nuziveedu seeds
-
నాలుగేళ్లలో రెట్టింపు ఆదాయం.. అదే నూజివీడు సీడ్స్ లక్ష్యం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్న కొత్త ఉత్పత్తుల ఊతంతో వచ్చే నాలుగైదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని విత్తనాల సంస్థ నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్) నిర్దేశించుకుంది. ప్రస్తుతం కాటన్ సీడ్స్ మార్కెట్లో దాదాపు 16–17 శాతంగా ఉన్న వాటాను 30 శాతానికి చేర్చుకోవాలని భావిస్తోంది. కంపెనీ నెలకొల్పి 50 ఏళ్లయిన సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ ఎం. ప్రభాకరరావు ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నూజివీడు సీడ్స్ ఆదాయం రూ. 1,100 కోట్లుగా ఉంది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా వెచ్చిస్తున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. తమ ఆదాయాల్లో 5 శాతం పైగా కేటాయిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 13 ప్రాసెసింగ్ సెంటర్లు, 29 కోల్డ్ స్టోరేజీలు..గిడ్డంగులు ఉన్నట్లు తెలిపారు. 1 లక్ష మంది పైగా రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నట్లు, 20 వేల మంది పైచిలుకు రిటైలర్ల ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులకు సేవలు అందిస్తున్నట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు. 1973లో మండవ వెంకటరామయ్య ప్రారంభించిన నూజివీడు సీడ్స్‌కి ఒక దశలో కాటన్ సీడ్ మార్కెట్లో మూడో వంతు వాటా దక్కించుకుంది. అప్పట్లో ఏర్పాటైన అనేక విత్తన సంస్థలు కాలక్రమంలో కనుమరుగైనప్పటికీ ఎన్ఎస్ఎల్ పటిష్టంగా నిలదొక్కుకుందని ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ సీఎస్‌వో శరద్ ఖురానా, డైరెక్టర్ పి. సతీష్ కుమార్, సీఎఫ్‌వో వి. శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఆ సొమ్మును డిపాజిట్ చేయండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహికో మోన్శాంటో బయోటెక్ (ఎంఎంబీఎల్) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని తమవద్ద నగదు లేదా బ్యాంకు గ్యారంటీ రూపంలో డిపాజిట్ చేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. సబ్ లైసెన్స్ అగ్రిమెంట్ కింద పత్తి విత్తన కంపెనీలకు ఎంఎంబీఎల్ బీటీ టెక్నాలజీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 2015లో నూజివీడు సీడ్స్‌తో సహా పలు విత్తన కంపెనీలు ఎంఎంబీఎస్ బీటీ టెక్నాలజీ అసమర్థమైందని.. అందుకే రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించి రుసుము చెల్లింపులను నిలిపేశాయి. తరవాత మిగిలిన కంపెనీలు వివాదాన్ని పరిష్కరించుకున్నా... ఎన్ఎస్ఎల్ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించలేదు. గతేడాది దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా రూ.117 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఎన్ఎస్ఎల్కు స్పష్టంచేసింది. ఎన్ఎస్ఎల్ చెల్లించకపోవటంతో మహికో సంస్థ దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీలు చేసే అవకాశముంది కనక తాము అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు నూజివీడు సీడ్స్ తెలియజేసింది. -
నూజివీడు సీడ్స్ ఐపీవోకి అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూజివీడు సీడ్స్ పబ్లిక్ ఇష్యూకి మర్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి మంజూరు చేసింది. ఈ ఇష్యూ ద్వారా రూ. 125 కోట్ల నూతన మూలధనం జారీ చేయడంతో పాటు, ప్రమోటరు,్ల ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ వాటాలను కొంత మేర విక్రయించనున్నాయి.