బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ మాట్లాడుతూ ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్. భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది.