Nuziveedu Triple IT
-
చంద్రబాబు పాలనలో ట్రిపుల్ ఐటీలు నిర్వీర్యం
సాక్షి, నూజివీడు: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఉదయం జనరల్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంట్రన్స్ పరీక్షల్లో 1,2,3, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి సురేష్, స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, ఛాన్స్లర్ కేసీరెడ్డి అడ్మిషన్ సర్టిఫికేట్లు అందజేశారు.(చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ) ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విలువలతో కూడిన విద్యనందించేందుకు ట్రిపుల్ ఐటీ లకు ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో త్వరలో స్కిల్ డవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.(చదవండి: ఆలయాలపై దాడులు: ఏపీ సర్కార్ సీరియస్) చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేశారన్నారు. ట్రిపుల్ ఐటీలకు చెందిన రూ.188 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి మళ్లించి చంద్రబాబు రాక్షస ఆనందం పొందారన్నారు. అధ్యాపక సిబ్బంది సమస్యలపై గవర్నింగ్ కౌన్సిల్లో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
యోగా పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీకి ప్రథమస్థానం
సాక్షి, నూజివీడుః కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ యోగా చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ముగిశాయి. మహిళా విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థినులకు ప్రథమ స్థానం దక్కగా, పురుషుల విభాగంలో చెన్నై అన్నా యూనివర్శిటీ దక్కించుకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ యోగా విద్యార్థులు మూడు ప్రధాన బహుమతులను గెలుచుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, వీసీ హేమచంద్రారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. -
నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని ఆత్మహత్య
-
బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ..
సాక్షి, కృష్ణా : బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ మాట్లాడుతూ ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్. భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ చేస్తూ హాస్టల్ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భాగ్యలక్ష్మి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్‌హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు. వందల మంది బాధితులు.. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్‌గాని, వైస్‌చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది. నాసిరకంగా అల్పాహారం.. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. మెస్‌లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఆహారాన్ని పరిశీలించిన వీసీ విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్‌లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్‌ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
నూజివీడు/రేగిడి(రాజాం): కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాకుళం జిల్లా బూరాడ గ్రామానికి చెందిన విద్యార్థిని డబ్బాడ రమాదేవి(16) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బూరాడలో నివసించే డబ్బాడ అప్పల నాయుడు(ట్రాక్టర్ డ్రైవర్), వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె రమాదేవి టెన్త్‌లో 10 జీపీఏతో ట్రిపుల్ఐటీకి ఎంపికైంది. క్యాంపస్‌లోని కే4 బాలికల హాస్టల్లో 69వ నంబర్ గదిలో ఉంటున్న రమాదేవి శనివారం తెల్లవారుజామున గది వెలుపల కారిడార్ పక్కన కిందపడి ఉండటాన్ని మహిళా సెక్యూరిటీ గార్డు గమనించి హాస్టల్ కేర్ టేకర్‌కు, చీఫ్ వార్డెన్‌కు సమాచారం అందించింది. బాలికను క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. రమాదేవి అస్వస్థతతో మరణించిందా? లేక భవనంపై భాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాన్నా.. చదవలేకపోతున్నా.. రమాదేవి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి ఫోన్ చేసి, తాను సెకెండ్ మిడ్ పరీక్షలకు చదువుతున్నానని చెప్పింది. అయితే, ఇంత సమయం వరకు చదివితే ఆరోగ్యం పాడవుతుందని.. ఇక నిద్రించాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్ కట్ చేసింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ ఫోన్ చేసింది. తండ్రి అప్పలనాయుడు ఫోన్ ఎత్తగా.. తాను రాత్రి 12 గంటల వరకు చదివిందంతా మరచి పోతున్నానని, ఏమీ గుర్తుండటం లేదని.. తనకు చనిపోవాలనిపిస్తోందని చెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి.. ఆమెను ఓదార్చి ఇంట్లోనే ఉన్న పెద్ద కుమార్తె భవానికి ఫోన్ ఇచ్చాడు. తన చెల్లికి ఆమె నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల తర్వాత తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటలకు ఆమె చనిపోయినట్లు కళాశాల నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
-
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
కృష్ణా: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో భోజన వసతి సరిగా లేదంటూ 2వేల మందికి విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం!
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా, లింగాపాలెంకు చెందిన 22ఏళ్ల నవీన్, బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం మూడో అంతస్థు పైకి చేరుకున్న నవీన్ కిందకు దూకేశాడు. వెంటనే అతడిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే నవీన్ మృతి చెందాడు. నవీన్ ... క్యాంపస్ ఇంటర్వ్యూలో విఫలమై తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్టు సమాచారం. కొంతకాలంగా కడుపునొప్పితో కూడా బాధపడుతున్నట్టు ట్రిపుల్ ఐటి డైరెక్టర్ చెబుతున్నారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కాలేజీ ఇంఛార్జ్ మాత్రం ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోయినట్లు చెబుతున్నాడు. మృతుడి సోదరుడు ఇదే కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.