ. 99కి పెంచేసింది. రూ. 179కి మిం చిన ప్లాన్లలోనే ఎస్ఎంఎస్ సర్వీసు అందిస్తోంది. చదవండి: ట్రాయ్ నిద్రపోతోందా? హీటెక్కిన బాయ్‌కాట్ ట్రెండ్